వైభవోపేతం.. శ్రీనివాసుని కల్యాణం
జంగారెడ్డిగూడెం : గోకుల తిరుమల పారి జాతగిరిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీని వాసుని కల్యాణాన్ని శని వారం వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజు కల్యాణ మహోత్సవంలో తొలుత విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, హోమ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యుల పర్యవేక్షణలో ఋత్విక్ స్వాములు జరి పారు. రెడ్డి శ్రీనివాసరావు దంపతులు, తానింకి సత్యనారాయణ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన కోరా నాగేశ్వరరావు, రేవతి దంపతులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మ¯ŒS బిక్కిన సత్యనారాయణ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.