ఉద్యోగం పేరుతో మంత్రి మోసం
కేకే.నగర్: ఉద్యోగం పేరుతో 23 మంది వద్ద రూ.13 లక్షలు తీసుకుని మోసం చేసిన అన్నాడీఎంకే మంత్రిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అన్నాడీఎంకేకు చెందిన ఐటీ శాఖ మంత్రి, తిరువణ్ణామలై నార్త్ జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి ఎన్.సుబ్రమణియన్, పార్ట్ టైం ఉపాధ్యాయుల పోస్టులకు, గ్రామ సహాయకులు, గ్రంథాలయ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి రూ.13 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఆ డబ్బులను తమకు ఇప్పించాలని పోరూర్ యూనియన్ కమిటీ అధ్యక్షుడు ఎ.రాజన్‌ను కోరారు.
ఆయన లెటర్‌ప్యాడ్‌లో ముఖ్యమంత్రి జయలలితకు ఈ విషయాన్ని వివరిస్తూ లేఖ పంపారు. ఫేస్బుక్, వాట్సాప్‌లలో ఈ సమాచారం దావానంలా వ్యాపించింది. అందులో తాను వేలూరు యూనియన్ కమిటీ అధ్యక్షుడు అన్నాడీఎంకే కార్యదర్శిగా ఉన్నానని తిరువణ్ణామలై నార్త్ జిల్లా కార్యదర్శి ఎన్.సుబ్రమణియన్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని 23 మంది వద్ద రూ.13 లక్షలు తీసుకుని ఇప్పటికీ మూడేళ్లు అయ్యిందని, ఇంతవరకు ఉద్యోగాలు ఇప్పించలేదని బాధితులకు సరైన సమాధానం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని దీనిపై వెంటనే పరిష్కారం సూచించాలని అందులో పేర్కొన్నారు.
దీనిద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అన్నాడీఎంకే యూనియన్ కార్యదర్శి లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో మంత్రి చేసిన మోసం వెలుగు చూడటం అన్నాడీఎంకే కార్యకర్తల మధ్య సంచలనం కలిగించింది.