Paruchuri Global Foundation
-
పరుచూరి సురేంద్ర దారుణ హత్య
►బెంగళూరు, తమిళనాడు వాసులకు సుపరిచితుడు ►అత్యంత సమీపం నుంచి దుండగుల కాల్పులు ►సంజయ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఘటన తెలుగు ప్రజల దిగ్భ్రాంతి ►ఆర్థిక లావాదేవీలతో విభేదాలు బెంగళూరు: ప్రవాసాంధ్రులకు సుపరిచితుడు, పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ అధినేత పరుచూరి సురేంద్ర కుమార్ ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో బెంగళూరులోని తన ఇంటి సమీపంలో దారుణ హత్యకు గురయ్యాడు. బైక్‌లో వచ్చిన ఇద్దరు దుండగులు అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. సంజయ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. అందరూ దీపావళి సంబరాల్లో ఉండగా తూటాలు పేలినా అవి దీపావళి పటాసులుగా భావించారు. మృతుడి బంధువుల వివరాల మేరకు ... ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన పట్టాభిరామ్, శేషమ్మ కుమారుడైన పరుచూరి సురేంద్ర కుమార్ (51) పదహారేళ్ల క్రితం బెంగళూరుకు చేరుకున్నాడు. ఆయన అవివాహితుడు. ఇక్కడి ఆర్టీ నగరలో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఇక్కడి హెబ్బాలలో పరుచూరి గోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో ఓ కార్యాలయం ఉంది. కర్ణాటకతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రియల్ఎస్టేట్, సెక్యూరిటీ ఏజెన్సీలు ఇతని వ్యాపార లావాదేవీల్లో ముఖ్యమైనవి. అరుుతే ఆర్టీ నగర్లో చాలా కాలంగా ఉన్న ఆయన ఇటీవల సంజయ్‌నగర్‌లోని హనుమంతయ్య కాలనీలో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఆ ఇల్లు సంజయ్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వంద మీటర్ల దూరంలో ఉంది. జంతు ప్రేమికుడైన సురేంద్ర దేవనహళ్లి ఇంటర్నేషనల్ ఎరుుర్‌పోర్టుకు దగ్గర ఉన్న కమ్మహళ్లి గ్రామంలో రెండేళ్ల క్రితం రెండు ఎకరాల స్థలాన్ని ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడే దాదాపు 75 మేలు జాతి కుక్కలను పెంచుతున్నాడు. ఇదిలా ఉంటే సంఘటన జరిగిన ఆదివారం తన సహాయకుడు దీపాంకర్‌తో కలిసి సురేంద్ర హొసూరు వెళ్లి టపాసులు కొని హెబ్బాళలోని తన కార్యాలయం చేరుకుని పూజలు నిర్వహించాడు. అనంతరం దేవనహళ్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. అక్కడ కొద్దిసేపు ఉన్న అనంతరం రాత్రి 10.30 గంటలకు సంజయ్‌నగర్‌లో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు.. తన సహాయకుడైన దీపాంకర్‌తో కలిసి కారులో ఇంటి వద్దకు చేరుకున్న సురేంద్రకుమార్ లోనికి వెళ్లడానికి వాహనం నుంచి కిందకు దిగాడు. ఇంతలో నల్లటి పల్సర్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అత్యంత సమీపం నుంచి సురేంద్రపై నాటు తుపాకులతో కాల్పులకు జరిపారు. శరీరంలోని ఎడమవైపు కణితి భాగంలోకి ఒక బులెట్, మరొకటి మెడలోకి దూసుకుపోయారుు. మరో నాలుగు బులెట్లు ఛాతిపై భాగంలోకి చొచ్చుకుపోయారుు. దీంతో సురేంద్ర కుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీపావళి కావడం టపాసుల శబ్ధం వల్ల తూటాల శబ్ధం చుట్టుపక్కల వారికి వినబడలేదని తెలుస్తోంది. ఘటన నుంచి తేరుకున్న వెంటనే దీపాంకర్ హుటాహుటిన సురేంద్రను స్థానిక ఎం.ఎస్ రామయ్య ఆసుపత్రికి చేర్చారు. అరుుతే అప్పటికే సురేంద్ర మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విషయం తెలుసుకున్న స్థానిక సంజయ్‌నగర్ పోలీసులు ఘటనాస్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. సమాచారం అందుకున్న సురేంద్రకుమార్ కజిన్ కెప్టన్ చౌదరితో పాటు ఇతర బంధువులు సోమవారం ఆసుపత్రికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి తీసుకువెళ్లారు. అక్కడ నేడు (మంగళవారం) అంత్యక్రియలు నిర్వహించనున్నామని కెప్టన్చౌదరి తెలిపారు. ఆర్థిక లావాదేవీలే కారణమా? విశ్వసనీయ సమాచారం మేరకు పరుచూరి సురేంద్ర ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మధుర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయమై స్థానికుడు, తన దగ్గర పనిచేసే కపిల్ సారస్వత్‌కు వివిధ దఫాలుగా రూ. 3 కోట్లు ఇచ్చాడు. అరుుతే ఇతను స్థలాలను కొనుగోలు చేయక మోసం చేశాడని ఇటీవల సురేంద్ర గుర్తించాడు. దీంతో ఈ ఏడాది మే 6న అక్కడి స్థానిక పోలీస్స్టేషనల్లో కపిల్ సారస్వత్పై కేసు నమోదు చేయగా జూన్ 8 నుంచి నిందితుడు మధుర జైళ్లో ఉంటున్నాడు. ఇక కేరళకు చెందిన ఫర్గీస్ అనే ఫైనాన్సియర్‌తో సురేంద్రకుమార్‌కు రూ.20 లక్షల విషయమై రెండు నెలల ముందు గొడవలు మొదలయ్యారుు. మరికొన్ని ఆర్థిక లావాదేవీల విషయంపై కూడా కర్ణాటకకు చెందిన కొంతమందితో సురేంద్రకుమార్‌కు మనస్పర్థలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుపారీ ద్వారా సురేంద్రకుమార్‌ను హత్య చేరుుంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక సోమవారం ఉదయం ఆసుపత్రి వద్దకు వచ్చిన అదనపు కమిషనర్ (వెస్ట్) చరణ్‌రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా యన మీడియాతో మాట్లాడుతూ... ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన విభేదాల కారణంగానే పరుచూరి హత్య జరిగి ఉంటుందని, ఈ విష?ంగా నగరంలోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. గన్మెన్లు ఏమైనట్లు ? ఇటీవల సంస్థను, తనను మోసం చేశారన్న నేపథ్యంలో ఓ మేనేజర్‌ను పరుచూరి సురేంద్ర కుమార్ విధుల నుంచి తొలగించాడు. మరోవైపు వ్యాపార లావాదేవీల విషయమై శత్రువులు పెరిగిపోవడంతో రక్షణ కోసం పరుచూరి సురేంద్ర నలుగురు ప్రైవేటు గన్మెన్లను ఏర్పాటు చేసుకున్నారు. అరుుతే ఘటన సమయంలో ఒక్క గన్‌మెన్ కూడా లేక పోవడం గమనార్హం. పోని దీపావళికి అందరూ సెలవులపై ఉన్నారనుకున్నా ఈ విషయం ప్రత్యర్థులకు ఎలా తెలిసిందనేది పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఘటన సమయంలో దీపాంకర్‌తో పాటు డ్రైవర్, మరో సహాయకుడు కూడా ఘటన స్థలంలోనే ఉన్నారని, ఆరుుతే కాల్పులు జరిగినప్పటి నుంచి వారిద్దరూ పరారీలో ఉండటం గమనార్హం. ఇక దీపాంకర్ కూడా గాయపడిన సురేంద్రను ఆసుపత్రిలో చేర్చకుండా మొదట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడని అనంతరం పోలీసుల సూచనతో స్థానికులతో కలిసి సురేంద్రను ఆసుపత్రికి తరలించాడన్న వాదన కూడా వినిపిస్తోంది. ఘటన వెనుక సురేంద్ర సంస్థలో పనిచేసిన ఓ మాజీ మేనేజర్‌తో పాటు ప్రస్తుతం సురేంద్రకు సహాయకుడిగా ఉన్న వ్యక్తి హత్యకు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
శ్రీరామ దివ్యక్షేత్రంలో లక్ష దీపాల వెలుగు
భద్రాచలం: శ్రీరామ దివ్యక్షేత్రం లక్ష దీపాలతో దే దీప్యమానంగా వెలిగింది. రామాలయం, స్వామి వారి కల్యాణ మండప ప్రాంగణమంతా గురువారం భక్తులతో కిటకిట లాడింది. బెంగళూరుకు చెందిన పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ సహకారంతో భద్రాచలంలో తొలసారిగా జరిగిన ఈ అరుదైన వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక పుష్యమి లక్ష దీపోత్సవంలో తాము కూడా ఒక దీపాన్ని వెలిగించాలని భక్తులు ఎంతో ఆసక్తి కనబరిచారు. లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భద్రాచలం ఆర్డీవో ఆర్. అంజయ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి, ఫౌండేషన్ చైర్మన్ పరుచూరి సురేంద్రకుమార్ ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద వారు దీపాలను వెలిగించి లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కల్యాణ మండపంలో దీపాలను వెలిగించారు. దీపాలంకరణలో పాల్గొనేందుకు మొత్తం 76 గ్రూపులు పేర్లను నమోదు చే యించుకోగా వీరిలో 24 గ్రూపులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఆర్డీవో, ఈవో, ఫౌండేషన్ ైచె ర్మన్ చేతుల మీదగా లాటరీ ప్రక్రియను పూర్తయ్యింది. ఎంపికైన గ్రూపులలోని భక్తులంతా వారికి కేటాయించిన సెక్టార్లలోకి వెళ్లి దీపాలంకరణ చేశారు. కార్తీక మాసం కావటంతో మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గర్భగుడి ప్రాంగణం, రాజగోపురం ఎదుటగా భక్తులు వెలిగించిన దీపాలతో రామాలయం దేదీప్యమానంగా కనిపిం చింది. ఆకట్టుకున్న దీపాలంకరణలు కార్తీక పుష్యమి లక్ష దీపోత్సవంలో భాగంగా కల్యాణ మండప ప్రాంగణంలో మహిళలు చేసిన దీపాలంకరణ లు ఆకట్టుకున్నాయి. పిల్లలు, వృద్ధులు సైతం ఉత్సాహంగా దీపాలంకరణలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. దీపాలంకరణ నడుమ దేవుళ్ల రూపాన్ని అమర్చటంతో, అందంగా పూలతో వాటికి అలంకరణ చేశారు. వర్షంతో ఏర్పాట్లకు కొంత ఆటంకం కలిగినప్పటికీ భక్తి భావంతో ఉన్న మిహ ళలు ఇవేమీ లెక్కచేయకుండా దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్వామి, కెప్టెన్ చౌదరి, ఫౌండేషన్ మేనేజర్ కపిల్, ఏఈవో శ్రావణ్ కమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు శివానంద ఆశ్రమం వారు ముద్రించిన హనుమాన్ చాలీసా పుస్తకాన్ని ఆవిష్కరించారు. భద్రాద్రి ఆలయాభివృద్ధికి సహకారం భద్రాచలం రామాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పరుచూరి సురేంద్రకుమార్ అన్నారు. భద్రాచలం పౌరసమితి ఆధ్వర్యంలో పట్టణంలోని జీయర్ మఠంలో సురేంద్రకుమార్‌కు పౌర సన్మానం చేశారు. పట్టణ ప్రముఖులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి రామయ్యపై తనకు ఉన్న భక్తిభావంతోనే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు, లిటిల్‌ఫ్లవర్స్ విద్యాసంస్థల చైర్మన్ మాగంటి సూర్యం, యోగి సూర్యనారాయణ, సర్పంచ్ భూక్యా శ్వేత, అడుసుమిల్లి జగదీష్ పాల్గొన్నారు. -
భద్రాద్రిలో లక్ష దీపోత్సవం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కార్తీక పుష్యమి లక్ష దీపోత్సవం గురువారం వైభవంగా జరిగింది. బెంగళూరుకు చెందిన పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ వారి సహకారంతో భద్రాచలంలో తొలిసారిగా నిర్వహించిన ఈ అరుదైన వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణ మండపలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 24 సెక్టార్లలో దీపాలను అలంకరించారు. లాటరీ ద్వారా ఎంపిక చేసి, వారితో దీపాలంకరణ చేయించారు. ప్రోత్సాహక బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ పరుచూరి సురేంద్రకుమార్ మాట్లాడారు. భద్రాద్రి రాముని సన్నిధిలో దీపోత్సవాన్ని నిర్వహించాలనే ఆసక్తితోనే ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు.