భద్రాద్రిలో లక్ష దీపోత్సవం | lakh Deepothsava in Bhadrachalam | Sakshi
Sakshi News home page

భద్రాద్రిలో లక్ష దీపోత్సవం

Published Fri, Nov 14 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

భద్రాద్రిలో లక్ష దీపోత్సవం

భద్రాద్రిలో లక్ష దీపోత్సవం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కార్తీక పుష్యమి లక్ష దీపోత్సవం గురువారం వైభవంగా జరిగింది. బెంగళూరుకు చెందిన పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ వారి సహకారంతో భద్రాచలంలో తొలిసారిగా నిర్వహించిన ఈ అరుదైన వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

కల్యాణ మండపలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 24 సెక్టార్‌లలో దీపాలను అలంకరించారు. లాటరీ ద్వారా ఎంపిక చేసి, వారితో దీపాలంకరణ చేయించారు. ప్రోత్సాహక బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ పరుచూరి సురేంద్రకుమార్ మాట్లాడారు. భద్రాద్రి రాముని సన్నిధిలో దీపోత్సవాన్ని నిర్వహించాలనే ఆసక్తితోనే ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement