passport service centres
-
Passport: ఇక నుంచి వేగంగా పాస్‌పోర్టుల జారీ
సాక్షి హైదరాబాద్: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ల కోసం చాలాకాలం నిరీక్షించకుండా మరిన్ని సాధారణ, తత్కాల్ అపాయింట్మెంట్లను పెంచినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బేగంపేట ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సాధారణ పాస్‌పోర్టు అపాయింట్మెంట్లు 50, తత్కాల్ 50, అమీర్‌పేట పీఎస్కేలో సాధారణ 25, తత్కాల్ 25, టోలిచౌకి పిఎస్కెలో సాధారణ 25, తత్కాల్ 25, నిజామాబాద్ తత్కాల్ 20 అపాయింట్మెంట్లను పెంచినట్లు ఆయన తెలిపారు. పెంచిన అపాయింట్మెంట్లు 16వ తేది నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. గత డిసెంబర్ మాసంలో 5 ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్టు సేవా క్రేందాల్లో వరుసగా 4 శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా అపాయింట్మెంట్ల లభ్యత పెంచినట్లు వివరించారు. దీనివలన గతంలో తత్కాల్ అపాయింట్మెంట్ల లభ్యత సమయం 30 రోజులకు, సాధారణ పాస్‌పోర్టు అపాయింట్మెంట్ల లభ్యత సమయం 40 రోజులకు తగ్గిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ఎఫ్ఐఆర్లు.. జరిమానాలు..రెడ్ నోటీసులు) -
అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
న్యూయార్క్: దేశంలోని మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో ఆయన ‘పాస్‌పోర్ట్ సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించాక మాట్లాడారు. పౌరులకు పాస్‌పోర్టు సేవలను సులభతరం చేసే లక్ష్యంతో వచ్చే మార్చి కల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. దీని వల్ల ప్రతి ఒక్కరికీ 50–60 కిలోమీటర్ల దూరంలోనే పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 365 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయన్నారు. వచ్చే నాలుగు నెలల్లో తమ మంత్రిత్వ శాఖ వివిధ దేశాల్లో ఉన్న భారత పౌరుల కోసం అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలోనూ పాస్‌పోర్ట్ సేవా పథకాన్ని ప్రారంభించనుందని తెలిపారు. విదేశాల్లో భారతీయులు పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. -
పాస్‌పోర్ట్ ఇక ఈజీ!
భువనేశ్వర్: పాస్‌పోర్ట్ కోసం ఇక వందలకొద్దీ కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేదు. జిల్లా కేంద్రాల్లోనే పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 800 పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకేసింగ్ మంగళవారం మీడియాకు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సబ్కా సాత్ సబ్కా వికాస్ చర్చా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 150 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. రానున్న రెండేళ్లలో అన్ని జిల్లా ప్రధాన పోస్టాఫీసుల్లో మరో 800 ఓపెన్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పాస్‌పోర్టు కోసం ప్రజలు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విదేశీ మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ కలిసి ఈ సేవలు అందించనున్నాయని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా, పారదర్శకంగా పాస్‌పోర్టు సేవలు అందుతాయని ఆయన భరోసాయిచ్చారు. దేశంలో ఇప్పటికే పలు ప్రధాన పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించారు.