అడిగిన వెంటనే సాగునీరు
పోటో 28బీడీఎన్202ఃఅలీసాగర్ ఎత్తిపోతలపథకం వద్ద మొక్కలు నాటుతున్న మంత్రి
28బీడీఎన్203ఃఅలీసాగర్ నీటిని విడుదలకు స్విచ్ఆన్ చేస్తున్న మంత్రి,ఎమ్మెల్యేలు
నవీపేట : రైతుల పంటపొలాలకు సాగునీటిని విడుదల చేయాలని అడిగిన పది గంటల్లోపే ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేశామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రోజుల తరబడి వేచిచూడాల్సి వచ్చేందన్నారు. మండలంలోని కోస్లీ శివారులో గోదావరి నది ఒడ్డున గల అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా గురువారం ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌తో కలిసి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటిని వదలాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటే రోజుల సమయం పట్టేదన్నారు. కానీ అలీసాగర్ ద్వారా నీటిని వదలాలని బుధవారం రైతులు కోరగా వెంటనే హైదరాబాద్ వెళ్లి సీఎంతో చర్చించానన్నారు. గోదావరిలో నీరుండడంతో వెంటనే పథకాల ద్వారా నీటిని వదలాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, కలెక్టర్‌తో మాట్లాడి నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకంతో నిజామాబాద్, నవీపేట, రెంజల్, ఎడపల్లి, డిచ్పల్లి, మాక్లూర్ మండలాల్లోని 53,793 ఎకరాలు సాగులోకి వస్తాయని పేర్కొన్నారు. అందుబాటులోని చెరువులు, కుంటలు నింపుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. అలీసాగర్ నీటిని విడుదల చేయాలని బుధవారం మంత్రి పోచారంను కోరగా వెంటనే హైదరాబాద్ వెళ్లి సీఎం అనుమతి తీసుకురావడంపై ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో యాదిరెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎల్లం, నీటి పారుదల శాఖ ఎస్ఈ గంగాధర్, డీఈఈ పంకజాదేవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావ్, ఎంపీటీసీ సభ్యురాలు నర్సుబాయి, నాయకులు బెలాల్ నర్సింగ్‌రావు, కాశి సంజీవ్, కమలాకర్‌రావు, భూమన్న, రుక్మయ్య, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.