‘తపాలా’ శరాఘాతం
బ్యాంకులతో సహా ఎన్నో కేంద్ర ప్రభుత్వశాఖల విధివిధా నాలు మారుతున్నా తపాలాశాఖ మాత్రం తన తీరును మార్చు కోవటం లేదు. తపాలా కార్యాలయాల్లో బీమాతో కూడిన చిన్న మొత్తాల పొదుపు చేసుకునే మదుపుదారులపై విచిత్రంగా సేవా పన్ను విధిస్తోంది. ఉద్యోగస్తుల తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలపై (ఏడాదిలోపు ఖాతాలపై 3.5 శాతం, ఏడాది దాటితే 1.75 శాతం) రుసుమును సేవా పన్ను రూపంలో జూన్ 2015 నుండి నెల నెలా వసూలు చేస్తున్నారు.
నెల నెలా పొదుపు చేసుకునేది పేద, మధ్యతరగతి ప్రజానీకమే. అలాంటి పొదుపుదారులపై సేవాపన్ను వసూలు చేయాల నుకోవడం ఎందుకో కేంద్ర ప్రభుత్వానికే తెలియాలి. పొదుప రులను ప్రోత్సహించే విధంగా ఉండాల్సిన తపాలాశాఖ విధానాలు వారిని నిరుత్సాహపరచేవిగా ఉంటున్నాయి. ఇప్ప టికే ప్రైవేటు బ్యాంకులతోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకులు పోటా పోటీగా అనేక పొదుపు పథకాలతో ప్రజల ముంగిటకు వస్తున్నాయి. కనుక తపాలాశాఖ సేవాపన్నును రద్దు చేసి ప్రజల నుండి మరింత పొదుపు సేకరించడానికి సరళమైన పొదుపు పథకాలు ప్రవేశపెట్టాలి.
పసునూరి శ్రీనివాస్ మెట్పల్లి, కరీంనగర్ జిల్లా