Pataudi Cup
-
మూడవ రోజు ఆట: ఇంగ్లాండ్ 352/9
నాటింగహమ్: పటౌడీ కప్ లో భాగంగా నాటింగ్ హమ్ లో జరుగుతున్న తొలిటెస్టులో భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలు విజృభించడంతో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ 78, అండర్సన్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడవ రోజు ఆటలో భారత బౌలర్లు భువనేశ్వర్ కు 4 వికెట్లు, ఇషాంత్ శర్మ 3, షమీకి రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో రాబ్సన్ 59, బల్లాన్స్ 71, బ్రాడ్ 47 పరుగులు చేసి అవుటయ్యారు. 105 పరుగులు వెనకపడి ఉన్న ఇంగ్లాండ్ చేతిలో మరో వికెట్ ఉంది. -
భారత్ ఆలౌట్ 457, ఇంగ్లాండ్ 43/1
-
భారత్ ఆలౌట్ 457, ఇంగ్లాండ్ 43/1
పటౌడీ ట్రోఫిలో భాగంగా నాటింగ్ హమ్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు 457 పరుగులకు ఆలౌటైంది. రెండవ రోజు ఆటలో ఓపెనర్ విజయ్ 146, కెప్టెన్ ధోని 82 పరుగులు చేసి అవుటవ్వగా, టెయిలెండర్స్ భువనేశ్వర్ కుమార్ 58, మహ్మద్ షమీ 51 పరుగులు చేయడం రెండవ రోజు ఆటలో విశేషం. అండర్సన్ కు 3, బ్రాడ్, స్టోక్స్ రెండేసి వికెట్లు, ప్లంకెట్, ఆలీకి చెరో వికెట్ దక్కింది. ఆతర్వాత తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు 9 పరుగుల వద్ద కెప్టెన్ కుక్ వికెట్ కోల్పోయింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 43/1 పరుగులు చేసింది. రోబ్సన్ 20, బాలెన్స్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్ షమీకి కుక్ వికెట్ దక్కింది.