patient realtions
-
గాంధీ ఆసుపత్రిలో మహిళా జూనియర్ డాక్టర్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై దాడి జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో విధి నిర్వహణలో ఉన్న సమయంలో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి బంధువుల్లో ఒకరు దాడికి పాల్పడ్డాడు. వైద్యురాలి అప్రాన్ లాగి దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అతడి బారి నుంచి ఇతర సిబ్బంది.. వైద్యురాలిని కాపాడారు.డాక్టర్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అయితే రోగి బంధవులు దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.చదవండి: RG Kar Case: చర్చల లైవ్ టెలికాస్ట్ డిమాండ్#AartiRavi#attackon_GANDHI_doctorAttacks on lady doctors still continued Lady doctor attacked by patient publicly in casualty in Gandhi hospital Hyderabad.Hatsoff to patient attendent and patient care worker immediately responded Kolkata episode everyone know how a lady… pic.twitter.com/9sXS8pDhG7— Dr vasanth kumar gourani (@vasant5577) September 11, 2024 -
నిలోఫర్‌లో గందరగోళం.. సిబ్బందిపై ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ చిన్నపిల్లల హాస్పిటల్ నిలోఫర్‌లో బుధవారం గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జియాగూడకు చెందిన 3 నెలల బాలుడు ధృవన్‌కు జ్వరం రావడంతో తల్లిదండ్రులు నిలోఫర్‌కు తీసుకొచ్చారు. బాబుకు పరీక్షలు చేసిన వైద్యులు.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించారు. ఆ తర్వాత బాలుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో తల్లిదండ్రులు వైద్యం నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, A పాజిటివ్ రక్తానికి బదులు ‘0’ పాజిటివ్ రక్తం ఎక్కించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని ఆసుపత్రి యాజమాన్యం బెదిరింపులకు దిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అవగాహనా రాహిత్యం వల్లే.. కాగా, ధృవన్ అంశంపై నిలోఫర్ సూపరెండెంట్ మురళీకృష్ణ స్పందించారు. బాలుడు ధృవన్ ఆరోగ్యం బాగుందని స్పష్టం చేశారు. అవగాహనా రాహిత్యం వల్ల బాలుడి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారన్నారు. ఆరు నెలల వరకు బ్లడ్ గ్రూప్ నిర్థారణ కాదని, ‘0’ గ్రూప్ విశ్వధాత కావున సదరు బ్లడ్ గ్రూప్ బాబుకి ఎక్కించామని ఆయన వెల్లడించారు. రక్తం ఎక్కించిన తర్వాత బాలుడికి ఎలాంటి ఇబ్బంది జరుగలేదన్నారు. ధృవన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడని, ప్రస్తుతం బాబుకు ప్రాణాపాయం లేదని వివరించారు. -
వైద్యురాలిని దూషించిన రోగి బంధువులు
రాయదుర్గం అర్బ¯న్ : మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేస్తే తీసుకెâýæ్లకుండా కాలయాపన చేయడంపై ప్రశ్నించిన తనను రోగి బంధువులు దుర్భాషలాడారని వైద్యురాలు గీతాజ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కేబీప్యాలెస్ ఏరియాకు చెందిన సాకమ్మ (55) కోమాలోకి వెళ్లడంతో బంధువులు గురువారం ఉదయం 10.30గంటలకు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యురాలు గీతాజ్యోతి పరిశీలించి, డెరిఫ్లి¯న్ ఇంజక్షన్ తో పాటు డీఎ¯Œన్ఎస్, ఆక్సిజ¯న్ పెట్టారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట అవుతున్నా రోగిని తీసుకెâýæ్లకపోవడాన్ని గమనించిన వైద్యురాలు రోగి బంధువైన కళావతిని ప్రశ్నించారు. మగవాళ్లు లేరని, వచ్చిన తర్వాత తీసుకెâýæతామని చెప్పింది. అయితే పక్కనే ఉన్న రోగిబంధువుల్లో ఒకరైన అశోక్‌ను చూసి మగవాడే కదా.. తీసుకెâýæ్లవచ్చు కదా అని వైద్యురాలు అన్నారు. దీంతో రెచ్చిపోయిన అశోక్ ఇష్టారాజ్యంగా వైద్యురాలిని దూషించాడు. అతని ప్రవర్తన పట్ల అక్కడే ఉన్న నర్సు వసంతకుమారి, వైద్యులు మన్సూర్ ఆలీఖా¯న్, సిబ్బంది కంటతడి పెట్టారు. అశోక్ తనకు టీడీపీ వాళ్లందరూ తెలుసునంటూ ఫోన్లు చేయడంతో కొందరు కౌన్సిలర్లు సైతం అక్కడికి చేరుకున్నారు. తనను అవమానకరంగా మాట్లాడటంతో వైద్యులు గీతాజ్యోతి, మన్సూర్ అలీఖాన్ లు తాము ఉద్యోగం చేయలేమంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే జోక్యంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే రోగిని అనంతపురం తరలించారు. వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రోగి బంధువులైన కళావతి, ఆశోక్లపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ నారాయణ తెలిపారు.