రాయదుర్గం అర్బ¯న్ : మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేస్తే తీసుకెâýæ్లకుండా కాలయాపన చేయడంపై ప్రశ్నించిన తనను రోగి బంధువులు దుర్భాషలాడారని వైద్యురాలు గీతాజ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కేబీప్యాలెస్ ఏరియాకు చెందిన సాకమ్మ (55) కోమాలోకి వెళ్లడంతో బంధువులు గురువారం ఉదయం 10.30గంటలకు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యురాలు గీతాజ్యోతి పరిశీలించి, డెరిఫ్లి¯న్ ఇంజక్షన్ తో పాటు డీఎ¯Œన్ఎస్, ఆక్సిజ¯న్ పెట్టారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేశారు.
మధ్యాహ్నం ఒంటిగంట అవుతున్నా రోగిని తీసుకెâýæ్లకపోవడాన్ని గమనించిన వైద్యురాలు రోగి బంధువైన కళావతిని ప్రశ్నించారు. మగవాళ్లు లేరని, వచ్చిన తర్వాత తీసుకెâýæతామని చెప్పింది. అయితే పక్కనే ఉన్న రోగిబంధువుల్లో ఒకరైన అశోక్‌ను చూసి మగవాడే కదా.. తీసుకెâýæ్లవచ్చు కదా అని వైద్యురాలు అన్నారు. దీంతో రెచ్చిపోయిన అశోక్ ఇష్టారాజ్యంగా వైద్యురాలిని దూషించాడు. అతని ప్రవర్తన పట్ల అక్కడే ఉన్న నర్సు వసంతకుమారి, వైద్యులు మన్సూర్ ఆలీఖా¯న్, సిబ్బంది కంటతడి పెట్టారు. అశోక్ తనకు టీడీపీ వాళ్లందరూ తెలుసునంటూ ఫోన్లు చేయడంతో కొందరు కౌన్సిలర్లు సైతం అక్కడికి చేరుకున్నారు. తనను అవమానకరంగా మాట్లాడటంతో వైద్యులు గీతాజ్యోతి, మన్సూర్ అలీఖాన్ లు తాము ఉద్యోగం చేయలేమంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే జోక్యంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే రోగిని అనంతపురం తరలించారు. వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రోగి బంధువులైన కళావతి, ఆశోక్‌లపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ నారాయణ తెలిపారు.
వైద్యురాలిని దూషించిన రోగి బంధువులు
Published Fri, Nov 11 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
Advertisement
Advertisement