Patna Airport
-
ఢిల్లీ స్కూల్, పాట్నా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
ఈ మధ్యకాలంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు బెదిరింపు ఫోన్ల ఘటనలు ఎక్కువయ్యాయి. మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, శివసేన నేత సంజయ్ రౌత్‌ను చంపేస్తామని బెదిరింపులు అందాయి. దీంతోపాటు వివిధ చోట్ల బాంబు పెట్టి పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా ఓ పాఠశాలతోపాటు విమనాశ్రాయానికి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సాదిక్ నగర్‌లోని ది ఇండియన్ స్కూల్ ఆవరణలో బాంబు పెట్టినట్లు ఉదయం 10: 49 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. తరువాత బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. పాఠశాల లోపల, పరిసర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. The Indian School in Sadiq Nagar received an bomb threat via email. As a precautionary measure, the school has been vacated. Bomb Detection and Disposal Squad informed: Delhi police More details awaited. pic.twitter.com/p6DKKeSXsl — ANI (@ANI) April 12, 2023 మరోవైపు బీహార్‌లోని పాట్నా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తి నుంచి జయప్రకాశ్ నారాయణ్ విమానాశ్రయానికి బెదిరింపు కాల్ వచ్చింది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు బాంబ్ స్వ్కాడ్‌కు సమాచారం అందించారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు లోపల, బయట సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. బుధవారం ఉదయం 1.47 గంటలకు ఈ బెదిరింపు అధికారులకు అందింది. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తుండటంతో విమానాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత..
పాట్నా: బెంగళూరు నుంచి బిహార్ మీదుగా వెళ్తున్న గోఎయిర్ విమానాన్ని పాట్నా ఎయిర్‌పోర్టులో పక్షి ఢీకొట్టింది. దీంతో ఫ్లయిట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఒక ఇంజిన్ రెక్కలు విరిగిపోవడంతో ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం అర్థాంతరంగా రద్దయింది. ఘటన జరిగినప్పుడు విమానంలో 142 మంది ప్రయాణికులు, ఆరుగరు సిబ్బంది ఉన్నారు. విమానం రద్దు అయినందున ప్యాసెంజర్లు ఢిల్లీకి చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు గోఎయిర్ తెలిపింది. ప్రయాణాన్ని రద్ధు చేసుకున్న వారికి టికెట్ డబ్బులు తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. పాట్నా ఎయిర్ పోర్టులో పక్షులు విమానాలను ఢీకొట్టిన ఘటనలు ఇప్పటికే పలుమార్లు జరిగాయి. విమానాశ్రయానికి అతి సమీపంలో మాంసం దుకాణాలు ఉండటంతో పెద్ద పెద్ద పక్షులు ఇక్కడ సంచరిస్తున్నాయి. మాంసం దుకాణాలను వేరే చోటకు తరలించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. చదవండి: 'అంబానీ, అదానీ రాహుల్‌ను కొనలేరు.. నా అన్న వారియర్..' -
ఇండిగో విమానంలో ‘బాంబు’ కలకలం
పాట్నా: ఓ ప్యాసింజర్ చేసిన పని.. ప్రయాణికులతో పాటు పోలీసులను, విమాన సిబ్బందిని హడలగొట్టింది. ఇండిగో విమానంలో బాంబు కలకలం చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఇండిగో విమానం(6e 2126)లో ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెప్పాడు. దీంతో విమానాన్ని పాట్నా జయ్ ప్రకాశ్ నారాయణ్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా తనిఖీలు చేశారు. బుధవారం రాత్రి పాట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెప్పడంతో అంతా ఉలిక్కి పడ్డారు. ప్రయాణికులందరినీ విమానం నుంచి కిందకు దించారు విమాన సిబ్బంది. ఆపై పోలీసులు బాంబు-డాగ్ స్క్వాడ్ సాయంతో అతని బ్యాగ్‌ను చెక్ చేశారు. అలాగే ప్రోటోకాల్ ప్రకారం విమానం మొత్తం తనిఖీలు చేపట్టి.. ఏం లేదని నిర్ధారించారు. బాంబు బెదిరింపునకు పాల్పడ్డ ప్రయాణికుడు తన కుటుంబంతో ప్రయాణిస్తున్నాడని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని, అతని మానసిక స్థితిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పాట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు. తనిఖీల అనంతరం విమానాన్ని ప్రయాణానికి అనుమతించారు. Bihar | Visuals from Patna airport where the Bomb squad & Police personnel are conducting inspection after a man in a Delhi-bound flight reportedly claimed that he had a bomb in his bag. His bag was checked further & no bomb was found pic.twitter.com/BkNxpjZ2QC — ANI (@ANI) July 21, 2022 -
తేజ్‌ను కలిసిన ఐశ్వర్య, ఫోటో వైరల్
పట్నా : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట పెళ్లి సందడి మొదలుకాబోతోంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ మనుమరాలు, ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని ఐశ్వర్యా రాయ్‌తో తేజ్ ప్రతాప్ పెళ్లి త్వరలో జరగబోతోంది. ఏప్రిల్ 18న నిశ్చితార్థం, వచ్చే నెలలో పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలూ అంగీకరించినట్లు సన్నిహితులు తెలిపారు. త్వరలో మనువాడబోతున్న తేజ్-ఐశ్వర్యలు ఆదివారం పట్నా ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన తండ్రి లాలూను కలిసి న్యూఢిల్లీ నుంచి పట్నాకు వస్తున్న తేజ్, ఐశ్వర్యను కలిసినట్టు తెలిసింది. ఈ ఇద్దరు కలిసి కొద్ది సేపు ఎయిర్‌పోర్టులో మాట్లాడుకున్న అనంతరం, ఫోటోలు కూడా దిగారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్యతో పాటు ఆమె బంధువులు కూడా వారితో పాటు ఉన్నారు. తేజ్‌ను కలిసిన అనంతరం ఐశ్వర్య పెళ్లి షాపింగ్ కోసం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగా.. తేజ్ ఇంటికి చేరుకున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం ఏప్రిల్ 18న జరుగుతుండగా.. పెళ్లి మే 12న పట్నా వెటర్నిటీ కాలేజీ గ్రౌండ్లో జరగబోతోంది. వందల మంది వీవీఐపీల ఈ పెళ్లి వేడుకకు హాజరు కాబోతున్నారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆయన మంత్రి వర్గ సభ్యులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారని సన్నిహిత వర్గాలు చెప్పాయి. -
'విమానం దిగుతారా.. ఈడ్చిపారేయమంటారా?'
సాక్షి, ముంబయి : గత కొన్ని రోజుల కిందటే పార్లమెంటు ప్యానెల్‌తో ఛీవాట్లు తిన్న ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థ మరో అపవాదును మూటగట్టుకుంది. విమానంలోకి ఎక్కిన ప్రయాణీకులను బలవంతంగా కిందికి విమాన సిబ్బంది దింపేశారు. దాదాపు ఈడ్చిపారేసినంత పనిచేశారు. ప్రయాణీకులంటే ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరించి చులకన చేసి చేయి చేసుకునేంత పనిచేశారు. గత డిసెంబర్ (2017) 30న పట్నా ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ సీఈవో ఈ అనుభవాన్ని ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. 'ప్రయాణీకులందరం విమానంలోకి వెళ్లాము. ఆ తర్వాత సర్వీసును రద్దు చేస్తున్నట్లు అనూహ్యంగా ప్రకటించారు. వెంటనే అందరూ దిగిపోవాలని అన్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది మాపై దాడి చేసినంత పనిచేశారు. విమానంలో నుంచి దిగకపోతే ఈడ్చిపారేస్తామంటూ బెదిరించారు. బలవంతంగా విమానంలో నుంచి దింపేశారు' అని ఆయన వెల్లడించారు. కాగా, దీనిపై స్పందించిన ఇండిగో.. ఆ రోజు ఇండిగో ఫ్లైట్ 6ఈ-633 (కోల్‌కతా-పాట్నా-లక్నో) రాత్రి 8.20 గంటలకు బయలుదేరాల్సి ఉంది. వాతావరణం సరిగా లేనందున విమానాన్ని రద్దు చేశాం. అయితే, ప్రయాణీకులంతా విమానం దిగేందుకు సహకరించారు. కానీ, ఓ 20మంది మాత్రం మొండికేశారు. దాంతో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని వారి పరిస్థితిని వివరించాం. కానీ, విమానం దిగకుండా ప్రతి ఒక్క ప్యాసింజర్‌కు వసతి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మేం మాత్రం వారిని విమానం దిగాలని చాలా మర్యాదగా అడిగాం' అని వెల్లడించింది. -
నాది తప్పే..!
పాట్నా: అనుమతించిన ప్రవేశ ద్వారం నుంచి కాకుండా వేరే మార్గం ద్వారా తనను పంపించాలని వాదనలు చేసిన కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్ అనంతరం తనను తాను నిందించుకున్నారు. తాను అలా చేయడం ఏ మాత్రం సరికాదని, తనది ముమ్మాటికీ తప్పేనని ఒప్పుకున్నారు. ఇప్పటికే వీఐపీల సంస్కృతిపై తీవ్ర వివాదం నెలకొన్న నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఎంపీ విషయం చర్చనీయాంశం అయింది. బీహార్‌లోని పాట్నా విమానాశ్రయంలో మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను రిసీవ్ చేసుకునేందుకు మంత్రి రామ్ కృపాల్ వెళ్లారు. ఆయన ఎగ్జిట్ (బయటకు) మార్గం ద్వారా వెళుతుండగా అక్కడ ఉన్న ఓ మహిళా అధికారి అడ్డుకొని అందరిలాగే (ఎంట్రీ) ప్రవేశ ద్వారం వెళ్లాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే తన ఉద్యోగం పొతుందని కూడా చెప్పారు. అయినప్పటికీ ఆయన ఆమెతో కాసేపు స్వల్ప వాదోవాదాలకు దిగడంతో ఆమె పై అధికారులను కూడా సంప్రదించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడం, దానిపై విమర్శలు కూడా తలెత్తడంతో కేంద్ర మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. విధులు సక్రమంగా నిర్వహించిన ఆ అధికారిని మెచ్చుకున్నారు కూడా