స్నేహితుడే కాలయముడు
పట్టాయగూడెం (చింతలపూడి) : స్నేహితుడే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో మాటామాటా పెరిగి స్నేహితుడి హత్యకు దారి తీసిన ఘటన పట్టాయిగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టాయిగూడెంకు చెందిన సందెళ్ల ఏసుబాబు(20), యండ్రపాటి రాంబాబు స్నేహితులు. వీరు దూరపు బంధువులు కూడా. చిన్ననాటి నుంచి కూలిపనులకు వెళ్లేవారు. ఇటీవల వీరి మధ్య చిన్న తగాదాలు జరిగారుు. మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి రాంబాబు అర్ధరాత్రి వరకు మద్యం తాగాడు. ఏసుబాబును పక్కనే ఉన్న తోటలోకి తీసుకువెళ్లి ఘర్షణ పడ్డాడు. ఏసుబాబును విచక్షణా రహితంగా కొట్టడంతో అతను అక్కడి కక్కడే మరణించాడు.
చనిపోయూడని తెలిసి ఆందోళన చెందిన రాంబాబు గ్రామానికి దగ్గరలో ఉన్న రంగ చెరువులో మృతదేహాన్ని పడేశాడు. ఆదివారం ఉదయం చెరువులో ఏసుబాబు మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. చింతలపూడి సీఐ జి.దాసు, ఎస్సై డి.రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుని శరీరంపై ఉన్న గాయాలను పరిశీలించారు. తన కుమారుణ్ణి రాంబాబు హత్య చేసి చెరువులో పడవేశాడని మృతుని తండ్రి పాశ్చాత, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో రాంబాబును అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.