Pay Dispute
-
పైలట్ల సమ్మె : అన్ని విమానాలు రద్దు
లండన్ : బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ కు భారీ షాక్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు చెందిన సుమారు నాలుగువేల మంది పైలెట్లు ఉన్నపళంగా సంచలన నిర్ణయం తీసుకోవడంతో భారీ ఇబ్బందుల్లో పడింది. వేతన సవరణకుసంబంధించిన నూతన పారిశ్రామిక విధానాన్ని నిరసిస్తూ బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది 48 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. దాదాపు అన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదని బ్రిటిష్ ఎయిర్వేస్ (బిఎ) సోమవారం (సెప్టెంబర్ 9) ఒక ప్రటనలో తెలిపింది. ప్రయాణికుల అసౌకర్యాన్ని అర్థం చేసుకోగలమని, క్షమించమని వారికి విజ్ఞప్తి చేసింది. నూతన పారిశ్రామిక విధానాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ (బాల్పా) గత నెలలో సమ్మె నోటీసులిచ్చింది. అయినా సంస్థ ముందుకు రాకపోవడంతో సిబ్బంది మొత్తం సమ్మెకు దిగారు. బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ చరిత్రలో పైలట్ల మొట్టమొదటి సమ్మె ఇదే. మరోవైపు ఈ నిర్ణయంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీలైనత త్వరలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీలలో సమ్మె తరువాత, సెప్టెంబర్ 27న మరో సమ్మె నిర్వహించనున్నారని సమాచారం. కాగా బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ లాభాలను ఉద్యోగులకు పంచాలని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. జూలైలో విమానయాన సంస్థ ప్రతిపాదించిన మూడేళ్లలో 11.5 శాతం వేతన పెంపును బాల్పా తిరస్కరించింది. ఈ సమ్మె ఈ వివాదాన్ని పరిష్కరించడానికి అవసరమైన పెట్టుబడి కంటే సమ్మె మూలంగా కంపెనీకి చాలా నష్టం వస్తుందని బాల్పా ప్రధాన కార్యదర్శి బ్రియాన్ స్ట్రట్టన్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఉద్యోగుల సమ్మె న్యాయబద్దం కాదని, తాము సరైన ప్రతిపాదనలే చేశామని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ చెబుతోంది. 90 శాతం విమానయాన కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో రెండు యూనియన్లు 11.5 శాతం పెంపును అంగీకరించాయని కంపెనీ వాదిస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ సాధారణంగా 48 గంటల వ్యవధిలో 1,700 విమానాలను నడుపుతుంది బ్రిటిష్ ఎయిర్‌లైన్స్. -
సీఏతో క్రికెటర్ల కొత్త డీల్..
సిడ్నీ:గత కొన్ని నెలలుగా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ), ఆసీస్ క్రికెటర్ల మధ్య నెలకొన్న జీతాల వివాదానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ మేరకు గురువారం సీఏకు ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్ కు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దానిలో భాగంగా క్రికెటర్లు ఐదేళ్ల కాంట్రాక్ట్ కాలానికి సుమారు 396 మిలియన్ డాలర్లతో కొత్తగా ఒప్పంద చేసుకున్నారు. దాంతో ఇంతవరకూ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భవితవ్యంపై నెలకొన్న సందిగ్థత తొలగిపోయింది. తమ మధ్య చోటు చేసుకున్న ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్ వివాదానికి తెరపడినట్లు సీఏ చీఫ్ సుదర్లాండ్ తో పాటు, ఆసీస్ క్రికెటర్ల సంఘం చీఫ్ అలిస్టెర్ నికొల్సన్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీతో ఆటగాళ్లు ఐదేళ్ల పాటు చేసుకున్న ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే. మరొకవైపు కొత్త కాంట్రాక్ట్ లో కీలక మార్పులు చేయడంతో అందుకు ఆటగాళ్లు అందుకు విముఖత వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే ఆటగాళ్లకు సీఏ మధ్య వివాదం నెలకొంది. అయితే ఎట్టకేలకు అందుకు ముగింపు పలకడంతో ఆసీస్ క్రికెటర్లు ఊపిరిపీల్చుకున్నారు. -
క్రికెట్ ఆస్ట్రేలియాపై వార్నర్ మండిపాటు..
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా( సీఏ) ప్లేయర్స్ నూతన కాంట్రాక్ట్ వివాదాన్ని పరిష్కరించకుండా ఆటగాళ్లపై నింద వేయడాన్ని ఆ దేశ క్రికెటర్ డెవిడ్ వార్నర్ సీఏపై మండిపడ్డాడు.. ఈ వివాదం పరిష్కరించకపొతే ఆగష్టులో బంగ్లదేశ్ పర్యటనకు ముప్పు వాటిల్లుతుందని వార్నర్ హెచ్చరించాడు. సీఏ గురువారం సమస్య పరిష్కారానికి క్రికెటర్లు ముందుకు రావడం లేదని ఆరోపించింది. దీనికి వార్నర్ తన ఇన్ స్ట్రాగ్రమ్‌లో స్పందించాడు. ఆస్ట్రేలియా పురుషులు, మహిళా క్రికెటర్లందరూ దేశం తరుపున ఆడాలని ఉన్నా.. సీఏ మాత్రం సమస్యకు పరిష్కారం చూపించకుండా నిందలు వేయడం ఏమిటని ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) 30 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు ప్రతిపాదించిందని దీనికి సీఏ అంగీకరించకుండా సంక్షోభం ముదిరేలా చేసిందని వార్నర్ పేర్కొన్నాడు. వివాదం పరిష్కారం కాక క్రికెటర్లంతా నిరుద్యోగులయ్యారని, ఆర్ధిక పరిస్థితులతో సతమతమవుతున్న క్రికెట్లో కొనసాగుతున్నారని వార్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. అడ్మినిస్టేటర్స్కు మాత్రం డబ్బుల ముట్టాయని.. వారికి ఎలాంటి దిగులు లేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. గత జూన్‌లో క్రికెటర్లకు సీఏకు కాంట్రాక్టు ఒప్పందం ముగియడంతో 230 మంది క్రికెటర్లు నిరుద్యోగులుగా మారారు. ఈ వివాదం పరిష్కారం కాకపోతే నవంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రమాదంలో పడునుంది. ఇప్పటికే కొంత మంది ప్లేయర్లు ఇతర దేశాల్లో జరిగే టీ-20 లీగ్‌లు ఆడుతున్నారు. This Baggy means the world to me. Myself and all the other cricketers female and male want to get out there and play. We offered $30m of our money to grassroots as a peace plan. It was ignored. We asked for mediation twice before and it was rejected. Now CA says there is a crisis. The players are unemployed and some are hurting financially but continue to train. Administrators all still being paid. How is it our fault no deal is done. #fairshare A post shared by David Warner (@davidwarner31) on Jul 27, 2017 at 1:33am PDT