Published
Fri, Jul 28 2017 12:48 PM
| Last Updated on Tue, Sep 5 2017 5:05 PM
క్రికెట్ ఆస్ట్రేలియాపై వార్నర్ మండిపాటు..
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా( సీఏ) ప్లేయర్స్ నూతన కాంట్రాక్ట్ వివాదాన్ని పరిష్కరించకుండా ఆటగాళ్లపై నింద వేయడాన్ని ఆ దేశ క్రికెటర్ డెవిడ్ వార్నర్ సీఏపై మండిపడ్డాడు.. ఈ వివాదం పరిష్కరించకపొతే ఆగష్టులో బంగ్లదేశ్ పర్యటనకు ముప్పు వాటిల్లుతుందని వార్నర్ హెచ్చరించాడు. సీఏ గురువారం సమస్య పరిష్కారానికి క్రికెటర్లు ముందుకు రావడం లేదని ఆరోపించింది. దీనికి వార్నర్ తన ఇన్ స్ట్రాగ్రమ్‌లో స్పందించాడు.
ఆస్ట్రేలియా పురుషులు, మహిళా క్రికెటర్లందరూ దేశం తరుపున ఆడాలని ఉన్నా.. సీఏ మాత్రం సమస్యకు పరిష్కారం చూపించకుండా నిందలు వేయడం ఏమిటని ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) 30 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు ప్రతిపాదించిందని దీనికి సీఏ అంగీకరించకుండా సంక్షోభం ముదిరేలా చేసిందని వార్నర్ పేర్కొన్నాడు. వివాదం పరిష్కారం కాక క్రికెటర్లంతా నిరుద్యోగులయ్యారని, ఆర్ధిక పరిస్థితులతో సతమతమవుతున్న క్రికెట్‌లో కొనసాగుతున్నారని వార్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. అడ్మినిస్టేటర్స్‌కు మాత్రం డబ్బుల ముట్టాయని.. వారికి ఎలాంటి దిగులు లేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
గత జూన్‌లో క్రికెటర్లకు సీఏకు కాంట్రాక్టు ఒప్పందం ముగియడంతో 230 మంది క్రికెటర్లు నిరుద్యోగులుగా మారారు. ఈ వివాదం పరిష్కారం కాకపోతే నవంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రమాదంలో పడునుంది. ఇప్పటికే కొంత మంది ప్లేయర్లు ఇతర దేశాల్లో జరిగే టీ-20 లీగ్‌లు ఆడుతున్నారు.