pb sidhartha
-
రేడియోధార్మికతతో ప్రయోజనాలు
శాస్త్రవేత్త వెంకటసుబ్రహ్మణి మొగల్రాజపురం : రేడియో ధార్మికత వల్ల వైద్య రంగంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసర్చ్ శాస్త్రవేత్త సి.ఆర్.వెంకటసుబ్రహ్మణి అన్నారు. మంగళవారం ఉదయం పి.బి.సిద్ధార్థ కళాశాలలోసి సెమినార్ హాలులో కశాళాల రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘రేడియో కెమిస్రీ’్ట అంశంపై సదస్సు జరిగింది. వెంకటసుబ్రహ్మణి మాట్లాడుతూ మనిషి ఎముకల సాంధ్రతను పరిశీలించడంతో పాటు పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో లభించే ఎముకలు, వస్తువులు ఎన్ని సంవత్సరాల పూర్వానికి చెందినవో తెలిపేందుకు రేడియోధార్మికత ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయరంగంలో కూడా దీనివల్ల ఉపయోగాలున్నాయని వివరించారు. విద్యార్థులు ఈ రంగంపై దృష్టి సారించి ఉన్నత స్థితికి చేరుకోవడమే కాకుండా పరిశోధనల జరిపి దేశానికి ఉపయోగపడవచ్చునని సూచించారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు మాట్లాడుతూ తమ విద్యార్థులకు పాఠ్యాంశాలతోపాటు వివిధ రంగాల్లో ప్రముఖులను తీసుకువచ్చి వారితోనే ఆయా అంశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కళాశాల డీన్ రాజేష్, ప్రిన్సిపాల్ ఎం.రమేష్, కళాశాల రసాయనశాస్త్ర విభాగాధిపతి ఎం.మనోరంజని పాల్గొన్నారు. -
రేపు పి.బి.సిద్ధార్థలో క్యాంపస్ రిక్రూట్మెంట్
మొగల్రాజపురం: బెంగుళూరుకు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ ఎస్.ఎల్.కె. ‘సాప్్టవేర్ టెస్టింగ్ ఎగ్జిక్యూటివ్స్’ పోస్టుల భర్తీ కోసం ఆదివారం (ఈ నెల 28 తేది) తమ కళాశాల ఆవరణలో క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తుందని పి.బి.సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ ప్రకటనలో తెలిపారు. 2015–16 సంవత్సరాల్లో బి.యస్సీ (మా«థ్స్), బి.సి.ఎ, బి.కాం. పూర్తి చేసిన విద్యార్థులెవరైనా ఇందులో పాల్గొనవచ్చునన్నారు. ఔత్సాహికులు బయేడేటాతో ఆదివారం ఉదయం 10 గంటలకు మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలోని సెమినార్ హాలులో హజరు కావాలని తెలిపారు. విద్యార్ధులకు ఆన్లైన్ పరీక్ష ద్వారా నిర్వహించి అందులో ఉత్తీరుణలైన వారికి కంపెనీ ప్రతినిధులు ఇంటర్వూ నిర్వహిస్తారని చెప్పారు. -
నార్త్ టెక్సాస్ వర్సిటీతో వీఆర్ సిద్ధార్థ ఒప్పందం
కానూరు(పెనమలూరు) : అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్తో సరస్పర సహాయ సహకారాలపై కానూరులోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు వీఆర్ సిద్ధార్థ కాలేజీలో శుక్రవారం ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ బారెంట్ బ్రియంట్ మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్సుల వివరాలు తెలియజేశారు. ఐదేళ్లకే బీటెక్, ఎంఎస్ పూర్తి చేయవచ్చన్నారు. డేటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ విద్య అభ్యసించవచ్చని చెప్పారు. స్కాలర్షిప్స్, రీసెర్చ్ వివరాలు కూడా వివరించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు మలినేని రాజయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, డీన్ డాక్టర్ పి.పాండురంగారావు, కంప్యూటర్స్ విభాగాధిపతి శ్రీనివాసరావు, రీసెర్చ్ డీన్ శాస్త్రి, ప్రొఫెసర్ రామ్ దంతు తదితరులు పాల్గొన్నారు.