PBKS vs DC
-
ఆ పోలీస్ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు!
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లుంగి ఎంగిడి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు ఇటీవలే వెల్లడించారు. నిజానికి మైదానంలో ఎంగిడి పరిస్థితి చూసిన అభిమానులు మాత్రం వణికిపోయారు. ప్రాణాలతో బయటపడితే చాలు దేవుడా అంటూ ప్రార్థించారు. ఐపీఎల్-2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం పంజాబ్ కింగ్స్‌తో తలపడ్డ సంగతి తెలిసిందే.తల బలంగా నేలకు తాకిఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ రికార్డు స్థాయిలో 264 పరుగులు చేయగా.. పంజాబ్ లక్ష్య ఛేదనకు దిగింది. ఈ క్రమంలో పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతిని అందుకునే క్రమంలో ఢిల్లీ ప్లేయర్ ఎంగిడి గాయపడ్డాడు. మిడాఫ్ ప్రాంతంలో బంతిని క్యాచ్ పట్టే క్రమంలో అతడు కిందపడ్డాడు.దీంతో తల బలంగా నేలకు తాకి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య బృందం అతడిని పరీక్షించింది. అయితే అతడి పరిస్థితి దిగజారినట్లు కనిపించడంతో అంబులెన్స్‌ను మైదానంలోకి రప్పించి.. మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ట్రాఫిక్ ఏసీపీ సంజయ్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించి.. ఒక రకంగా ఎంగిడి ప్రాణం నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.Lungi Ngidi got Injured while going for a catch Looks very serious 😰. Ambulance was called on ground 🚨. pic.twitter.com/GgU9g68Zsw— Jeet (@JeetN25) April 25, 202611 నిమిషాల్లోనే ఢిల్లీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, మ్యాచ్ జరిగిన అరుణ్ జైట్లీ స్టేడియం నుంచి సాయంత్రం 6.16 గంటలకు బయల్దేరిన అంబులెన్స్.. రాజేంద్ర నగర్లో ఉన్న మాక్స్ ఆస్పత్రికి కేవలం 11 నిమిషాల్లోనే చేరుకుంది. సాధారణంగా ఈ ప్రయాణానికి 25-30 నిమిషాల సమయం పడుతుంది.Full marks to Delhi Traffic Police for creating a Green Corridor for seamless travel for the ambulance carrying Lungi Ngidi from Kotla to Max Hospital, Rajendra Nagar in just 11 minutes This was initiated by ACP Traffic Central District Sanjay Singh pic.twitter.com/ZRsZwdVzeZ— Vikrant Gupta (@vikrantgupta73) April 25, 2026అయితే, సంజయ్ సింగ్ చొరవ వల్ల ఎంగిడిని తీసుకువెళ్తున్న అంబులెన్స్ త్వరితగతిన ఆస్పత్రికి చేరుకుంది. గూగుల్ మ్యాప్స్పై ఆధారపడకుండా.. మెయిన్ రోడ్డు నుంచే వెళ్లాలని సంజయ్ సింగ్ అంబులెన్స్ డ్రైవర్‌కు సూచించారట. మొత్తంగా 60 మంది పోలీసులు వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా సమన్వయం చేసుకుని.. ఎంగిడి వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరడంలో కీలక పాత్ర పోషించారు.ఎవరీ సంజయ్ సింగ్?ఢిల్లీలో ప్రస్తుతం ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్నారు సంజయ్ సింగ్. ఆయనకు క్రికెట్ బ్యాగ్రౌండ్ ఉంది. గౌతం గంభీర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలతో ఆయన దేశీ క్రికెట్ ఆడారు.ఇక ఎంగిడి గురించి మీడియా సంజయ్ సింగ్‌ను అడుగగా.. ‘‘నేనూ ఓ క్రికెటర్‌నే. మైదానంలో తగిలే గాయాలు ఎంతటి ప్రమాదానికి దారితీస్తాయో నాకు బాగా తెలుసు. ఎంగిడి అంతర్జాతీయ క్రికెటర్. అతడు కుప్పకూలిన విధానం చూస్తే గాయం ఎంత తీవ్రమైందో నాకు అర్థమైంది’’ అని సహానుభూతి ప్రదర్శించారు.ఇదిలా ఉంటే.. ఢిల్లీ విధించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఊదేసింది. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఇక తాజాగా ఢిల్లీకి మరో పరాజయం ఎదురైంది. ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.చదవండి: మీకసలు బుద్ధుందా?.. వైభవ్ గురించి ఆమెను ఎందుకు అడిగారు?Lungi Ngidi has suffered a serious injury, and for the first time in IPL history, an ambulance has come onto the ground. This looks very serious—possibly a neck fracture, but hopefully it’s nothing that severe. 😱It is also quite shameful for the Arun Jaitley Stadium DJ to play… pic.twitter.com/CrFFc3grvB— Sonu (@Cricket_live247) April 25, 2026 -
‘అందుకే శ్రేయస్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేశాం’
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దుమ్ములేపుతోంది. గతేడాది ఫైనల్‌కు చేరిన ఈ జట్టు.. ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఇందులో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా.. మిగిలిన ఆరింటిలోనూ గెలిచి జైత్రయాత్ర కొనసాగిస్తోంది.రెండేళ్లుగా పంజాబ్ అద్భుత విజయాలు సాధించడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ది కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడి రాకతో జట్టు రాతే మారిపోయింది. ఒకప్పుడు పసలేని జట్టుగా ఉన్న పంజాబ్‌కు ఇప్పుడు అమితమైన క్రేజ్ ఏర్పడింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నీరాజనాలు అందుకుంటోంది.రూ. 26.75 కోట్ల భారీ ధరకుకాగా 2024లో కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను.. అనూహ్యంగా ఆ ఫ్రాంఛైజీ వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్ల భారీ ధరకు అయ్యర్‌ను కొనుగోలు చేసింది. పంజాబ్ కోచ్ రిక్కీ పాంటింగ్ పట్టుబట్టి మరీ ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా శ్రేయస్‌ను ఏరికోరి కొనుగోలు చేయించాడు.పైసా వసూల్ ప్రదర్శనపాంటింగ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శ్రేయస్ అయ్యర్ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడిన పంజాబ్.. 265 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనను సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (36 బంతుల్లో 71 నాటౌట్)తో మెరిశాడు.అందుకే శ్రేయస్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేశాంఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ శ్రేయస్ అయ్యర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఐపీఎల్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడొక గొప్ప వ్యక్తి. అందుకే వేలంలో అతడి కోసం ఎంత ఖర్చైనా పర్లేదని నేను కఠినంగా ముందుకు వెళ్తూనే ఉన్నాను.శ్రేయస్ ఒక గొప్ప నాయకుడు. పంజాబ్ జట్టును అతడు పునర్నిర్మిస్తాడని నేను గట్టిగా నమ్మాను. శ్రేయస్ ఆఖరి వరకు క్రీజులో ఉన్నాడంటే లక్ష్యం ఎంత పెద్దదైనా ఛేదించగలమని నాకు తెలుసు. ఇప్పుడు కూడా అతడు అద్భుతం చేశాడు. ‘నువ్వు ఆఖరి వరకు నిలబడ్డావంటే ఈ మ్యాచ్ మనం కచ్చితంగా గెలుస్తామని చెప్పాను’. అన్నట్లుగానే అతడు పని పూర్తి చేశాడు’’ అని రిక్కీ పాంటింగ్ శ్రేయస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా గతేడాది 604 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఈ సీజన్లో ఇప్పటికి ఆరు ఇన్నింగ్స్ ఆడి 279 పరుగులు పూర్తి చేసుకున్నాడు.చదవండి: Vaibhav Sooryavanshi: పర్సనల్‌గా అంటే నచ్చదు.. అందుకే చితక్కొట్టాWho would have thought chasing 264 in T20 Cricket. 🤷- Shreyas Iyer led PBKS chased down 264 runs in 18.5 overs against DC. pic.twitter.com/iith1lLgiW— Kashif (@KashifNdmCric) April 25, 2026 -
వాళ్లు కొట్టినప్పుడు, మేమూ కొడతామనుకున్నా: శ్రేయస్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో ఏడు బంతులు మిగిలుండగానే సునాయాసంగా ఊదేసింది. ఈ గెలుపు అనంతరం పంజాబ్ కింగ్స్ సారధి శ్రేయస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని అన్నాడు. శ్రేయస్ మాటల్లో..నిజంగా చెప్పాలంటే, మాటలు రావడం లేదు. మైదానంలో తీవ్ర ఎండ, మరోవైపు బౌలర్లు వరుసగా బౌండరీలు, సిక్సర్లు ఇస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మాకు తెలుసు.పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందని ముందుగా భావించినప్పటికీ, ఆశించినంత మలుపు లభించలేదు. చహల్ బౌలింగ్‌కు వచ్చిన తర్వాత మాత్రమే బంతి కొద్దిగా ఆగినట్లు అనిపించింది.కేఎల్ రాహుల్ ఆడిన తీరు అద్భుతం. అతని షాట్లు కళ్లకు పండుగలా అనిపించాయి. అతను ఎలాంటి ఒత్తిడిలోనూ లేనట్లు కనిపించాడు.భారీ లక్ష్యాన్ని ఛేదించే ముందు నా ఆలోచన ఒక్కటే. వాళ్లు ఎంత చేసినా, మనం ఒక్క పరుగు ఎక్కువ చేయాలి. వాళ్లు కొట్టగలిగినప్పుడు, మేమూ కొడతామనుకున్నా. ఆ సమయంలో అదే నా మైండ్‌సెట్.డ్రెస్సింగ్‌రూమ్‌లో కూడా ఇదే చర్చ జరిగింది. గత మ్యాచ్‌ల్లో 220కి పైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన అనుభవం మాకు ధైర్యాన్నిచ్చింది.ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడి బలమైన పునాది వేశారు. వారి ఆరంభాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగించారు.బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించిన అయ్యర్, ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నామని అన్నాడు.కాగా, చారిత్రక గెలుపు తర్వాత పంజాబ్‌ను చూసి మిగతా జట్లంతా వణికిపోతున్నాయి. వీరికి ఎంత లక్ష్యమైతే సరిపోతుందని లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ మునుపెన్నడూ లేనంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతే ఏకైక అజేయ జట్టుగా చలామణి అవుతుంది. మున్ముందు కూడా పంజాబ్ ఇదే జోరును కొనసాగిస్తే, ఈసారి టైటిల్ గెలవకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. గత సీజన్లో ఇదే శ్రేయస్ నేతృత్వంలో పంజాబ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. -
పంజాబ్ చేతిలో ఓటమిని సహచరులపైకి నెట్టిన అక్షర్ పటేల్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఓటమిని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తన ఫీల్డర్ల ఖాతాలోకి వేశాడు.మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందిస్తూ.. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు."మేము మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తున్నాం. ఇలాంటి పిచ్‌పై బౌలర్లకు ఫీల్డర్లు సహకరించకపోతే, ఓడిపోవడమే సరైన ఫలితం" అంటూ కఠినంగా వ్యాఖ్యానించాడు.ముఖ్యంగా ఫీల్డింగ్ వైఫల్యమే మ్యాచ్‌ను చేజార్చిందని స్పష్టం చేశాడు. కరుణ్ నాయర్ శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన రెండు కీలక క్యాచ్‌లను వదిలేయడం జట్టుకు భారీ మూల్యం చెల్లింపజేసిందని అన్నాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అయ్యర్ 36 బంతుల్లో అజేయమైన 71 పరుగులు చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడని తెలిపాడు.అక్షర్ తన బౌలర్లపైనా అసహనం వ్యక్తం చేశాడు. పవర్‌ప్లేలో ప్రత్యర్థి పరుగుల వేగాన్ని నియంత్రించడంలో బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నాడు. ఢిల్లీ బౌలర్లందరూ ఓవరుకు 11కి పైగా పరుగులు సమర్పించడం జట్టు పరిస్థితిని మరింత దయనీయంగా మార్చిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.కుల్దీప్ రెండు వికెట్లు తీసినా 46 పరుగులు ఇచ్చాడు. తాను, నటరాజన్, ముకేశ్ కుమార్, ఆకిబ్ నబీ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నామని అన్నాడు. ఈ వికెట్‌పై 264 పరుగుల స్కోర్ చాలా మంచిదని అభిప్రాయపడ్డాడు. లక్ మా పక్షాన ఉండి, క్యాచ్‌లు పట్టుంటే ఈజీగా గెలిచేవాళ్లమని తెలిపాడు. ఈ సీజన్లో మేం ఓడిన మ్యాచ్‌లు చూస్తే చాలా వరకు క్లోజ్ మ్యాచ్‌లు. వాటిలో కొన్ని అవకాశాలను ఓడిసి పట్టుకుని ఉంటే, రెండు-మూడు అదనపు విజయాలు మా ఖాతాలో ఉండేవని అని అభిప్రాయపడ్డాడు. తప్పులు పదేపదే రిపీట్ చేస్తుంటే, అవకాశాలు మళ్లీమళ్లీ రావని అసహనం వ్యక్తం చేశాడు.కాగా, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి కేఎల్ రాహుల్ (152 నాటౌట్), నితీశ్ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (43), ప్రభ్‌సిమ్రన్ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్) నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా పంజాబ్ ఈ సీజన్లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. -
సమీర్ రిజ్వీ మెరుపులు.. పంజాబ్‌పై ఢిల్లీ ఘన విజయం
ఐపీఎల్-2025 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పంజాబ్ విధించిన 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో ఐదు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే, ఆరో ఓవర్ మూడో బంతికి రాహుల్ (21 బంతుల్లో 35) మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.ఆ తర్వాతి ఓవర్లలో డుప్లెసిస్ (15 బంతుల్లో 23) కూడా అవుటయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44) మెరుపులు మెరిపించగా .. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సెదీకుల్లా అటల్ (22) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సమీర్ రిజ్వీ ధనాధన్ దంచికొట్టాడు. 22 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు.. తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.మొత్తంగా 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ 18 పరుగులతో అతడికి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ లక్ష్యాన్ని అందుకుంది. ఇక పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ రెండు, మార్కో యాన్సెన్, ప్రవీణ్ దూబే ఒక్కో వికెట్ తీశారు. కాగా అగ్ర స్థానంపై కన్నేసిన పంజాబ్ ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం 17 పాయింట్లతో ఉన్న పంజాబ్ ఆఖరిదైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిస్తేనే టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది. శ్రేయస్ ఫిఫ్టీ, స్టొయినిస్ మెరుపులుఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. జైపూర్ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (6)ను ముస్తాఫిజుర్ రహ్మాన్ సింగిల్ డిజిట్ స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు.అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. కానీ శ్రేయస్ అవుటైన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ మళ్లీ నెమ్మదిగా సాగింది.నేహాల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11) నిరాశపరచగా.. మార్కస్ స్టొయినిస్ మెరుపులతో పంజాబ్ 200 పరుగుల మార్కు దాటింది. స్టొయినిస్ 16 బంతుల్లో 44 పరుగులతో రాణించాడు. ఆఖర్లో హర్‌ప్రీత్ బ్రార్ 2 బంతుల్లో 7 పరుగులతో స్టొయినిస్‌తో కలిసి నాటౌట్‌గా నిలిచాడు.ఇక ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీయగా.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. -
మరేం పర్లేదు.. ఇక్కడే ఉందాం!.. ఆటగాళ్లకు సర్ది చెప్పిన హెడ్ కోచ్
భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025 (IPL 2025) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ నేపథ్యంలో లీగ్‌లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది ఇప్పటికే స్వదేశాలకు చేరుకునే క్రమంలో దుబాయ్ వరకు వెళ్లినట్లు సమాచారం. అయితే, పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఆటగాళ్లకు వారి హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) సర్దిచెప్పినట్లు తెలుస్తోంది.మరేం పర్లేదు.. ఇక్కడే ఉందాం!సొంత దేశానికి తిరిగి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ... పాంటింగ్ ఢిల్లీలోనే ఉండేందుకు ప్రాధాన్యతనిచ్చాడు. అప్పటికే అతడి లగేజీ విమానాశ్రయానికి చేరుకోగా... అతి కష్టం మీద దానిని తిరిగి తెప్పించుకున్నాడు. అప్పటికే భారత్ నుంచి స్వదేశాలకు తిరుగు పయనమైన విదేశీ ఆటగాళ్లతో పాటు మిగిలిన వారిలో పాంటింగ్ దైర్యం నింపాడు.ఈ విషయం గురించి పంజాబ్ కింగ్స్ జట్టు సీఈవో సతీశ్ మీనన్ మాట్లాడుతూ.. ‘స్వదేశానికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ పాంటింగ్ నిరాకరించాడు. అంతేగాకుండా విదేశీ ఆటగాళ్లలో ధైర్యం నింపాడు. వారంతా త్వరలో జట్టుతో చేరబోతున్నారు’ అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ జట్టులో ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టొయినిస్, ఆరోన్ హార్డీ, జోష్ ఇన్‌గ్లిస్, జేవియర్ ఉన్నారు. కాగా భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే.వందే భారత్ రైలులోశత్రు దేశ వ్యూహాలకు చెక్ పెట్టే క్రమంలో ధర్మశాలలో బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) చేయడంతో త్వరత్వరగా స్టేడియాన్ని ఖాళీ చేయించడంతో పాటు.. ఆటగాళ్లను కూడా బీసీసీఐ అక్కడి నుంచి తరలించింది. ఈ క్రమంలో ధర్మశాల నుంచి ఢిల్లీకి వందే భారత్ రైలులో ఆటగాళ్లను తరలించింది.ఇందులో భాగంగా బస్సులు, ట్రైన్లు మారుతూ ప్రయాణించడంతో విదేశీ ఆటగాళ్లలో ఒకరకమైన భయాందోళన పెరిగిపోవడంతో... వారంతా తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని ఆశించారు. ‘దాడుల వార్తలతో విదేశీ ఆటగాళ్లు కాస్త ఆందోళన చెందారు. వీలైనంత త్వరగా దేశం వీడి ఇళ్లకు చేరుకోవాలని భావించారు.వారి స్థానంలో ఉంటే ఎవరైనా అలాగే అనుకుంటారు. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం పాంటింగ్ వారికి సర్దిచెప్పాడు’ అని ఓ అధికారి తెలిపారు. కాగా పంజాబ్ పేస్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ మాత్రం దుబాయ్‌కు చేరుకున్నారు. ఐపీఎల్ తిరిగి ప్రారంభం కావడంపై త్వరలో ప్రకటన రానుండగా... జట్లన్నీ తమ ఆటగాళ్లను అందుబాటులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఆదివారం ఫ్రాంఛైజీలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా, శనివారం భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి రాగా.. పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి. ప్లే ఆఫ్స్ రేసులో పంజాబ్ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలో తిరిగి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 16 లేదంటే 17న తిరిగి ఆరంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ మార్గదర్శనం, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ సీజన్లో పంజాబ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఢిల్లీతో గురువారం మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 10.1 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది. ఐపీఎల్ తిరిగి ప్రారంభమైనప్పుడు ఈ మ్యాచ్ అక్కడి నుంచే కొనసాగే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇందులో గెలిస్తే పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. ఇప్పటికి శ్రేయస్ సేన ఖాతాలో పదిహేను పాయింట్లు ఉన్నాయి. చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ ఎప్పుడన్న అంశంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికి ఈ సీజన్లో లీగ్ దశలో భాగంగా 58 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే.అందుకే వాయిదాఓవైపు యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు వినోదం కోసం ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సరికాదని భావిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతుగా నిలిచే క్రమంలో వారం రోజుల పాటు ఐపీఎల్-2025ని వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) బీసీసీఐని సంప్రదించినట్లు సమాచారం. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో మిగిలిన పదహారు మ్యాచ్‌లకు తాము ఆతిథ్యం ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాంది గార్డియన్ కథనం ప్రకారం.. ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ బీసీసీఐ అధికారులను సంప్రదించి.. ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ గురించి ప్రతిపాదనలు చేశారు. బీసీసీఐకి అభ్యంతరం లేకపోతే తమ దేశంలో ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తామని తెలిపారు.‘‘వారం రోజుల తర్వాత కూడా ఐపీఎల్-2025ను పునఃప్రారంభించేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే.. ఈసీబీ ఆ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబరులో మిగిలిన మ్యాచ్‌లను తాము పూర్తి చేస్తామని ఈసీబీ వర్గాలు వెల్లడించాయి’’ అని ది గార్డియన్ పేర్కొంది.కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ మే 25తో ముగియాల్సి ఉంది. అయితే, సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో మే 8 నాటి పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే రద్దు చేశారు. ఈ క్రమంలో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తారనే వార్తలు రాగా.. వారం పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.ఢిల్లీకి చేరుకున్నారుఇదిలా ఉంటే.. పంజాబ్- ఢిల్లీ ఆటగాళ్లతో సహా సహాయక సిబ్బంది మొత్తాన్ని వందే భారత్ రైలులో జలంధర్ నుంచి ఢిల్లీకి సురక్షితంగా తరలించారు. ఇక కొంత మంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లాలని భావిస్తుండగా.. ఫ్రాంఛైజీలు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు.. దాడులకు బరితెగించిన పాకిస్తాన్‌కు భారత్ దీటుగా సమాధానం ఇస్తుండటంతో దాయాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్-2025ని ఇప్పటికైతే నిలిపివేస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. చదవండి: IPL 2025: ప్రత్యామ్నాయ తేదీలు ఏవి? -
కరుణ్ నాయర్ కంటే బెటర్.. అతడిని ‘తుదిజట్టు’లోకి తీసుకోండి!
ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభంలో వరుస విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిట.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అక్షర్ సేన.. ఆరింట గెలిచి.. నాలుగు ఓడిపోయింది.ఐదో స్థానంలోఇక చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో వెనుకబడ్డ ఢిల్లీ.. అదృష్టవశాత్తూ వర్షం వల్ల గట్టెక్కింది. ఉప్పల్‌లో వాన తెరిపినిచ్చినా ఆట సాగేందుకు వీలు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. ఢిల్లీ ఖాతాలో ఓవరాల్‌గా 13 పాయింట్లు చేరాయి.తద్వారా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత.. ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం మరో కీలక పోరుకు ఢిల్లీ సిద్ధమైంది.పటిష్ట పంజాబ్ కింగ్స్ (PBKS vs DC)తో ధర్మశాల వేదికగా తలపడనుంది. ఇందులో గెలిస్తేనే ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సులభతరంగా మారతాయి. లేదంటే.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంతటి కీలక మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఢిల్లీ యాజమాన్యానికి కీలక సూచన చేశాడు.కరుణ్, అభిషేక్‌ల కంటే బెటర్పవర్ హిట్టర్ అశుతోష్ శర్మను తుదిజట్టులోకి తీసుకోవాలని ఆకాశ్ చోప్రా సూచించాడు. ‘‘అశుతోష్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించండి. మీరు తొలుత బ్యాటింగ్ చేసినట్లైతే ఇదే సరైన వ్యూహం.విప్రాజ్ నిగమ్ తర్వాత అతడిని పంపండి. నిజానికి కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్ కంటే అశుతోష్ మెరుగ్గా, నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి అందరూ అవుటైన తర్వాత కాకుండా ముందే అతడిని బ్యాటింగ్‌కు పంపండి.మ్యాచ్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుని.. మలుపు తిప్పగల సత్తా అతడికి ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఎందుకు మారుతుందో తనకైతే అర్థం కావడం లేదని ఈ కామెంటేటర్ పేర్కొన్నాడు.వారి వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు‘‘ఇప్పటికి దాదాపు ఆరు ఓపెనింగ్ జోడీలను మార్చి ఉంటారు. దీని వెనుక వారి వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు. ఓపెనర్ల విషయంలోనే స్పష్టత లేకపోతే.. ప్లే ఆఫ్స్ చేరడం కూడా కష్టమే అవుతుంది’’ అని ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు.ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫినిషర్‌గా అశుతోష్ శర్మ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్ ఆడి 186 పరుగులు చేశాడు. మరోవైపు.. కరుణ్ నాయర్ 7 ఇన్నింగ్స్ ఆడి 154 పరుగులు చేయగా.. అభిషేక్ పోరెల్ 11 ఇన్నింగ్స్‌లో 265 రన్స్ సాధించాడు.చదవండి: KKR vs CSK: పో.. పో!.. వరుణ్ చక్రవర్తికి షాకిచ్చిన బీసీసీఐ


