PBKS vs RCB
-
నాకెందుకు?.. ఇందుకు అతడే అర్హుడు: విరాట్ కోహ్లి
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (PBKS vs RCB) స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) అదరగొట్టాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ దూకుడు శైలికి భిన్నంగా సంయమనంతో ఆడి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అద్భుత అర్ధ శతకంతో మెరిసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.పంజాబ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 54 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 73 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లి 135 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) మాత్రం వేగంగా ఆడాడు.ఈ కేరళ బ్యాటర్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 61 పరుగులు సాధించాడు. ఇక ఆఖర్లో జితేశ్ శర్మ సిక్స్‌తో ఆర్సీబీ గెలుపును ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.నాకెందుకు?.. ఈ అవార్డుకు అతడే అర్హుడు‘‘మాకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్. రెండు పాయింట్లు కూడా ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించే క్రమంలో ఎంతో ఉపయోగపడతాయి. సొంత మైదానం వెలుపలా మేము అద్భుతంగా ఆడుతున్నాం.ఈ విషయం ఇక్కడ మరోసారి నిరూపితమైంది. అయితే, ఈరోజు దేవ్ ఇన్నింగ్స్ వల్లే ఇది సాధ్యమైంది. అతడు భిన్న రీతిలో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. నాకు అభిప్రాయం ప్రకారం ఈ అవార్డుకు అతడే అర్హుడు.కానీ నాకెందుకు ఇచ్చారో తెలియడం లేదు’’ అంటూ కోహ్లి పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘నేను క్రీజులో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నా పర్లేదు.. ఆ తర్వాత వేగం పెంచి.. ఆఖరిదాకా క్రీజులో ఉండాలనేదే మా వ్యూహం.మాకు మంచి జట్టు లభించిందిఈ సీజన్లో మాకు మంచి జట్టు లభించింది. వేలంలో మా వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. డేవిడ్, టిమ్, పాటిదార్.. అందరూ తమ పాత్రలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇక రొమారియో షెఫర్డ్, లియామ్ లివింగ్‌స్టోన్ కూడా ఉండటం మాకు సానుకూలాంశం’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.కాగా మూడు రోజుల క్రితం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీని ఓడించింది. అందుకు బదులుగా పంజాబ్ సొంత మైదానం ముల్లన్‌పూర్‌లో ఆర్సీబీ ఆదివారం నాటి మ్యాచ్‌లో శ్రేయస్ సేనపై ప్రతీకారం తీర్చుకుంది. ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్లో ఎనిమిదింట ఐదో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది. మరోవైపు.. పంజాబ్ కూడా ఎనిమిదింట ఐదు విజయాలు సాధించినా రన్‌రేటు పరంగా వెనుకబడి నాలుగో స్థానంలో ఉంది.ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ👉టాస్: ఆర్సీబీ.. మొదట బౌలింగ్👉పంజాబ్ స్కోరు: 157/6 (20)👉ఆర్సీబీ స్కోరు: 159/3 (18.5)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించిన ఆర్సీబీ.చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియోSmacking them with ease 🤌Virat Kohli is in the mood to finish this early 🔥Updates ▶ https://t.co/6htVhCbTiX#TATAIPL | #PBKSvRCB | @imVkohli pic.twitter.com/iuT58bJY2A— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐదో గెలుపు నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ (PBKS vs RCB) చేతిలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఎదురైన పరాభవానికి ఆదివారం బదులు తీర్చుకుంది. పంజాబ్‌ను వారి హోం గ్రౌండ్ ముల్లన్‌పూర్‌లో ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగాఈ క్రమంలో పంజాబ్‌పై ప్రతీకార విజయం నేపథ్యంలో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. అయితే, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా కోహ్లి వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్న తీరు విమర్శలకు తావిచ్చింది.కోహ్లి చర్య.. శ్రేయస్ ఫైర్ఇక కోహ్లి చర్య పట్ల శ్రేయస్ కూడా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపించింది. మ్యాచ్ ముగియగానే ఇరుజట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలో.. అయ్యర్ కోహ్లితో కోపంగా ఏదో మాట్లాడాడు. అయితే, కోహ్లి మాత్రం నవ్వుతూ వాతావరణాన్ని చల్లబరచాలని ప్రయత్నించాడు.కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం గంభీరంగా అతడికి బదులిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదేమైనా సహచర టీమిండియా ఆటగాడిని కించపరిచేలా ఇలాంటి సెలబ్రేషన్స్ దిగ్గజ బ్యాటర్ అయిన కోహ్లి స్థాయికి తగవంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కోహ్లిని అనుకరిస్తూ హేళన చేశాడా?అయితే, ఆర్సీబీ అభిమానులు మాత్రం శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్‌లో కోహ్లిని అనుకరిస్తూ హేళన చేశాడని.. అందుకే కింగ్ ఇలా బదులిచ్చాడని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. శ్రేయస్ ఆర్సీబీ మ్యాచ్ సమయంలో ఎలాంటి మూర్ఖపు చర్యలకు దిగలేదని.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో అతడు ఇచ్చిన రియాక్షన్‌ను తప్పుగా ప్రచారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.బ్యాటర్‌గా శ్రేయస్ విఫలంకాగా ముల్లన్‌పూర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33), వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31) రాణించగా.. ఆఖర్లో మార్కో యాన్సెన్ (20 బంతుల్లో 25 నాటౌట్) ఆకట్టుకున్నాడు.ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. పేసర్ రొమారియో షెఫర్డ్ శ్రేయస్ అయ్యర్ (6) రూపంలో కీలక వికెట్ దక్కించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.దంచికొట్టిన పడిక్కల్, కోహ్లిఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ విరాట్ కోహ్లి, వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. పడిక్కల్ కేవలం 35 బంతుల్లోనే 61 పరుగులతో దుమ్ములేపాడు.అయితే, కెప్టెన్ రజత్ పాటిదార్ (12) ఈసారి విఫలం కాగా.. కోహ్లి- జితేశ్ శర్మతో కలిసి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశాడు. కోహ్లి 54 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 73 పరుగులతో అజేయంగా నిలవగా.. జితేశ్ (8 బంతుల్లో 11) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. కాగా ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ ఐదింట గెలిచి.. పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది.చదవండి: Rohit Sharma: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. నాకు దక్కిన అరుదైన గౌరవంCSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్.. రోహిత్ ఫిఫ్టీ కొట్టగానే అనంత్ అంబానీతో కలిసి ఇలా..Jitesh Sharma dials 6⃣ to seal it in style 🙌Virat Kohli remains unbeaten on 73*(54) in yet another chase 👏@RCBTweets secure round 2⃣ of the battle of reds ❤Scorecard ▶ https://t.co/6htVhCbltp#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/6dqDTEPoEA— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
PBKS VS RCB: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన కోహ్లి
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విరాట్ ఛేదనలో అద్భుతమైన హాఫ్ సెంచరీతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అదరగొట్టి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్లో విరాట్‌కు ఇది మూడో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఓవరాల్‌గా 19వది.ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో విరాట్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. రోహిత్ కూడా ఐపీఎల్లో ఇప్పటివరకు 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. విరాట్, రోహిత్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు క్రిస్ గేల్ (22) పేరిట ఉంది. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్, రోహిత్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)19 - రోహిత్ శర్మ (263 మ్యాచ్‌లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్‌లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్‌లు)ఈ మ్యాచ్‌లో విరాట్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 బ్యాటర్స్..విరాట్- 67 (59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్- 66 (62, 4)శిఖర్ ధవన్- 53 (51, 2)రోహిత్ శర్మ- 45 (43, 2)కేఎల్ రాహుల్- 43 (39, 4)ఏబీ డివిలియర్స్- 43 (40, 3)ఐపీఎల్లో విరాట్ పేరిట ఉన్న రికార్డు..అత్యధిక పరుగులుఅత్యధిక శతకాలుఅత్యధిక 50 ప్లస్ స్కోర్లుఅత్యధిక బౌండరీలుమ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేశారు.పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్‌దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ చేసి ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్‌ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. -
పడిక్కల్ విధ్వంసం, సత్తా చాటిన విరాట్.. పంజాబ్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగగా.. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో పంజాబ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలో 10 పాయింట్లతో టాప్-5లో ఉన్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని పంజాబ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ వికెట్లు తీయకపోయినా.. పొదుపుగా బౌలింగ్ చేశారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించగా.. దేవ్‌దత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆర్సీబీ గెలుపుకు గట్టి పునాది వేశాడు. జితేశ్ శర్మ (8 బంతుల్లో 11 నాటౌట్; సిక్స్) సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్‌ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. -
టీమిండియా కెప్టెన్సీ రేసులో ఊహించని పేరు!.. జట్టులో చోటే లేదే!
ఐపీఎల్-2025 (IPL 2025) సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో తొలిసారి కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు రజత్ పాటిదార్ (Rajat Patidar). విశేష ఆదరణ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు సారథిగా ఎంపికైన అతడు.. తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు.రజత్ పాటిదార్ సారథ్యంలో సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘన విజయం సాధించింది ఆర్సీబీ. అనంతరం.. చెన్నై సూపర్ కింగ్స్‌ను 2008 తర్వాత తొలిసారి చెపాక్‌లో ఓడించింది.సొంత మైదానంలో ఇంత వరకు గెలవలేదుఅయితే, ఇతర వేదికలపై సత్తా చాటిన ఆర్సీబీ సొంత మైదానంలో మాత్రం తేలిపోతోంది. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన పాటిదార్ సేన.. తర్వాత వాంఖడేలో ముంబై ఇండియన్స్‌ను ఓడించి తిరిగి గెలుపు బాట పట్టింది.తర్వాత మళ్లీ పాత కథే. చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. అనంతరం జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఆఖరిగా.. మరలా చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది.ఈ క్రమంలో ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో గెలిచి.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ నాలుగింట గెలిచింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప రజత్ పాటిదార్ గురించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా రాణిస్తున్న పాటిదార్ పేరు.. టీమిండియా కెప్టెన్సీ రేసులోనూ వినిపిస్తుందని అంచనా వేశాడు.టీమిండియా కెప్టెన్సీ రేసులో‘‘ఆర్సీబీ బ్యాటింగ్ విషయంలో రజత్ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ముచ్చటేస్తోంది. నాయకుడిగా గొప్ప పరిణతి కనబరుస్తున్నాడు. సొంతగడ్డపై ఎలా గెలవాలన్న అంశంపై అతడు మరింత దృష్టి సారించాల్సి ఉంది.ఒకవేళ పాటిదార్ ఇలాగే తన విజయపరంపరను కొనసాగిస్తే.. త్వరలోనే టీమిండియా క్రికెట్ కెప్టెన్ గురించి జరిగే చర్చల్లో ముందుగా అతడి పేరే వినిపిస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.జట్టులో చోటే లేదే!కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల రజత్ పాటిదార్ 2023లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. గతేడాది టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. కానీ టీ20లలో మాత్రం అతడికి ఇంత వరకు భారత్ తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇక మూడు టెస్టుల్లో 63, ఒక వన్డేలో 22 పరుగులు చేశాడు పాటిదార్.అయితే, ఐపీఎల్లో కూడా ఇప్పటికి 34 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏకంగా 1008 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టీమిండియాలో చోటుకే నోచుకోవడం లేని పాటిదార్ పేరు కెప్టెన్సీ రేసులో ఊహించడమే కష్టం. అలాంటిది రాబిన్ ఊతప్ప మాత్రం ఈ రకమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.చదవండి: Vaibhav Suryavanshi: యువీ- లారా కలిస్తే అతడు.. చిన్న పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు -
IPL 2025: పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయం
పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయం18.5వ ఓవర్- నేహల్ వధేరా బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన జితేశ్ శర్మ (11) మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ16.4వ ఓవర్- 143 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి పాటిదార్ (12) ఔటయ్యాడు.హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లివిరాట్ 43 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 15 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 122/2గా ఉంది. విరాట్ (50), పాటిదార్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలంటే 30 బంతుల్లో 36 పరుగులు చేయాలి. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ12.3వ ఓవర్- 109 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో నేహల్ వధేరాకు క్యాచ్ ఇచ్చి పడిక్కల్ (61) ఔటయ్యాడు. లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న ఆర్సీబీ158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. 9 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ వికెట్ నష్టానికి 75 పరుగులుగా ఉంది. విరాట్ (35), పడిక్కల్ (38) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలంటే 66 బంతుల్లో మరో 83 పరుగులు చేయాలి. ధాటిగా ఆడుతున్న కోహ్లి, పడిక్కల్ఛేదనలో ఆర్సీబీ ఆదిలోనే సాల్ట్ వికెట్ కోల్పోయినప్పటికీ ధాటిగానే ఆడుతుంది. విరాట్ (31), పడిక్కల్ (22) బ్యాట్ ఝులిపిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 54/1గా ఉంది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆర్సీబీ158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ చివరి బంతికి అర్షదీప్‌సింగ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జోస్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (1) ఔటయ్యాడు. విజృంభించిన ఆర్సీబీ బౌలర్లు.. పంజాబ్ స్కోరెంతంటే?ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33), వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్ (31 నాటౌట్), మార్కో యాన్సెన్ (25 నాటౌట్) ఓ మోస్తరుగా పరుగులు రాబట్టారు.మిగతా వాళ్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6), నేహాల్ వధేరా (5 రనౌట్), మార్కస్ స్టొయినిస్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. పేసర్ రొమారియో షెఫర్డ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.పదహారు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 129-6యాన్సెన్ 11, శశాంక్ 19 పరుగులతో ఉన్నారు. మరోవైపు.. ఆర్సీబీ స్పిన్నర్ సూయశ్ శర్మ స్థానంలో బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ సబ్‌గా వచ్చాడు.ఆరో వికెట్ డౌన్13.5: సూయశ్ శర్మ బౌలింగ్‌లో స్టొయినిస్ (1) బౌల్డ్. మార్కో యాన్సెన్ క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 114-6(14). శశాంక్ సింగ్ 15 పరుగులతో ఉన్నాడు.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్13.2: సూయశ్ శర్మ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్ (29) బౌల్డ్ అయ్యాడు. మార్కస్ స్టొయినిస్ క్రీజులోకి వచ్చాడు. శశాంక్ 14 పరుగులతో ఉన్నాడు. పంజాబ్ స్కోరు: 112/5 (13.2) .సెంచరీ కొట్టిన పంజాబ్12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి సరిగ్గా 100 పరుగులు చేసింది. ఇంగ్లిష్ 22, శశాంక్ సింగ్ 9 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్8.6: సూయశ్ శర్మ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్- నేహాల్ వధేరా (5)తో కలిసి సింగిల్ తీశాడు. అయితే, రెండో పరుగు తీసే క్రమంలో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో నేహాల్ వధేరా రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పంజాబ్ స్కోరు: 76/4 (9). శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు.శ్రేయస్ అయ్యర్ అవుట్7.4: రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (6)కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. నేహాల్ వధేరా క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 69/3 (7.5) . జోష ఇంగ్లిస్ ఐదు పరుగులతో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్6.1: ప్రభ్‌సిమ్రన్ (33) రూపంలో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ పెవిలియన్ చేరాడు. జోష్ ఇంగ్లిస్ అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు.పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు: 62-1(6)ప్రభ్‌సిమ్రన్ 33, శ్రేయస్ అయ్యర్ ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్4.2: కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగిన ప్రియాన్ష్ ఆర్య (22). క్రీజులోకి శ్రేయస్ అయ్యర్.నిలకడగా ఆడుతున్న ఓపెనర్లుప్రభ్సిమ్రన్ 10 బంతుల్లో 19, ప్రియాన్ష్ ఆర్య 14 బంతుల్లో 22 పరుగులతో ఆడుతున్నారు. నాలుగు ఓవర్లలో పంజాబ్ స్కోరు: 41-0 తొలి ఓవర్లో పంజాబ్ స్కోరు: 2-0కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్. ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్ ఒక్కో పరుగుతో ఉన్నారు.🚨 Toss 🚨@RCBTweets won the toss and elected to bowl against @PunjabKingsIPL in Match 37.Updates ▶️ https://t.co/6htVhCbltp#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/gg5M40bjrg— IndianPremierLeague (@IPL) April 20, 2025ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ (PBKS vs RCB) మధ్య ఆదివారం మ్యాచ్ జరుగనుంది. చండీగడ్‌లోని ముల్లన్‌పూర్‌లో గల మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య పంజాబ్ బ్యాటింగ్ చేసింది.తుదిజట్లుపంజాబ్ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: హర్‌ప్రీత్ బ్రార్, విజయ్‌కుమార్ వైషాక్, సూర్యాంశ్ షెడ్గే, గ్లెన్ మాక్స్వెల్, ప్రవీణ్ దూబేఆర్సీబీఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సూయశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్.ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భండాగే, జేకబ్ బెతెల్, స్వప్నిల్ సింగ్.ప్రతీకారం తీర్చుకోవాలనికాగా ఈ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో తలపడ్డ పంజాబ్ సొంతమైదానంలోనే వారిని ఓడించింది. వర్షం వల్ల పద్నాలుగు ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ను వారి సొంత గడ్డపై ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది.