peace movement
-
శాంతి కోసం స్త్రీ శక్తి
ఎప్పుడు, ఏ అడుగులో మందుపాతర పేలుతుందో తెలియని కల్లోల ప్రాంతం అది. అక్కడ శాంతిపరిరక్షణ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం అనేది కత్తి మీద సాముకు మించిన కఠినవ్యవహారం. సుడాన్, దక్షిణ సుడాన్ సరిహద్దులలోని రణక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు మనదేశ మహిళా శాంతిపరిరక్షకులు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ ఉద్యమంలో భాగం అవుతూ, లార్జెస్ట్ సింగిల్ యూనిట్‌గా కొత్త చరిత్ర సృష్టించారు ఇండియన్ ఉమెన్ పీస్‌కీపర్స్... సుడాన్, దక్షిణ సుడాన్‌ల సరిహద్దు నగరం అభేయ్. చక్కని వ్యవసాయానికి, సంపన్న చమురు క్షేత్రాలకు ప్రసిద్ధిగాంచిన ‘అభేయ్’పై ఆధిపత్యం కోసం, స్వాధీనం చేసుకోవడం కోసం సుడాన్, దక్షిణ సుడాన్‌లు పోటీ పడుతుంటాయి. ఇరుదేశాల మధ్య సాయుధ ఘర్షణల వల్ల ఈ ప్రాంతానికి శాంతి కరువైంది. రక్తపాతమే మిగిలింది. సరిహద్దు ప్రాంతాలలో జాతి, సాంస్కృతిక, భాష వివాదాలు కూడా హింసకు ఆజ్యం పోస్తున్నాయి. సుడాన్, దక్షిణ సుడాన్‌ల సాయుధ ఘర్షణలలో అభి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అక్కడ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో అభిలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. యూఎన్ చేపడుతున్న పీస్‌కీపింగ్ మిషన్లలో మన దేశం ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తోంది. వాటిలో మహిళల ప్రాతినిధ్యానికి మొదటి నుంచి తగిన ప్రాధాన్యత ఇస్తోంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో యూఎన్ పీస్‌కీపింగ్ మిషన్ కోసం మన దేశం 2007లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను ఏర్పాటు చేసి, అలా ఏర్పాటు చేసిన తొలి దేశంగా గుర్తింపు పొందింది భారత్. మన మహిళా బృందాలు లైబీరియాలో శాంతిపరిరక్షణ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాలేదు. వివిధ విషయాలలో స్థానికులను చైతన్యం చేశారు. ప్రజలకు రోల్‌మోడల్‌గా నిలిచారు. అక్షరాస్యతకు ప్రాధాన్యత పెరిగేలా చేశారు. గత కొంత కాలంగా ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మహిళల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేస్తోంది. 2007లోనే ‘ఆల్ ఉమెన్’ టీమ్ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచింది భారత్. ‘ఛాంపియన్ ఆఫ్ జెండర్ మెయిన్‌స్ట్రీమింగ్’గా గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి చేపడుతున్న శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మన దేశ మహిళలకు మంచి పేరు ఉంది. ధైర్యంగా విధులు నిర్వహించడమే కాదు, స్థానికులత కలిసిపోతున్నారు. వారి కుటుంబాల్లో ఒకరిగా మారుతున్నారు. మహిళల సమస్యలను అర్థం చేసుకొని వారిని చైతన్యం వైపు నడిపిస్తున్నారు. తాజాగా ‘అభేయ్’ ప్రాంతంలో విధులు నిర్వహించే ‘లార్జెస్ట్ సింగిల్ యూనిట్’గా ఇండియన్ ఉమెన్ పీస్‌కీపర్స్ చరిత్ర సృష్టించారు. ఈ యూనిట్లో వివిధ హోదాలలో ఉన్న 27 మంది మహిళలు పనిచేస్తున్నారు. కాస్త వెనక్కి వెళితే... కిరణ్ బేడీ, మేజర్ సుమన్ గవాని, శక్తిదేవి... మొదలైన అధికారులు ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో తమదైన ముద్ర వేసి ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చారు. -
గత అధ్యక్షులు విఫలం
వాషింగ్టన్: కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన కోసం గతంలో అమెరికా చేసిన ప్రయ త్నాలన్నీ బెడిసికొట్టాయి. ఆ విషయంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన 11 మంది ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయా రు. 1960ల్లో కెన్నడీ, జాన్సన్ అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఉత్తర కొరియాతో కొంతవరకు సత్సంబంధాలు కొనసాగాయి. 1968లో అమెరికా నిఘా నౌకల్ని నిర్బంధించడంతో పాటు గూఢచర్య విమానాల్ని ఉత్తర కొరియా పేల్చివేసింది. ఆ తర్వాత రెండేళ్లకి ఉత్తర కొరియా తన ధోరణి మార్చుకుని శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. 1974 అనంతరం అప్పటి ఉత్తర కొరియా అధినేత కిమ్ ఇల్ సంగ్, అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌తో శాంతి ఒప్పందానికి ప్రయత్నాలు చేశారు. అయితే చర్చల్లో ముందడుగు పడలేదు. 1981 లో అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించారు. దక్షిణా కొరియాను సమర్థిస్తూ మిలటరీ బలగాల్ని పెంచారు. ఆ తర్వాతి అధ్యక్షుడు జార్జ్ బుష్(సీనియర్) దక్షిణకొరియా నుంచి భారీగా సైన్యాన్ని వెనక్కి రప్పించారు. అయితే ఉత్తరకొరియాతో శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. 1993–2001 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ ఉత్తర కొరియాతో సంక్షోభ పరిష్కారానికి కొంతవరకు ప్రయత్నాలు చేశారు. పదేళ్ల పాటు శాంతియుత సంబంధాలే కొనసాగినా, జార్జ్ బుష్(జూనియర్) అధ్యక్షుడయ్యాక మళ్లీ సంబంధాలు క్షీణించాయి. ఉ.కొరియాతో సంబంధాల విషయంలో ఒబామా సంయమనం పాటించారు. ఆంక్షలతో దారికి వస్తుం దని భావించారు. 2011లో ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టిన కిమ్ ఆంక్షల్ని లెక్క చేయకుం డా అణుపరీక్షలు కొనసాగించారు. ఈ సారైనా ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు వెళ్తా యా? లేక గతంలో మాదిరిగా ప్రహసనంగా మారుతుం దా? అన్నది ట్రంప్ చేతుల్లోనే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
సెప్టెంబర్ 4 వరకు ‘శాంతి’ ఉద్యమం
జమాతె ఇస్లామీ హింద్ పిలుపు సంగారెడ్డి టౌన్: సర్వమతాలకు నిలయమైన మన దేశంలో మత రాజకీయాలు ఎక్కువయ్యాయని, మతసామరస్యానికి, శాంతిని కోరుకొనే మానవతా వాదులంతా కలిసి రావాలని జమాతె ఇస్లామీ హింద్ (జెఐహెచ్) పిలుపునిచ్చింది. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెఐహెచ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు హాఫిజ్ మహ్మద్ రిషాదోద్దీన్ మాట్లాడుతూ శాంతి స్థాపన కోసం, మతసామరస్యం కోసం దేశవ్యాప్తంగా ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు ‘శాంతి-మానవత ఉద్యమం’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ధార్మిక్ జన్‌మోర్చా కార్యక్రమం ద్వారా రాష్ట్ర, నగర స్థాయిలలో, సద్భావనా మంచ్ ద్వారా కింది స్థాయి వరకు కార్యక్రమాలను తీసుకెళ్తామన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జెఐహెచ్ జిల్లా అధ్యక్షుడు అంజద్ హుస్సేన్, జెఐహెచ్ సంగారెడ్డి అధ్యక్షుడు గౌస్ మోయియోద్దీన్, జెఐహెచ్ సంగారెడ్డి ప్రెస్ అండ్ పబ్లిసిటీ కార్యదర్శి మహ్మద్ అతర్ మోహియోద్దిన్ షాహెద్, యండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.