అందమె ఆనందం!
చర్మం తరచూ పొడిబారి విసిగిస్తుంటే... సోయాపిండిలో కాసింత తేనె, కొద్దిగా పాలు కలిపి, ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది!
వేరుశెనగ నూనె, నిమ్మరసం సమపాళ్లలో కలిపి, దానితో ముఖం తరచుగా మర్దనా చేస్తూ ఉంటే... బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గుతాయి!
బొప్పాయిగుజ్జులో తేనె, పాలు, బాదం నూనె చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమంతో బాగా రుద్దుకుంటే చేతులు, కాళ్లు ఎంతో మృదువుగా తయారవుతాయి!
అల్లాన్ని మెత్తని పేస్ట్‌లా చేసుకుని, దానికి కాస్త తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి మాడుకు పట్టించాలి. ఆరిన తర్వాత కుంకుడు రసంతో తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చుండ్రు సమస్య వదిలి పోతుంది!