Pedaavutupalli
-
రికవరీ రేటు: 84 శాతంతో జిల్లా మొదటి స్థానం..
సాక్షి, కృష్ణా : రాష్టంలోనే బెస్ట్ కోవిడ్ సెంటర్‌గా పెదఅవుటుపల్లిలో ఉన్నజిల్లా కోవిడ్ సెంటర్‌ను ప్రభుత్వం గుర్తించిందని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని పలు కోవిడ్ కేర్ సెంటర్లను మంగళవారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సందర్శించారు. ఆయనతోపాటు రాష్ట్ర హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కేఎస్ జవహర్ రెడ్డి, కమిషనర్ భాస్కర్, జాయింట్ కలెక్టర్ శివ శంకర్, సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ కూడా ఉన్నారు. పెదఅవుటుపల్లి ,గూడవల్లిలోని ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లతో పాటు స్టేట్ కోవిడ్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్.. కోవిడ్ బాధితులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. (ఏపీలో కొత్తగా 10,368 కరోనా కేసులు) అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెదఅవుటుపల్లిలో ఉన్న పిన్నమనేని కళాశాలను డిస్టిక్ కోవిడ్ సెంటర్‌గా వినియోగిస్తున్నామన్నారు. ఇక్కడ 300 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, 2600 మంది ఈ సెంటర్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇక్కడ ఉన్న హెల్ప్ డెస్క్‌తో పాటు పేషేంట్లకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నామని వెల్లడించారు. 16 సీసీ కెమెరాలతో ఇక్కడ శానిటేషన్ చర్యలు, మెడికల్ ఫెసిలీటీస్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. జిల్లాలో కోవిడ్‌ను జిల్లాలో కట్టడి చేస్తున్నామన్నారు. రికవరీ రేటు రాష్ట్ర సగటు74 శాతం ఉంటే జిల్లా 84 శాతంతో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో ఎక్కువ కరోనా పరీక్షలు సైతం చేస్తున్నామని వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్, శానిటైజర్లను ప్రజలు వినియోగించడం ద్వారానే కరోనా కట్టడి సాధ్యం అయ్యిందన్నారు. (అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి) -
హైవేపై కాల్పుల నిందితులకు 25వరకూ రిమాండ్
గన్నవరం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెదఅవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం ఉదయం గన్నవరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వారికి ఈనెల 24వ తేదీ వరకూ న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కాగా అంతకు ముందు సీపీ ....అయిదు గంటల పాటు నిందితులను విచారించారు. మూడు హత్యల కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను భారీ భద్రత నడుమ ప్రత్యేక బస్సులో కమిషనరేట్‌కు తీసుకు వచ్చారు. గత నెల 24న కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో అయిదో నెంబరు జాతీయ రహదారిపై జరిగిన కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలు దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. -
బెజవాడలో ముగ్గురి దారుణహత్య
పాత కక్షలతో తండ్రి, ఇద్దరు కొడుకులపై కాల్పులు హత్య కేసులో కోర్టు వాయిదాకు కారులో వస్తుండగా ఘటన జాతీయ రహదారిపైనే తెగబడిన దుండగులు కిరాయి హంతకుల పనేనని పోలీసుల అనుమానం విజయవాడ: ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన ఘర్షణలు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకున్నాయి. గతంలో జరిగిన ఓ హత్యకు ప్రతీకారంగా ప్రత్యర్థులు వారిని కిరాతకంగా హతమార్చా రు. పాత కేసులో కోర్టు వాయిదాకు హాజరయ్యేం దుకు కారులో వస్తున్న ఇద్దరు నిందితులతో పాటు వారి తండ్రిని విజయవాడ సమీపంలో దారికాచి తుపాకులతో కాల్చి చంపారు. కారు డ్రైవరు పరారై పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో 5వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రత్యర్థుల కాల్పుల్లో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పెదకడిమి గ్రామానికి చెందిన గందోడి(గంధం) నాగేశ్వరరావు(55), అతని కుమారులు పగిడి మారయ్య(36), గుంజుడు మారయ్య(32) మృతి చెందారు. వీరిపై 18 రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగి పోలీసులు వివరించారు. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన జ్యోతిష్యుడు భూతం దుర్గారావు హత్య కేసులో ఆయన బంధువు కూరపాటి నాగరాజుతోపాటు ఇతని సోదరి కుమారులైన ఇద్దరు మారయ్యలు కూడా నిందితులుగా ఉన్నారు. హత్య జరిగినప్పటి నుంచి దుర్గారావు, నాగరాజు కుటుంబాల మధ్య కలహాలు తలెత్తాయి. ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత నిందితులంతా ముంబైలో తలదాచుకుంటున్నారు. అయితే ఏలూరు జిల్లా కోర్టులో కేసు విచారణ జరుగుతుండటంతో వాయిదాలకు మాత్రం వచ్చి వెళుతున్నారు. బుధవారం కూడా వాయిదాకు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు మారయ్యలను వారి తండ్రి నాగేశ్వరరావు కలుసుకున్నారు. అక్కడి నుంచి అద్దె కారులో ఏలూరు బయల్దేరారు. పెదఅవుటుపల్లి సమీపంలోకి రాగానే వీరి కారును కొందరు దుండగులు తమ వాహనంతో ఢీకొట్టారు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులు జరిపి ముగ్గురినీ హతమార్చారు. ఘటనా స్థలాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. కేసు దర్యాప్తుకు, హంతకులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. దుండగుల వేషధారణ, భాష, కాల్పులు జరిపిన తీరును బట్టి ముంబై లేదా హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెషనల్ కిల్లర్స్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. వారు వాడిన వాహనాన్ని హనుమాన్‌జంక్షన్‌లో వదిలేసి వెళ్లడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి దుండగులు రాజమండ్రి వైపు వెళ్లినట్లు నిర్ధారించారు. కాగా, దుండగులు వాడిన వాహనం దుర్గారావు సోదరుడు శ్రీనివాస్‌దని దర్యాప్తులో తేలింది.