pehalwans
-
పెహల్వాన్ రెడీ అవుతున్నాడు
కన్నడ స్టార్ హీరో సుదీప్ తన నెక్ట్స్ సినిమా కోసం పెహల్వాన్‌గా మారబోతున్నారు. యస్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘పెహల్వాన్’ సినిమాలో సుదీప్ బాక్సింగ్ చాంపియన్‌లా కనిపించనున్నారట. ఈపాత్ర కోసం తన ఫిజిక్‌ని ఆల్రెడీ మార్చే పనిలో ఉన్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లారెన్ స్టోవాల్ ‘పెహల్వాన్’ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ డిజైన్ చేయనున్నారట. ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్, హంగర్ గేమ్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’కు ఫైట్స్ కంపోజ్ చేశారు లారెన్. ప్రస్తుతం సుదీప్ ‘పెహల్వాన్, కోటి గొబ్బ 3’, తెలుగులో ‘సైరా’ సినిమాలతో బిజీగా ఉన్నారు. -
'సుల్తాన్' షేప్ కోసం పూజలు
కాన్పూర్: జస్ట్ చొక్కా విప్పి కండలు చూపెడితేనే సల్మాన్ ఖాన్ సినిమాలు రికార్డులు బద్దలవుతాయి. అలాంటిది ఈ సారి ప్యాంటు కూడా తీసేసి 'సుల్తాన్'గా లంగోటాతో బరిలోకి దిగి, బాక్సాఫీసును షేక్ చేశాడు. ఆ సినిమా కలెక్షన్లు రూ.500 కోట్లకు చేరువయ్యాయి. లేటు వయసులోనూ చక్కటి శరీర సౌష్టవంతో ఫ్యాన్స్ ను అలరిస్తున్న సల్మాన్ ఖాన్.. ఫిట్ నెస్ విషయంలో ఎందరికో స్పూర్తి. ఇక ఉత్తరప్రదేశ్ లోనైతే కొందరు పహిల్వాన్లు 'సుల్తాన్' షేప్ కోసం కసరత్తులతోపాటు ఏకంగా సల్మాన్ ఖాన్ చిత్రపటానికి పూజలు చేస్తున్నారు. కాన్పూర్ (యూపీ)లోని చందు అఖడ్ (వ్యాయామశాల)కు చెందిన పహిల్వాన్లు ఇటీవలే 'సుల్తాన్' సినిమా చూశారట. తర్వాతి రోజునుంచే.. ఫిట్ నెస్ కోసం సల్మాన్ సినిమాలో ఏమేం చేశాడో అన్ని ఫీట్లూ ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్లు. ఈ తతంగానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రాక్టీస్ వరకు సరేగానీ సల్మాన్ కు పుజల విషయంలోనే వీరిపై విమర్శలు చెలరేగాయి.