Pelli
-
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను– సంతోష్ శోభన్
‘‘వందేళ్ల ఇండియన్ సినిమాల్లో ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ చెప్పని కథ, ఎవరూ చేయని పాత్రను ఎలివేట్ చేయటం అనేది ఓ ఆర్టిస్ట్‌కి కొత్తగా ఉంటుంది. అలా పెళ్లి మండపంపై మిగిలిపోయేవాడి కథే ‘ప్రేమ్ కుమార్’’ అని హీరో సంతోష్ శోభన్ అన్నారు. సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచితా సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’.అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘అభిషేక్ కొన్ని సినిమాల్లో నటుడిగా చేశాడు. దర్శకుడు కావాలనుకున్నప్పుడు ‘ప్రేమ్ కుమార్’ కథ రాసుకుని, చక్కగా తీశాడు. వరుసగా వరుడు, పెళ్లి వంటి సినిమాలు చేస్తున్నాను. అయితే నిజ జీవితంలో నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను (నవ్వుతూ). నేనిప్పటి వరకు మంచి డైరెక్టర్స్‌తో సినిమాలు చేశాను. అయితే నేను చేసిన సినిమాలన్నీ కరెక్ట్‌గానే ఎంచుకున్నానా? అంటే లేదనే అంటాను. ‘ప్రేమ్ కుమార్’ నాకు సరైన హిట్ ఇస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. -
నా సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం ఏంటి అంటే...
-
సినిమా ఆఫర్స్ వస్తుంటే సుకుమార్ ఆమాట అన్నాడు ..
-
జనాలు నన్ను మర్చిపోతారు ఏమో అని ఆలా చేశా..
-
అగ్రహీరోలతో అలరించిన మహేశ్వరి .. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
అప్పటి తెలుగు సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు మహేశ్వరి. అప్పట్లో పలు అగ్రహీరోలతో సినిమాలు చేసింది. ఇప్పటి సినీ ప్రేక్షకులకు ఆమె పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 35 చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులో పెళ్లి చిత్రంలో హీరోయిన్గా ఆకట్టుకుంది. అయితే మహేశ్వరి తెలుగులో అమ్మాయి కాపురం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. పెళ్లి సినిమాతోనే మహేశ్వరికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రవి తేజతో కలిసి జంటగా నటించిన నీకోసం చిత్రానికి ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకుంది. గులాబీ సినిమా ఆమెకు మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. అయితే 2008లో జయకృష్ణ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అయితే శ్రీదేవికి బంధువైన మహేశ్వరి ఇప్పుడేలా ఉంది? ఏం చేస్తోందో తెలుసుకుందాం. తమిళంలో ఎంట్రీ ఉల్లాసం అనే తమిళ చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించింది. ఆమె తమిళంలో అజిత్, విక్రం వంటి అగ్ర నటుల సరసన నటించింది. ' జీ తెలుగు సీరియల్ 'మై నేమ్ ఈజ్ మంగతాయారు'లో నటించింది. అయితే ఈ ధారావాహిక తమిళంలో కూడా ప్రసారమయ్యేది. తెలుగులో గులాబీ, దెయ్యం, నీ కోసం, పెళ్లి, ప్రియరాగాలు, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ, తదితర చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగులో చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రంలో కనిపించింది. శ్రీదేవి ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం ఈ మధ్య కాలంలో ఆమె కనుమరుగయ్యారు. అయితే తాజాగా ఇటీవల సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు అండగా ఉంటున్నారామె. చెన్నైకి వచ్చినప్పుడల్లా శ్రీదేవితోనే కలిసి ఉండేవారట. ప్రస్తుతం షూటింగ్స్‌లో జాన్వీకి తోడుగా ఉంటున్నారు. తాజా సమాచారం ప్రకారం నటి మహేశ్వరికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
చీకట్లో ఒకరోజు...
పట్టుకోండి చూద్దాం ‘‘నువ్వు ఆ సృజనను పెళ్లి చేసుకుని ఉంటే ఇలా అద్దె ఇంట్లో కాకుండా ఏడంతస్తుల మేడలో కాలు మీద కాలు వేసుకొని సుఖంగా జీవించేవాడివి. నాలో ఏం నచ్చి పెళ్లి చేసుకున్నావు?’’ అని అడిగింది జానకి. జానకిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కిశోర్. ఈ పెళ్లి వాళ్ల ఇంట్లో వాళ్లకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కిశోర్ మేనత్త సుజాత కోటీశ్వరురాలు. భర్త చిన్నవయసులోనే చనిపోయినా అధైర్యపడకుండా నలుగురు గొప్పగా చెప్పుకునే పారిశ్రామికవేత్తగా ఎదిగింది. చిన్నస్థాయి నుంచి కోట్లు సంపాదించే పారిశ్రామికవేత్తగా ఎదిగిన సుజాత అంటే చుట్టాలు పక్కాలలో చాలా గౌరవం. ఆమె జీవితాన్ని పిల్లలకు పాఠాలుగా చెబుతుంటారు. సుజాతకు ఒకే కూతురు. పేరు సృజన. సృజనకు కిశోర్ అంటే చెప్పలేనంత ఇష్టం. పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటానని పట్టుబట్టింది. అతి కష్టం మీద కూతురు కోరికను మన్నించింది సుజాత. అయితే మరోవైపు పరిస్థితి భిన్నంగా ఉంది. కిశోర్ తన కొలిగ్ అయిన జానకిని ప్రేమించాడు. సృజన ప్రపోజల్‌ని తిరస్కరించి జానకిని పెళ్లి చేసుకున్నాడు. ‘‘కిశోర్ తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నాడు’’ అంటూ చాలామంది తిట్టారు. ఇక కుటుంబ సభ్యులైతే కిశోర్‌తో మాట్లాడడమే మానేశారు. ఒక విధంగా చెప్పాలంటే తమ నుంచి బహిష్కరించారు. తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్యతో పాటు ఉంటున్నాడు కిశోర్. ‘‘కిశోర్ స్థానంలో వేరే ఎవరినీ భర్తగా ఊహించలేను. నేను ఎవరినీ పెళ్లి చేసుకోను’’ అంది సృజన. కూతురికి రకరకాలుగా చెప్పి చూసింది సుజాత. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా చేయించింది. అయినా ఫలితం లేదు. ‘‘కిశోర్‌ను తప్ప ఎవరినీ భర్తగా ఊహించలేను’’ అని ఎప్పటిలాగే చెబుతుంది తప్ప ‘పెళ్లి చేసుకుంటాను’ అనడం లేదు సృజన. తన కూతురి జీవితాన్ని ఎడారి చేసిన కిశోర్ అంటే సుజాతకు అసహ్యం ఏర్పడింది. ‘‘ఏ భార్యను చూసి అయితే మురిసిపోతున్నావో... ఆ భార్య వల్లే చనిపోతావు’’ అని కిశోర్‌ను కసిగా తిట్టుకుంది సుజాత. ఆరోజు కిశోర్, జానకీల పెళ్లి రోజు. పెళ్లి చేసుకోవడానికి తాము ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారో ఒకసారి గుర్తుతెచ్చుకున్నారు ఇద్దరు. ‘‘నువ్వు ఆ సృజనను పెళ్లి చేసుకుని ఉంటే ఇలా అద్దె ఇంట్లో కాకుండా ఏడంతస్తుల మేడలో కాలు మీద కాలు వేసుకొని సుఖంగా జీవించేవాడివి. నాలో ఏం నచ్చి పెళ్లి చేసుకున్నావు?’’ అని అడిగింది జానకి. ‘‘నీ మనసు చూసి పెళ్లి చేసుకున్నాను. మంచి మనసును కోట్లతో కొలవలేము’’ అన్నాడు కిశోర్. కొద్దిసేపటి తరువాత.... ‘‘నేను క్రికెట్ మ్యాచ్ చూస్తాను’’ అంటూ టీవి ముందు వాలిపోయాడు కిశోర్. జానకి తన గదిలోకి వెళ్లి పుస్తకం చదువుకుంటుంది. కొద్దిసేపటి తరువాత కరెంట్ పోయింది. కొత్తగా ఇల్లు మారారు. ఇంట్లో వెలిగించడానికి ఒక్క క్యాండిల్ కూడా లేదు. జానకి సెల్‌ఫోన్ రిపేర్‌లో ఉంది. కరెంట్ వచ్చేలోపే కిశోర్ హత్యకు గురయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. జానకిని ఎంక్వ్యేరీ చేశారు. ‘‘ఆయన టీవీ చూస్తున్నారు. కొద్దిసేటి తరువాత కరెంట్ పోయింది. నేను గది నుంచి బయటకు రాలేదు. పుస్తకం చదువుతూ కూర్చున్నాను’’ అని చెప్పింది జానకి. ఇంట్లో వెలిగించడానికి ఒక్క క్యాండిల్ కూడా లేదు. జానకి సెల్‌ఫోన్ రిపేర్‌లో ఉంది. మరి ఆ చీకట్లో ఆమె పుస్తకం ఎలా చదవగలిగింది? పోలీసులు జానకిని ఎందుకు అనుమానించలేదు? Ans: పోలీసులు జానకిని అనుమానించకపోవడంలో ఎలాంటి తప్పులేదు. జానకి అంధురాలు. ఆ చీకట్లో ఆమె చదివింది బ్రెయిలీ బుక్. దీన్ని చదవడానికి వెలుగుతో పని లేదు కదా!