Pendyala raghava rao
-
తీన్మార్ విక్టరీ
ఎన్నికల్లో ఒకచోట గెలవడమే గగనమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేసారి ఏకంగా మూడుచోట్ల గెలిచి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించారు పెండ్యాల రాఘవరావు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయరంగంలో ఆయనది చెరగని ముద్ర. ప్రస్తుత తరానికి ఆయన గురించి తెలియకపోవచ్చు. జైలు నుంచే నామినేషన్ వేసి ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో పోటీ చేసి ఎలాంటి ప్రచారం లేకుండానే అన్ని స్థానాల్లోనూ విజయం సాధించిన అసామాన్యుడు. ఇది దేశంలోనే అరుదైన రికార్డు. దీనిని ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేదు. పెండ్యాల రాఘవరావు ఒక సామాజికవేత్తగా జీవితాన్ని ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగిన క్రమం.. ప్రస్తుత రాజకీయ నాయకులకు ఓ పాఠం. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం తొలి ఎంపీ ఆయన. మూడుచోట్ల గెలుపు రాఘవరావు 1952లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి, హన్మకొండ, వర్ధన్నపేట శాసనసభ స్థానాల నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేశారు. అనూహ్యంగా ఆయన ఈ మూడు స్థానాల్లోనూ విజయం సాధించారు. వరంగల్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి ప్రజాకవి కాళోజీ నారాయణపై పోటీచేసి 3,613 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదే సమయంలో హన్మకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి బీకే రెడ్డిపై 6,628 ఓట్ల మెజార్టీతో, వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సి.రావుపై 2,803 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ మూడింటిలో వరంగల్ లోక్‌సభ స్థానంలో కొనసాగడానికి ఇష్టపడ్డారాయన. శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. స్వాతంత్య్ర పోరాటాలతో ప్రభావితం పెండ్యాల రాఘవరావుది ప్రస్తుత జనగామ జిల్లా చిన్నపెండ్యాల గ్రామం. 1917లో జన్మించారు. తల్లిదండ్రులు పెండ్యాల రామచంద్రారావు, రామానుజమ్మ. ఆయన హన్మకొండలో చదువుకున్నారు. 1930లో స్వాతంత్య్ర పోరాటాలు ఆయనను ప్రభావితం చేశాయి. హన్మకొండ నుండి చిన్న పెండ్యాలకు తిరిగి వెళ్లిన తర్వాత రాఘవరావు సంఘ సంస్కర్తగా మారారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇక్కడ నిజాం రాష్ట్రానికి మాత్రం రాలేదు. ఆ మధ్య కాలంలో రాఘవరావు రాజకీయంగా ఎంతో ఎదిగారు. మొదట్లో ఆర్య సమాజం, ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. హరిజనులతో సహపంక్తి భోజనాలు చేశారు. ఆంధ్రమహాసభలో చీలిక రావడంతో కమ్యూనిస్టులతో చేరి సాయుధ పోరాటం వైపు మొగ్గు చూపారు. జైలు నుంచే పోటీ నిజాంకు వ్యతిరేకంగా సైనిక చర్యతో హైదరాబాద్ స్టేట్‌కి కూడా స్వాతంత్య్రం వచ్చింది. లక్ష్యం నెరవేరింది కాబట్టి సాయుధ పోరాటాన్ని విరమించాలనేది ఆయన వాదన. కొనసాగించాలన్న వారి వాదనను వ్యతిరేకించారు కూడా. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని వాదించారు పెండ్యాల. దీంతో భారత కమ్యూనిస్టు పార్టీ.. రావి నారాయణరెడ్డి, రాఘవరావు సభ్యత్వాలను రద్దు చేసింది. సైనిక చర్య సందర్భంగా రాఘవరావు మల్కాపురం ప్రాంతంలో పోలీసులకు దొరికి జైలు పాలయ్యారు. ఆయన జైల్లో ఉండగానే (1952) ఎన్నికలు వచ్చాయి. దీంతో జైలు నుంచే ఎన్నికల్లో పోటీ చేశారాయన. కమ్యూనిస్టు పార్టీ తమ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో నారాయణరెడ్డి, రాఘవరావు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పక్షాన ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 1957 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఎస్ఏ ఖాన్ చేతిలో ఓడిపోయారు. హక్కులపై ప్రసంగం పెండ్యాల రాఘవరావు పార్లమెంట్లో పలు అంశాలపై అనర్గళంగా ప్రసంగించారు. సంస్థానాలను విలీనం చేసినప్పుడు జమీందార్లు, జాగీర్దార్లకు లక్షల్లో పారితోషికాలు ఇచ్చే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. స్త్రీల హక్కులపై గళమెత్తారు. కల్లుగీత చట్టాన్ని తేవడంలో కీలకపాత్ర పోషించారు.– గజవెల్లి షణ్ముఖరాజు, స్టాఫ్ రిపోర్టర్– వరంగల్ రూరల్ -
ఎన్నికల్లో ఓడిన కాళోజీ, భూపతి
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘అభ్యర్థి ఏ పార్టీవాడని కాదు, ఏ పాటి వాడో చూడు... ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు, ఇందాకా ఏం చేశాడో చూడు’ అని ప్రజల అప్రమత్తతను గుర్తు చేసిన కాళోజీ నారాయణరావు సైతం ఎన్నికల్లో నెగ్గుకురాలేక పోయా రు. 1952లో ఆయన వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. పీడీఎఫ్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు కాళోజీ మీద గెలిచారు. ఎమర్జెన్సీకి నిరసనగా కాళోజీ సత్తుపల్లిలో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై 1978లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. వరంగల్ జిల్లాకే చెందిన మరో అదర్శ వ్యక్తి భూపతి కృష్ణమూర్తి కూడా 1972, 1978, 1983 ఎన్నికల్లో వరంగల్ నుంచి అసెంబ్లీకి వేర్వేరు పార్టీల తరఫున బరిలోకి దిగారు. మూడు సార్లూ ఆయన పరాజయం పాలయ్యారు. గిది మీ ఊరే.. కమలాపూర్, కరీంనగర్ జిల్లా ఈటెల.. గిటు చూడవేలా! - గ్రామం…లోని ఆరు పడకల ఆస్పత్రిని 30 పడకలుగా మారుస్తామన్న హామీ.. హామీగానే మిగిలిపోయింది - 2009లో 68మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసినా ఇప్పటి వరకు చూపని భూములు - గ్రామం…లో ఆర్టీసీ బస్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్న జనం - మంజూరైనా ప్రారంభం కాని పాలశీతలీకరణ పనులు - రోడ్లపైకి వస్తున్న మురుగునీరు.. కంపుకొడుతున్న వార్డులు - కలగా మిగిలిన డిగ్రీ, మహిళా జూనియర్ కళాశాలల ఏర్పాటు - కూరగాయల మార్కెట్ నిర్మాణం ఎక్కడ. కల్లు పారకపోతే కైకిలికే.. వృత్తి పథం(గౌడ): ‘నాకు యాభై ఎనిమిది ఏండ్లచ్చినయ్. ఒక్కచెట్టు ఎక్కితేనే ఆయసం అత్తాంది. బట్టకు, పొట్టకు తప్పితే కొత్తలేమీ(డబ్బు) కూడబెట్టలే. నా భార్య గిప్పుడు సుత కూలి పనికి పోతాంది. ఇద్దరు బిడ్డలు, కొడుకున్నడు. 14 గుంటల భూమి ఉంటే అమ్మి పెద్ద బిడ్డ పెండ్లి చేసిన. మమ్ములను ఎవ్వలూ పట్టించుకుంటలేరు. మొగిపురుగు దెబ్బకు సగం తాటిచెట్లకు రోగమొచ్చి కల్లు పారుతలేదు. పరుపుతాడు కల్లు వడిశి పారబోసుడే ఐతాంది. పోద్దాటి కల్లు సీజన్ల నెలరోజుల్లో దినానికి రూ.200 వస్తాయి. ఇగ పండుతాడు సీజన్ల గంతే పారుతది. పారకపోతె కైకిలి(కూలీ)కి పోవుడే. మళ్ల గీ కల్లు తాగేటందుకు ఇదివరకు లెక్క వత్తలేరు. చానా మంది ఎర్రమందు, గుడుంబాకే అలవాటు పడ్డరు. గప్పట్ల తాటిచెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమి ఇత్తమన్నరు..ఇయ్యలే. గిదంతా కాదు.. మాకు గుర్తింపు కారట్లు ఇయ్యాలె. మాకు ఎక్కువగా చెట్లెక్కి ఒళ్లు నొప్పులు తయారైతయి. గిదీనికి ఉచితంగా వైద్యం చెయ్యాలె. సపరేటు కారట్లు ఇచ్చి ప్రవేటు దవాఖానల్లో ఉచితంగా ఆపరేషన్లు చెయ్యాలె. చెట్ల మీదికెల్లి పడి కాళ్లు,రెక్కలు ఇరగ్గొట్లుకున్నోళ్లకు రూ.25వేలే ఇస్తున్నరు. గదాన్ని రూ.2లక్షలు జెయ్యాలె. చనిపోయిన వాళ్లకు రూ.5లక్షలు ఇయ్యాలె. తాటిచెట్ల పెంపుకానికి అన్ని గీతకార్మిక సొసైటీలకు పదెకరాల భూమి ఇయ్యాలె. ఎక్కే వాడిదే చెట్టు కావాలె. గిప్పుడున్న పన్నులన్నీ రద్దు కావాలె. మాకు సీజన్ లేనప్పుడు ఇంకేదైన పనిజేసుకోడానికి వడ్డీలేని రుణాలివ్వాలె. మాకు సొంతంగా ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి దానితో మమ్మల్ని పైకి తీసుకరావాలె. గా వైఎస్ రాజశేఖరరెడ్డి అచ్చినంక రొండునూర్ల పింఛన్ వత్తాంది. చానామందిమి తీసుకుంటనం. నాలుగేండ్ల కిందట గా పైసలు సరిపోయేది. గిప్పుడు మందుబిల్లలు సుత అత్తలేవు. గా పింఛన్‌ను వెయ్యిరూపాలు చెయ్యాలె. - తాళ్లపల్లి తిరుపతిగౌడ్, హుజూరాబాద్(కరీంనగర్ జిల్లా)