Penguin
-
ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్న ప్రపంచంలోనే తొలి పక్షి ఏంటో తెలుసా!
పక్షులకు, జంతువులకు ఏదైన సమస్య వస్తే మనుషుల మాదిరి ఆస్పత్రులకు వెళ్లడం, చికిత్స చేయించుకోవడం వంటివి ఉండవు. ప్రత్యేకంగా పెంచుకుంటేనో లేక పార్క్‌లో ఉంటేనో వాటి సంరక్షకులు వాటి బాగోగులు గమనించి వెటర్నరీ ఆస్పత్రులకు తీసుకువెళ్లడం జరుగుతోంది. వాటికి మహా అయితే ట్రీట్మెంట్ చేసి పంపిచేస్తారు గానీ స్కానింగ్‌లు వంటి ఉండవు. కానీ తొలిసారిగా ఒక పక్షి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంది. ఇలాంటి స్కానింగ్ చేయించుకున్న తొలి పక్షిగా కూడా నిలిచింది. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లోని అడ్వెంచర్ పార్క్‌లో ఉంటున్న చకా అనే పెంగ్విన్ పక్షి నిలబడటం, కదలికలకు సంబదించిన సమస్యలు ఎదుర్కొంటోంది. అందుకు గల కారణాలేంటో తెలుసుకునేందుకు వెటర్నరీ డాక్టర్లు పలు పరీక్షలు నిర్వహించారు. ఐతే ఎందువల్ల ఈ సమస్యను ఎదర్కొంటుందనేది తెయకపోవడంతో దానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని నిర్ణయించారు వైద్యులు. అందులో భాగంగా ఈ చకా అనే పెంగ్విన్‌కి ఎంఆర్ఐ స్కాన్ చేయగా..అది ఏ మాత్రం భయపడకుండా ఏం జరుగుతుందా అని నిశితంగా గమనించింది. ఈ పరీక్షల తదనంతరం నెమ్మదిగా బ్యాలెన్స్ అవ్వడం, మిగతా పెంగ్విన్ పక్షుల మాదిరి చకచక నడవడం వంటివి చేయగలుగుతోంది. ప్రస్తుతం దాని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని అడ్వెంచర్ పార్క్ పేర్కొంది. దీంతో ప్రపంచంలోనే తొలిసారిగా ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్న తొలిపక్షి. ఈ స్కానింగ్ ప్రక్రియ అనేది సముద్ర జాతికి చెందిన పక్షులు, జంతువుల తోపాటు అభయరణ్యాలు, పార్క్‌ల్లో పెరిగే జంతువులు వంటి వాటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తుందని అంటున్నారు వైద్యులు. (చదవండి: అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు) -
బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి రచించిన ‘ఇంజినీర్డ్ ఇన్ ఇండియా–ఫ్రమ్ డ్రీమ్స్ టు బిలియన్ డాలర్ సైయంట్’ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని, దేశ నిర్మాణంలో తన వంతు పాలుపంచుకోవాలని కలలుకంటూ ఐఐటీ కాన్పూర్ నుంచి 1974లో బయటకు అడుగుపెట్టిన ఓ యువకుని సాహసోపేత కథ ఇది అని పెంగ్విన్ తెలిపింది. భారత్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ముందు అనుభవలేమి, మూలధన అవసరాలను సమకూర్చుకోవడమనే అవరోధాలను సైతం అధిగమించి మోహన్ రెడ్డి సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇది వెల్లడిస్తుందని వివరించింది. -
పెంగ్విన్ ఆర్ట్
పెంగ్విన్ పెయింటింగ్స్ గీసిన చిత్రకారులెందరినో చూసుంటారు. కానీ పెయింటింగ్ వేసే పెంగ్విన్ ఒకటుంది. అద్భుతమైన చిత్రాలను గీయడమే కాదు... వాటితో ఓ ప్రదర్శన కూడా ఏర్పాటయ్యింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. యూకేలోని హెల్స్టన్ సమీపంలో ఉన్న ‘గ్వీక్ కార్నిష్ సీల్ సంరక్షణ కేంద్రం’లో స్క్విడ్జ్ అనే పెంగ్విన్ ఉంది. అది తన పాదముద్రలతో అద్భుతమైన పెయింటింగ్స్ గీసింది. ఆ చిత్రాలను పెన్జేన్స్లో జాతీయ, అంతర్జాతీయంగా ప్రముఖ చిత్రకారుల ప్రదర్శనలు జరిగే... ‘దఎక్సే్ఛంజ్’ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. ఇలా పెంగ్విన్ గీసిన చిత్రాలతో యూకేలో ఎగ్జిబిషన్ జరగడం మొదటిసారి. ఆ పెయింటింగ్స్‌ను ‘ఫండ్ అవర్ ఫ్యూచర్’ పేరుతో https://uk.givergy. com/sealsanctuary వేలంలో కూడా పెట్టారు. వేలంలో పాల్గొనలేనివాళ్లు... ఇదే వెబ్సైట్లో టికెట్ కొంటే ప్రతి ఇద్దరిలో ఒకరు స్క్విడ్జ్ గీసిన చిన్న చిన్న ఆర్ట్ పీస్‌లను గెలుచుకోవచ్చు. ఇలా వచ్చిన డబ్బును సంరక్షణ కేంద్రం అభివృద్ధి, జంతువుల సంక్షేమం కోసం ఉపయోగించనున్నారు. -
నీనా గుప్తా ఆత్మకథ..‘నిజం చెప్పాలంటే’
తన జీవితాన్నితాను ఇష్టపడినట్టుగా జీవించడానికి తన మార్గాన్ని కొనసాగించడానికి ఎప్పుడూ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన నటి నీనా గుప్తా తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’ వెలువరించింది. సినిమా అభిమానుల కంటే స్త్రీలు తప్పక చదవాల్సిన ఆత్మకథ కావచ్చు ఇది. పెంగ్విన్ సంస్థ ఇటీవల ప్రచురించిన నటి నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహూ తో’ (నిజం చెప్పాలంటే) సినిమా అభిమానులను, పాఠకులను కుతూహల పరుస్తోంది. అందులో నీనా గుప్తా తన జీవితంలోని అనేక అంశాలను ‘దాదాపుగా నిజాయితీ’తో చెప్పే ప్రయత్నం చేసిందని విమర్శకులు అంటున్నారు. అందులో కొన్ని విశేషాలు: సతీష్ కౌశిక్‌తో పెళ్లి ‘నటుడు సతీష్ కౌశిక్ నాకు కాలేజీ రోజుల నుంచి తెలుసు. స్నేహితుడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నేను చేరడానికి కారణం అతడే. ముంబైలో నాకు అండా దండగా ఉండేవాడు. నేను వివియన్ రిచర్డ్స్‌తో గర్భం దాల్చి మసాబాకు జన్మనిచ్చాక సతీష్ ‘నన్ను పెళ్లి చేసుకో. నీ బిడ్డకు తండ్రిగా నా పేరు ఉంటుంది’ అన్నాడు. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. సింగిల్ మదర్‌గా నేను, తండ్రి లేని పిల్లగా నా కూతురు మనలేరు అని అతడు నా కోసం బాధ పడ్డాడు.’ అని రాసింది నీనా. బయటపడ్డ ప్రాణాలు ‘మసాబా పుట్టిన మూడు నెలలకే నేను పని చేయడం మొదలెట్టాను. ది స్వోర్డ్ ఆఫ్ టిపూ సుల్తాన్ సీరియల్లో చిన్న పాత్ర దొరికింది. అది చేస్తున్నప్పుడే సెట్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సంజయ్ ఖాన్ సకాలంలో స్పందించి మంటలార్పే ప్రయత్నంలో తనూ సగం కాలిపోయాడు. సెట్ బయట మసాబా ఉందప్పుడు. తనకు ఆరోగ్యం బాగలేదు. ఎలా ఉందో చూద్దామని నేను బయటకు వెళ్లినప్పుడే ప్రమాదం జరగడంతో బతికిపోయాను. ఆ ప్రమాదంలో 55 మంది చనిపోయారు’ అని రాసిందామె. సుభాష్ ఘాయ్ ‘చోలీ’ ‘ఖల్ నాయక్ సినిమాలో చోలీ కే పీఛే క్యాహై పాటలో నేను, మాధురి నటించాలి. నాకు రాజస్థాని డ్రస్ వేసి తీసుకువెళ్లి చూపించారు. ఆయనను నన్ను చూసి హతాశుడై ‘నో.. నో.. ఏదైనా కొంచెం నింపి తీసుకురండి’ అన్నాడు. ఇది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అతడు నా వక్షం నిండుగా ఉండాలని సూచించాడు. ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదు. దర్శకుడిగా తనకు ఏది కావాలో ఆ ఊహకు తగినట్టుగా నేను ఉండాలనుకున్నాడు. ఆ రోజు షూటింగ్ జరగలేదు. మరుసటి రోజు ప్యాడెడ్ బ్రా వేసి నా కాస్ట్యూమ్స్ సిద్ధం చేశారు. అప్పుడు అతను సంతృప్తి చెందాడు. మంచి దర్శకుడు రాజీపడడు. సుభాష్ ఘాయ్ అందుకే మంచి దర్శకుడు’ అని రాసిందామె. ఇలాంటివే అనేక విశేషాలు ఆమె ఆత్మకథలో ఉన్నాయి. ∙ -
నెటిజన్లను మెప్పిస్తున్న పెంగ్విన్లు: వైరల్ వీడియో
మిస్సౌరీ: పెంగ్విన్లు ప్రధానాంశంగా పుస్తకాలు, సినిమాలు, డాక్యుమెంటరీలు చాలానే వచ్చాయి. కార్టూన్లు, టెలివిజన్ డ్రామాలు వినోదాన్ని పంచాయి. వీటి నడక, నాట్యం తమాషాగా ఉండటం వలన పెంగ్విన్లను అనేక కార్టూన్ పాత్రలుగా సృష్టించారు. కాగా యూఎస్‌లో మిస్సౌరీలోని సెయింట్ లూయిస్ జూ పార్క్‌లో తీసిన ఓ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. రెడిట్‌లో పోస్ట్ చేసిన 44 సెకన్ల నివిడి గల ఈ వీడియోను 5 గంటల్లో 37000 వేల మంది వీక్షించారు. పెంగ్విన్లు బరువు చూసుకోవడానికి ఆత్రుతగా ఎదుచూస్తున్న ఈ వీడియో వేల కామెంట్స్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘ నేను పెంగ్విన్ కావాలనుకుంటున్నాను.’’ అంటూ ఓ నెటిజన్ చమత్కరిస్తే".. ‘‘ఇది నిజంగా ఓ మేధావి ఆలోచనలా ఉంది. వీటిని చూస్తే నిటారుగా ఉన్న కొండను చూసినట్టుంది.’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెంగ్విన్లు తమ జీవిత కాలంలో సగం నేలమీద, సగం నీటిమీద నివసిస్తాయి. ఆడ పెంగ్విన్ల కన్నా మగ పెంగ్విన్లు ఆకారంలో కొద్దిగా పెద్దగా..పెద్ద ముక్కుతో ఉంటాయి. (చదవండి: చనిపోయే ముందు వీడియో.. యూట్యూబర్ ఆఖరి మాటలు) -
రేపే ప్రేక్షకుల ముందుకు ‘పెంగ్విన్’
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు వెండి తెర వేల్పు సావిత్రి జీవితంపై తీసిన బయోపిక్ ‘మహానటి’లో సావిత్రిగా నటించి తెలుగుతోపాటు తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకర్శించిన 27 ఏళ్ల కీర్తి సురేశ్ ‘పెంగ్విన్’ చలన చిత్రంతో జూన్ 19వ తేదీన ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘మహానటి’ తెలుగు చిత్రం తర్వాత ఫాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం చెన్నై వెళ్లిన ఆమె ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా కేరళలోని తన ఇంటికే అంకితం అయ్యారు. కీర్తి సురేశ్ చెన్నైలో ఉండగానే ‘పెంగ్విన్’ అనే తమిళ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. తమిళనాడు సంచలన చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందిన కార్తీక్ సుబ్బరాజ్ తీసిన ‘పెంగ్విన్’ చిత్రానికి ఈశ్వర్ దర్శకత్వం వహించారు. తనను నుంచి తప్పిపోయిన కొడుకు కోసం నాలుగు రోజులపాటు అవిశ్రాంతంగా వెతికే త్రిల్లర్ సినిమాలో నటించినందుకు తనకు త్రిల్లింగా ఉందని కీర్తి సురేశ్ మీడియాకు తెలిపారు. ఓ తల్లికి, కొడుకుకు మధ్యనున్న అనుబంధాన్ని అచ్చు గుద్దినంటూ చూపించే కథనానికి తాను స్పందించి ఈ చిత్రానికి అంగీకరించానని ఆమె చెప్పారు. మొత్తం కొడైకెనాల్లో నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ కేవలం 40 రోజుల్లో పూర్తయిందని ఆమె తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగప్రవేశం చేసిన కీర్తి సురేశ్ 2013లో గీతాంజలి లీడ్ రోల్ ద్వారా తెలుగు, తమిళ చిత్రాలకు పరిచయం అయ్యారు. లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడడంతో నెట్‌ఫ్లిక్స్. అమెజాన్ లాంటి ఆన్లైన్ మూవీ సైట్లకు ప్రేక్షకులు భారీగా పెరిగారు.