People gather
-
ఇదేమీ రాజకీయ సభకాదు.. సాయం చేసేందుకు వచ్చిన ప్రభం‘జనం’
స్పెయిన్‌లో ఇటీవలి భారీ వర్షాలు, వరదల్లో 210 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, చాలా మంది జాడ తెలియకుండా పోయారు. ఒక్క వలెన్సియాలోనే 155 మంది చనిపోయారు. సునామీ స్థాయిలో సంభవించిన తుపాను కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించడం తెలిసిందే. ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక పనులకు చేపట్టింది. వేలాదిగా ఆర్మీని రంగంలోకి దించింది. వరదలతో దెబ్బతిన్న వలెన్సియా నగర వీధుల్లో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న ప్రజలు..సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటామంటూ స్వచ్ఛందంగా తరలివచ్చిన వారితో శుక్రవారం వలెన్సియాలోని సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కల్చరల్ కాంప్లెక్స్ ఆవరణ కిక్కిరిసిపోయిందిలా..! స్పెయిన్‌ను వణికించిన వరదలుభారీ వర్షంతో ఆకస్మికంగా సంభవించిన వరదలతో స్పెయిన్ అతలాకుతలమైంది. తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో భారీ వర్షాలు పడటంతో వరదలు వచ్చాయి. తద్వారా భారీ సంఖ్యలో కుటుంబాలు వీధిన పడ్డాయి. వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి.ఆకస్మిక భారీ వరదలకు మృత్యువాత పడ్డ వారి సంఖ్య 210కి చేరింది. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీయగా, శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు.. గల్లంతు అయిన వారి కోసం బంధువులు పడే ఆందోళనలతో ఎక్కడ చూసినా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. -
రామేశ్వరం చేరిన కలాం పార్థివదేహం
రామేశ్వరం: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థీవ దేహాన్ని ఆయన సొంతూరు తమిళనాడులోని రామేశ్వరానికి తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం హెలికాప్టర్లో కలాం భౌతికకాయాన్ని తరలించారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కలాం పార్థివదేహాన్ని మధురైకి తరలించి.. అక్కడి నుంచి హెలికాప్టర్లో తీసుకెళ్లారు. కలాం భౌతికకాయం వెంట కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, వెంకయ్యనాయుడు వచ్చారు. ఇదే గడ్డపై ఓ పేద కుటుంబంలో జన్మించి.. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగి.. అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి.. దేశానికి ఎనలేని సేవలు అందించిన భారతరత్న కలాం .. చివరి సారిగా సొంతూరు రామేశ్వరానికి నిర్జీవంగా చేరుకున్నారు. కలాం పార్థివదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు, ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. కలాం భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించేందుకు జనం బారులు తీరారు. కలాం చివరి దర్శనం కోసం బంధువులు అందరూ వచ్చారని, ఆత్మీయులు పెద్దసంఖ్యలో వచ్చారని ఆయన మనవడు ఏపీజే ఎంకే షేక్ సలీం చెప్పారు. రాత్రి 8 గంటలకు వరకు ప్రజల సందర్శనార్థం కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం బస్టాండ్ సెంటర్ వద్ద ఉంచి, ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్తామని తెలిపారు. రేపు ఉదయం కలాంకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు కలాం అంత్యక్రియల్లో పాల్గొంటారు. -
కలాం చివరి చూపు కోసం..
చెన్నై: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టినగడ్డ రామేశ్వరం ఆయన పార్థివదేహం దర్శనం కోసం ఎదురు చూస్తోంది. తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్ కలాం ఇంటి దగ్గర జనం బారులు తీరారు. కలాం కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు చివరి చూపు కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం తీసుకురానున్నారు. కలాం ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. కలాం చివరి దర్శనం కోసం బంధువులు అందరూ వచ్చారని, ఆత్మీయులు పెద్దసంఖ్యలో వచ్చారని ఆయన మనవడు ఏపీజే ఎంకే షేక్ సలీం చెప్పారు. రాత్రి 8 గంటలకు వరకు ప్రజల సందర్శనార్థం కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం బస్టాండ్ సెంటర్ వద్ద ఉంచి, ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్తామని తెలిపారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం నుంచి ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో రామేశ్వరం సమీపంలోని మధురైకు ఆయన భౌతికకాయాన్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో రామేశ్వరం తరలిస్తారు. రామేశ్వరంలో ఓ పేద కుటుంబంలో జన్మించి.. దేశం గర్వపడే శాస్త్రవేత్తగా ఎదిగి.. అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి.. దేశానికి ఎనలేని సేవలు అందించిన కలాంకు నివాళులు అర్పించేందుకు బాధాతప్త హృదయాలతో నిరీక్షిస్తున్నారు. షిల్లాంగ్‌లో ఐఐఎంలో ప్రసంగిస్తూ కలాం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.