Permanent job
-
నా జాగా తీసుకున్నరు.. ఆ సంగతేమైంది సారూ?
సాక్షి, ఖమ్మం: తనకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో జాప్యం ప్రదర్శిస్తున్న అధికారుల తీరుపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో అసహనం ప్రదర్శించాడు. అది అలాఇలా కాదు.. ఏకంగా ఆ ఊరి సబ్స్టేషన్కే తాళం వేసి!. పైగా భార్యాపిల్లలతో పాటు ఆ సబ్‌స్టేషన్ ముందు నిరసన చేపట్టాడు. ఖమ్మంలోని రఘునాథపాలెం మండల పరిధిలోని బావోజి తండాలో ఇది చోటు చేసుకుంది. బావోజి తండాకు చెందిన తేజవత్ మహేందర్ గతంలో తమ ఊరి సబ్‌స్టేషన్ నిర్మాణం కోసమని తన భూమిని ఇచ్చాడు. అయితే.. తమ కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ జాబ్ ఇస్తామనే హామీ మేరకు అతని ఆ భూమిని అప్పగించాడట. ఈ క్రమంలో అధికారులు ఆ హామీ నెరవేర్చకపోవడంతో అలా తాళం వేశాడట. అంతేకాదు.. తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి ఆ గేటు ముందు నిల్చుని నిరసన చేపట్టాడు. ఊరి కోసం తన భూమిని ఇచ్చానని, కానీ, ఇప్పుడు కుటుంబ పోషణ భారం కావడంతోనే తాను ఈ పనికి దిగాల్సి వచ్చిందని అంటున్నాడతను. అయితే.. అధికారులు మాత్రం మరోలా స్పందించారు. మహేందర్‌కు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చామని చెబుతున్నారు. అంతేకాదు.. గతంలోనూ మహేందర్ ఓసారి ఇలాగే గేటుకు తాళం వేశాడని, అప్పుడు మాట్లాడి తాము అతన్ని శాంతిపజేశామని అంటున్నారు. -
మా ఉద్యోగాలు పర్మినెంట్ చేయండి
న్యూఢిల్లీ: తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర తాత్కాలిక ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం న్యూఢిల్లీలోని ఐపీ ఎక్స్టెన్షన్ వద్ద వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ డీటీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంవత్సరాలు తరబడి పనిచేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, డీటీసీ దివాలాస్థితిని వెల్లడిçంచిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదికతో కేజ్రీవాల్ సర్కారు విమర్శలపాలైంది. గడిచిన ఐదేళ్లలో డీటీసీ ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పరిశోధన నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో డీటీసీ ప్రయాణికులు 35 శాతం తగ్గారని ఈ పరిస్థితి కొనసాగితే 2025 నాటికి డీటీసీ ఖాళీ అవుతుందని నివేదిక హెచ్చరించింది. ఢిల్లీలో ప్రస్తుతం 11 వేల బస్సుల అవసరం ఉండగా దాదాపు ఐదు వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయని 2020 సంవత్సరం వరకు ఢిల్లీలో 15 వేల బస్సుల అవసరం ఉంటుందని నివేదిక తెలిపింది. ఈ నివేదిక వెలువడిన తరువాత ప్రతిపక్షాలు ఆప్ సర్కారుపై విమర్శలు తీవ్రం చేశాయి. కేజ్రీవాల్ సర్కారు తన మూడు సంవత్సరాల పదవీకాలంలో ఢిల్లీ వాసులకు డీటీసీ ద్వారా విశ్వసనీయమైన పటిష్టమైన ప్రజా రవాణ వ్యవస్థను అందించడంలో విఫలమైందని, 2011–12 తరువాత బస్సులు కొనలేదని ప్రతిపక్షనేత విజేంద్ర గుప్తా ఆరోపించారు. -
హేమలతా.. నన్ను క్షమించు
- పిల్లలు,అమ్మ నాన్నా జాగ్రత్త - ఉద్యోగం పర్మినెంట్ కాలేదని వేదన - సూసైడ్ రాసి గ్రామీణ బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి ఆత్మహత్య - అనంతగిరిపల్లి శివారులో ఘటన - మృతుడు ప్రజ్ఞాపూర్ వాసి వర్గల్ :‘ఇరవై ఏళ్లుగా బ్యాంకులో పనిచేస్తున్నా ఉద్యోగం పర్మినెంట్ కాలేదు. చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు... ఎవరైనా ప్రభుత్వ సంస్థల్లో టెంపరరీగా పని చే యొద్దు... హేమలతా.. నన్ను క్షమించు. తేజస్విని, వంశీని, అమ్మ, నాన్నలను మంచిగా చూసుకో’.. అని సూసైడ్ నోట్ రాసి గ్రామీణ వికాస్ బ్యాంక్ తాత్కాలిక ఉద్యోగి పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం మండలంలోని అనంతగిరిపల్లి శివారు రాఘవేంద్ర కాలనీ వద్ద వెలుగు చూసింది. గౌరారం ఎస్ఐ మధుసూదన్‌రెడి కథనం ప్రకారం... గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన పెర్క ఉప్పలయ్య(38)కు భార్య హేమలత, వంశీ(10), తేజస్వీ(4) అనే ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ప్రజ్ఞాపూర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన పని చేశాడు. ఏడాది నుంచి జగదేవ్‌పూర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనే ఆశతో ఇబ్బందులను భరి స్తూ నెట్టుకొస్తున్నాడు. వేతనం సరిపోక కుటుంబ పోషణ భారం కావడ ంతో ఆర్థి క సమస్యలు ఎదురయ్యాయి. అప్పులు పెరిగాయి. ఒకవైపు ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం పర్మినెంట్ కాలేదని బాధ, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు అతణ్ణి మనోవేదనకు గురిచేశాయి. మంగళవారం ఉదయం డ్యూటీ నిమిత్తం జగదేవ్‌పూర్‌లోని గ్రామీణ వికాస్ బ్యాంకుకు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు బ్యాంకు వారిని వాకబు చేస్తే రాలేదని తెలియడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బంధువులు, తెలిసిన వారిని ఆరా తీసినా ఫలితం దక్కలేదు. వర్గల్ మండలం అనంతగిరిపల్లి శివారులో ఉప్పలయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడినట్లు గౌరారం పోలీసులు బుధవారం ఉదయం గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు వివరిస్తూ రాసిన సూసైడ్ నోట్ మృతుని జేబులో లభించింది. వెంటనే ప్రజ్ఞాపూర్‌లోని కుటుంబీకులకు సమాచారమిచ్చారు. డ్యూటీకి వెళ్లిన ఉప్పలయ్య శవంగా మారాడనే పిడుగులాంటి వార్త తెలియడంతో భార్య హేమలత, తల్లిదండ్రులు, పిల్లలు హతాశులయ్యారు. పెద్దదిక్కు కోల్పోయి అల్లాడిపోయారు. గజ్వేల్ ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహంపై పడి బోరుమని విలపించారు. డాడీ అంటూ విలపిస్తున్న కొడుకును ఆపడం అక్కడున్న వారి తరం కాలేదు. ఓవైపు కుటుంబీకులు, మరోవైపు బంధువులు, మిత్రుల రోదనలతో ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం అలుముకున్నది. భార్య హేమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్టు గౌరారం ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.