గ్రామాన్ని దత్తత తీసుకున్న చిరంజీవి
మొగల్తూరు : మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ కె.చిరంజీవి ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాంసద్ గ్రామ యోజనలో భాగంగా సముద్ర తీర గ్రామమైన పేరుపాలెంను అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. తాను పుట్టిన మొగల్తూరుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉండగా పేరుపాలెంలో పర్యాటక అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని గుర్తించినా పనులు మొదలుకాలేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యునిగా ఎంపీ కోటా నిధులను పేరుపాలెం సౌత్ గ్రామాభివృద్ధికి వెచ్చించేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారు.
పేరుపాలెం సౌత్ గ్రామంలో 12 వేల జనాభా ఉంది. వీరిలో 7,490 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,684 మంది కాగా, మహిళలు 3,806 మంది ఉన్నారు. ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరులు కొబ్బరి, సరుగుడు, మామిడి, తోటలు. మత్స్యకారులు సముద్రంలో చేపలను వేటాడతారు. ఈ గ్రామానికి జాతీయ తుపాను నిధులతో మాజీ ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, ముదునూరి ప్రసాదరాజు రహదారులను అభివృద్ధి చేశారు. రవాణా సౌకర్యం అభివృద్ధి చెందినా పర్యాటకంగా అభివృద్ధి సాధిస్తేనే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
అఖిలపక్షం హర్షం
చిరంజీవి పేరుపాలెం సౌత్ గ్రామాన్ని దత్తత తీసుకోవడంపై గ్రామాభివృద్ధి అఖిలపక్ష కమిటీ హర్షం వ్యక్తం చేసింది. మంగళవారం పేరుపాలెం సౌత్ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ మొగల్తూరులో పుట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన మెగాస్టార్ చిరంజీవి తీరప్రాంత గ్రామమైన పేరుపాలేన్ని దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. తమ పార్టీ తరఫున చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు.
అఖిలపక్ష కమిటీ నాయకులు మాట్లాడుతూ తమ ప్రాంతంలో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటి పరిష్కారానికి నిధులు వెచ్చించాలని కోరారు. గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. గ్రామస్తులంతా అఖి లపక్ష కమిటీగా ఏర్పడి సమస్యలను ప్రాధాన్యత ప్రకారం చర్చించి నిర్ణయం తీసుకోవాలని గ్రామ పెద్దలు సూచిం చారు. నరసాపురం మునిసిపల్ కౌన్సిలర్ కొత్తపల్లి నాని, వన్నెంరెడ్డి శ్రీనివాస్, కటికల సూర్యారావు, కవురు ముత్యాలరావు, కర్రి ఏసుబాబు, పట్టా రజనికుమారి, పాలా రాంబాబు, సత్తినేని త్రినా థ్, మేళం శ్రీని వాస్, చల్లా బుజ్జినాయు డు, బళ్ల సూరి బాబు, తిరుమాని సత్యనారాయణ, గుత్తుల తాతారావు, కొప్పినేని సత్యనారాయణ గురుస్వామి పాల్గొన్నారు.
ఆనందంగా ఉంది
నేను సర్పంచ్‌గా ఉన్న సమయంలో చిరంజీవి మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఆనందంగా ఉంది. గ్రామంలో అభివృద్ధి చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. వాటిని పూర్తి par చేస్తాం.ఙ- మేళం రంగనాథ్, గ్రామ సర్పంచ్
వియర్ చానల్ పనులు పూర్తి చేయాలి
ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న వియర్ చానల్ పనులు పూర్తిచేయాలి. ఈ చానల్ పూర్తయితే సాగు, తాగు నీటికి ఇబ్బందులు తొలగిపోతాయి. దీంతోపాటు మా గ్రామంలో మంచినీటి ప్రాజెక్టు ఏర్పాటు par చేయాలి.ఙ- ఓసూరి విజ్జిబాబు, వైఎస్సార్ సీపీ నాయకుడు
టూరిజం అభివృద్ధి చేయాలి
తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. గ్రామంలో నిరుద్యోగులు అనేకమంది ఉన్నారు. వారందరికీ ఉపాధి అవకాశాలు par మెరుగుపడతాయి.ఙ- చల్లా దుర్గారావు, విశ్రాంత ఉపాధ్యాయుడు, టీడీపీ నాయకుడు
మత్స్యకారులకు సదుపాయాలు కల్పించాలి
సముద్ర వేటకు వెళ్లే మత్స్యకారులకు సదుపాయాలు కల్పిం చాలి. మండలంలో ఎక్కువమంది సముద్ర వేటకు వెళ్లే గ్రామం ఇదే. గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోనే ప్రముఖ ప్రాంతంగా గుర్తింపు par పొందుతుంది.ఙ- ఆండ్రాజు రామన్న, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు