పేరుపాలెంలో చిరంజీవి పర్యటన
మొగల్తూరు: రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెంలో సోమవారం పర్యటించారు. రెండు కమ్యునిటీ హాళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చిరంజీవి ప్రసంగించారు. అంతకుముందు మొగల్తూరులో రూ. 50 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో భాగంగా చిరంజీవి పేరుపాలెం సౌత్ గ్రామాన్ని దత్తత తీసుకుని ఇటీవల రూ. 5 కోట్లు మంజూరు చేశారు. గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి.