పేట్ బషీర్‌బాద్‌లో చైన్‌స్నాచింగ్
హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్స్ మరోసారి రెచ్చిపోయారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటన పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది.
స్థానిక కాలనీకి చెందిన ఎన్. మణి(55) నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె మెడలోని ఆరు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.