Petition in the High Court
-
జీఎస్టీ షోకాజ్ నోటీసులపై బొంబాయి హైకోర్టుకు డ్రీమ్ 11
న్యూఢిల్లీ: ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 తన ప్లాట్‌ఫారమ్‌పై పెట్టిన పందాలపై రెట్రాస్పెక్టివ్ (గత లావాదేవీలకు వర్తించే విధంగా)గా 28 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధించడాన్ని సవాలు చేసింది. ఈ మేరకు జారీ అయిన షోకాజ్ నోటీసులపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 216.94 కోట్లు, 2018–19కిగాను రూ. 1,005.77 కోట్ల పన్ను డిమాండ్ ఉందని పిటిషన్లో డ్రీమ్11 పేర్కొంది. ‘‘అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం.. ఇలాంటి షోకాజ్ నోటీసు జారీ తగదు. పిటిషనర్ (డీ11) అందించిన ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్రధానంగా నైపుణ్యానికి సంబంధించినది. జూదం లేదా బెట్టింగ్‌కు సంబంధించినది కాదు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా పన్ను డిమాండ్ నోటీసు రూ.40 వేల కోట్లని, రూ. 25 వేల కోట్లని మీడియాలో భిన్న కథనాలు రావడం గమనార్హం. గేమింగ్ రంగంపై రెవెన్యూశాఖ దృష్టి! పన్ను వసూళ్లకు సంబంధించి రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుతం గేమింగ్ రంగంపై దృష్టి సారించినట్లు కనబడుతోంది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలపై నైపుణ్యం లేదా సంబంధిత అంశాలతో సంబంధం లేకుండా 28 శాతం పన్ను విధించడం జరుగుతుందని జీఎస్టీ మండలి ఇటీవల ఇచ్చిన వివరణ ఈ పరిణామానికి నేపథ్యం. రూ. 16,000 కోట్లకు పైగా జీఎస్టీ చెల్లింపుల్లో లోటుపై కాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు జీఎస్టీ అధికారులు గత వారం నోటీసులు జారీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 21,000 కోట్ల జీఎస్టీ రికవరీ కోసం ఆన్లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్క్రాఫ్ట్కు ఇదే విధమైన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై ఆ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. దీనిని రెవెన్యూశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అక్టోబర్ 10వ తేదీన ఈ కేసు విచారణకు లిస్టయ్యింది. -
ఉపాధ్యాయ నోటిఫికేషన్లు రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 8,700లకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన పలు నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. ఉపాధ్యాయ నియామకాల రూల్స్, నోటిఫికేష న్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించారని, వాటిని రద్దు చేయాలని కోరుతూ రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జనగాం జిల్లాలకు చెందిన కె.బాలకృష్ణ ముదిరాజ్, కె.భాను, ఆర్.రామ్మో హన్‌రెడ్డిలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రూల్స్‌కు సంబంధించిన జీవో 25పై స్టే విధించి, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పది జిల్లాలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో జిల్లాను ఓ యూనిట్‌గా నియామకాలు చేపట్టేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్లు కోరారు. ఈ వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొ న్నారు. అధికరణ 371డీ, రాష్ట్రపతి ఉత్తర్వు లకు విరుద్ధంగా ఉపాధ్యాయ నియామక రూల్స్‌ను ప్రభుత్వం జారీ చేసిందని పిటిషనర్లు తెలిపారు. 31 జిల్లాలను యూని ట్‌గా తీసుకోనున్నట్లు రూల్స్‌లో పేర్కొన్నా రని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వివరించారు. 31 జిల్లాల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం లేదని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 10 జిల్లా లకే గుర్తింపు ఉందని అన్నారు. ఈ ఉత్తర్వు లకు విరుద్ధంగా రూల్స్‌ను తయారు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. జిల్లాల పునర్విభజన వల్ల పలువురు అభ్యర్థులు ఆయా జిల్లాలకు నాన్ లోకల్ అవుతారని తెలిపారు. కొత్త జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తుండటంతో కొన్ని జిల్లాలకు అసలు పోస్టుల భర్తీయే ఉండటం లేదన్నారు. రంగారెడ్డి, నిర్మల్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ తదితర జిల్లాల్లో పోస్టుల భర్తీయే లేదని తెలిపారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వారు కోర్టును కోరారు. -
లంచం ఇస్తేనే..
♦ కాంట్రాక్టు పనులకు రూ.12 కోట్ల ముడుపులు ♦ మంత్రిపై కోర్టులో పిటిషన్ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ దెబ్బతినిందని సూపర్‌స్టార్ రజనీకాంత్.. అన్ని శాఖల్లో అవినీతి పేరుకుపోయిందని ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్ చేసిన ఆరోపణలు నిత్యసత్యాలని భావించే సంఘటన కోర్టు పిటిషన్‌తో వెలుగు చూసింది. ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బగళన్ రూ.12 కోట్లు లంచం అడిగినట్లు కృష్ణగిరి జిల్లాకు చెందిన వెంకన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. సాక్షి ప్రతినిధి, చెన్నై : భవన నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చేందుకు ఓ మంత్రి లంచం కోరారనే ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. తమిళనాడు ప్రజాపనుల శాఖలో ఫస్ట్‌క్లాస్ కాంట్రాక్టరుగా ఉన్న వెంకన్‌కు అనేక పనులను చేపట్టిన అనుభవం ఉంది. తేనీ, మదురై, వేలూరు, విళుపురం, కృష్ణగిరి, పుదుక్కోట్టై, అరియలూరు, తిరుచ్చిరాపల్లి జిల్లాల్లో కొత్తగా పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణానికి టెండర్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రజాపనులశాఖ ఇంజినీరింగ్ విభాగం ద్వారా మే నెలలో వెలువడిన ఈ టెండర్‌కు వెంకన్ జూన్ 9వ తేదీన నామినేషన్ వేశాడు. ఈ టెండర్లలో వెంకన్ వేసిన నామినేషన్ ఆమోదం పొందింది. అయితే టెండర్ మూలంగా పనులను అప్పగించే ముందు ఉన్నత విద్యాశాఖా మంత్రి అన్బగళన్ను సంప్రదించాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులు అతడిని సూచించారు. సదరు పనులను ఈరోడ్‌కు చెందిన నందిని కన్స్ట్రక్షన్కు అప్పగించినందున టెండర్ డాక్యుమెంట్లను వాపసు తీసుకోవాల్సిందిగా వెంకన్‌కు మంత్రి సూచించారు. ఈ పనులు కావాలంటే మొత్తం సొమ్ములో 20 శాతం లంచంగా ఇవ్వాలని మంత్రి బేరం పెట్టారు. లంచం ఇవ్వని పక్షంలో టెండర్‌ను రద్దుచేస్తామని మంత్రి బెదిరించారు. లంచం ఇచ్చేందుకు మనస్కరించని వెంకన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ న్యాయమూర్తి దురైస్వామి ముందుకు గురువారం విచారణకు వచ్చింది. రూ.79 కోట్ల కాంట్రాక్టు పనులకు 16 శాతం చొప్పున రూ.12 కోట్లు మంత్రి లంచం కోరారని, తాను నిరాకరించడంతో టెండరును రద్దు చేసేందుకు మంత్రి, అధికారులు సిద్ధం అవుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ పిటిషన్‌పై రెండు వారాల్లోగా బదులివ్వాలని మంత్రి అన్బగళన్, ప్రజాపనులశాఖ చీఫ్ ఇంజనీర్లకు న్యాయమూర్తి దురైస్వామి నోటీసులు జారీచేశారు. అవినీతి ప్రభుత్వమంటూ విమర్శలు చేసిన కమల్‌హాసన్‌పై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించిన మంత్రులు ఈ పిటిషన్‌పై ఏమంటారో వేచి చూడాలి. -
కొత్తపల్లి గీతకు కుల వివాదంపై నోటీసు
హైకోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి విజయనగరం: అరకు ఎంపీ కొత్తపల్లి గీత కుల వివాద ఉచ్చులో చిక్కుకున్నారు. ఆమె ఎస్టీ కాదని మొన్నటి సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసిన టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో వేసిన పిటిషన్ అడ్మిట్ అయింది. ఈనెల 31న హాజరు కావాలని గీతకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఇప్పుడీ పరిణామం టీడీపీని డైలామాలో పడేసింది. అరకు ఎంపీగా ఎన్నికైన తర్వాత కొత్తపల్లి గీత ఎస్టీ కాదని టీడీపీ గట్టిగా వాదించింది. ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించింది. ఆమె ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి చేత హైకోర్టులో పిటిషన్ కూడా వేయించింది. అందుకు తగ్గ పూర్తి సహాయ సహకారాలను టీడీపీ నాయకత్వం అందజేసింది. ఇదంతా పసిగట్టో, కుల వివాదం నుంచి బయటపడాలనో ఎన్నికైన కొన్ని నెలల్లోనే కొత్తపల్లి గీత స్వరం మార్చారు. టిక్కెట్ ఇచ్చిన పార్టీకి వ్యతిరేకంగామాట్లాడటం ప్రారంభించారు. టీడీపీ నేతలతో అంటకాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో టీడీపీ డిఫెన్స్‌లో పడింది. తమ పార్టీ నాయకులతో కలిసి తిరుగుతున్న ఎంపీ గీతపై ఎలా స్పందించాలో తెలియకో, అధిష్టానం డెరైక్షనో తెలియదు గాని పార్టీ సహాయ సహకారాలతో పిటిషన్ వేసిన గుమ్మడి సంధ్యారాణి ఇప్పుడు కనీసం స్పందించలేదు.