వారి పిటిషన్లను ఎందుకు ఉపేక్షించారు?
రాజీవ్ హత్య దోషులపై తమిళనాడు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దోషుల క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవటంలో యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు అసాధారణ జాప్యం చేశాయని తమిళనాడు ప్రభుత్వం విమర్శించింది. కాంగ్రెస్ నేతృత్వంలోనిప్రభుత్వాలు రాజీవ్ హంతకులను పదేళ్లపాటు ఎందుకు ఉరితీయలేదో తెలియజేయాలని మంగళవారం సుప్రీం కోర్టులో కోరింది.
దోషుల ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చి వారిని విడుదల చేయాలన్న తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం సవాలు చేయటంపై కోర్టు ముందు వాదనలు వినిపించింది. రాజకీయ ప్రయోజనాలకోసం ఇదంతా చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేశారని, రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా వారిని ఉరి తీయాలని కోరనప్పుడు.. వారి విడుదలలో ఏ ఒక్కరికీ అభ్యతరం లేనప్పుడు ప్రభుత్వంపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించింది.