Petroleum minister
-
ముడి చమురుకు కొరత లేదు
చండీగఢ్: అంతర్జాతీయంగా ముడి చమురుకు ఎలాంటి కొరత లేదని.. దేశీయ అవసరాలను తీర్చేందుకు వీలుగా తగినంత రిఫైనరీ సామర్థ్యం ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ అవి కుదుటపడతాయన్న స్వీయ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.చండీగఢ్‌లో రోజ్‌గార్ మేళా సందర్భంగా మీడియా ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఈ పరిణామాలకు ముందు ప్రపంచవ్యాప్తంగా 105 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రోజువారీగా ఉత్పత్తయ్యేది. ఓపెక్ కూటమి రోజువారీగా 5 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోత నిర్ణయం తీసుకున్నది. అనంతరం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఫలితంగా చమురు రవాణాకు భిన్న మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఇన్సూరెన్స్ వ్యయాలు పెరిగిపోయాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూసినా మన దగ్గరే పెట్రోల్, డీజిల్ ధరలు అతి తక్కువగా ఉన్నాయి.2021 నవంబర్‌లో, 2022 మే నెలలో రెండు విడతలుగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. నేడు చమురుకు కొరత లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ బ్యారెల్ చమురు ధర 72–73 బ్యారెళ్ల వద్దే ఉంది’’అని మంత్రి వివరించారు.దేశీయంగా 270 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనరీ సామర్థ్యం ఉండగా, దీన్ని 310 మిలియన్ మెట్రిక్ టన్నులకు విస్తరిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా 4 లక్షల బ్యారెళ్ల చమురు బ్రెజిల్ నుంచి మార్కెట్లోకి వస్తోందని, యూఎస్ సైతం మరింత పరిమాణాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి పురి చెప్పారు. -
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! హింట్ ఇచ్చిన కేంద్ర మంత్రి
Petrol and Diesel price : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ఊహాగానాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. దేశంలో 2022 మే 22 నుంచి స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశం ఉంది. నాలుగో త్రైమాసికంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లోకి వస్తే దేశంలో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సూచనప్రాయంగా తెలిపారు. యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ఇండియా (యూఎన్జీసీఎన్ఐ) 18వ జాతీయ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిమాట్లాడుతూ.. చమురు మార్కెటింగ్ కంపెనీలు గత నష్టాల నుంచి కోలుకున్నాయని, రాబోయే త్రైమాసికంలో లాభాలను చూడవచ్చని పేర్కొన్నారు. "మీరు వారిని (చమురు కంపెనీలను) అడిగితే, వారు తమ లాభం తగ్గిందని చెబుతారు.. కానీ వారు కోలుకున్నారు. నాలుతో త్రైమాసికం బాగుంటే ధరలను తగ్గించవచ్చని ఆశిస్తున్నాను” అని పూరి అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు గత మూడు త్రైమాసికాల్లో నిలకడగా లాభాలను నమోదు చేశాయి. 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనే ఈ కంపెనీలు ఏకంగా రూ.11,773.83 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి. గత మూడు త్రైమాసికాల్లో వారి ఉమ్మడి లాభాలు రూ.69,000 కోట్లను అధిగమించాయి. -
గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిలో భాగం కండి
న్యూఢిల్లీ: ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో భాగం కావాలని గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ పిలుపునిచి్చంది. జీవఇంధనాల అభివృద్ధికి సంబంధించిన నైపుణ్యాలను వర్ధమాన దేశాలు, అంతగా అభివృద్ధి చెందని దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సులో పాల్గొన్న కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ మేరకు పిలుపునిచ్చారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ని కలిపి వినియోగంలోకి తేవాలన్న లక్ష్యాన్ని అయిదు నెలల ముందుగా 2022 మేలో భారత్ సాధించిందని, దీన్ని 20 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యాన్ని అయిదేళ్లు ముందుకు జరిపి 2025కి మార్చుకుందని ఆయన చెప్పారు. బయోమాస్‌ను ఇంధనంగా మార్చడం ద్వారా ఇటు రైతులకు అదనపు ఆదాయ వనరును అందుబాటులోకి తేవడంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపునకు కూడా భారత్ కృషి చేస్తోందని పురి వివరించారు. ఇందుకు సంబంధించి టెక్నాలజీ బదలాయింపు, సంయుక్త పరిశోధన .. అభివృద్ధి కార్యకలాపాలు, మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో ఇతర గ్లోబల్ సౌత్ దేశాలతో కలిసి పని చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. బయోమాస్ నుంచి తయారు చేసే జీవ ఇంధనాలను ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయెన్స్ ఏర్పడింది. ఇందులో అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు భాగంగా ఉన్నాయి. కొన్ని దేశాలు మినహా ఉత్తరార్ధగోళంలో ఉన్న మెజారిటీ దేశాలను గ్లోబల్ నార్త్గాను, దక్షిణార్ధగోళంలో ఉన్న దేశాలను గ్లోబల్ సౌత్గాను వ్యవహరిస్తున్నారు. -
2025 నాటికే 20 శాతం ఇథనాల్
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని 2025 నాటికే సాధిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌పురి తెలిపారు. ముందుగా నిర్దేశించుకున్న 2030తో పోలిస్తే ఐదేళ్లు ముందుగానే చేరుకుంటామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయాలను ఈ ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా ఆరంభించడం గమనార్హం. కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, పెట్రోల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవాలన్న రెండు లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం 10 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. వచ్చే ఏడాదికే 20 శాతం పెట్రోల్‌ను సరఫరా చేయగలమన్న నమ్మకంతో ఉన్నట్టు పురి చెప్పారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమంతో రూ.41,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఒక ఏడాదిలో ఆదా అవుతుండగా, దేశీయ రైతులకు, పరిశ్రమలకు ఈ మేరకు ప్రయోజనం లభించనుంది. చెరకు, విరిగిన, తినడానికి అనుకూలం కాని బియ్యంతో ఇథనాల్‌ను ప్రస్తుతం మన దేశంలో తయారు చేస్తున్నారు. 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల ద్విచక్ర వాహనాల నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలను 50 శాతం, నాలుగు చక్రాల వాహనాల నుంచి 30 శాతం మేర తగ్గించొచ్చని అంచనా. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. 2021–22లో ముడి చమురు దిగుమతుల కోసం మన దేశం 120.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. -
రెండు రోజుల్లో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని నిర్ణీత గడువు కంటే ముందే కేంద్ర సర్కారు అమల్లో పెట్టనుంది. రెండు రోజుల్లోనే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20 పెట్రోల్) విక్రయాలను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇండియా ఎనర్జీ వీక్ 2023లో భాగంగా ‘డ్యాన్స్ టు డీకార్బనైజ్’ అనే అంశంపై మంత్రి మాట్లాడారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యానికి 2022 నవంబర్ వరకు గడువు ఉన్నప్పటికీ జూన్ నాటికే సాధించినట్టు మంత్రి తెలిపారు. మరో ఒకటి రెండు రోజుల్లో 20 శాతం కలిసిన పెట్రోల్ అమ్మకాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మొదలవుతాయన్నారు. 2023 ఏప్రిల్ 1 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యం విధించుకోవడం గమనార్హం. కానీ, దీన్ని తాము మరింత ముందుగానే సాధిస్తామని పురి చెప్పారు. దేశవ్యాప్తంగా దీన్ని దశలవారీగా 2025 ఏప్రిల్ నాటికి అమలు చేయనున్నట్టు మంత్రి చెప్పారు. దీనివల్ల ఇంధన భద్రత పెరగడంతోపాటు, రూ.41,500 కోట్ల మేర విదేశీ మారకం ఆదా అవుతుందన్నారు. అలాగే, గ్రీన్హౌస్ గ్యాస్‌ల విడుదల 27 లక్షల టన్నుల మేర తగ్గుతుందని.. రైతులకు రూ.40,600 కోట్ల మేర ప్రయోజనం చేకూరుందని వివరించారు. -
‘పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకు తెచ్చేందుకు మేము సిద్ధం.. కానీ’
శ్రీనగర్: జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్‌ను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. కానీ, ఇందుకు రాష్ట్రాలు అంగీకరించకపోవచ్చన్నారు. ఇందుకు రాష్ట్రాల అంగీకారం కూడా తప్పనిసరి అన్నది గుర్తు చేశారు. రాష్ట్రాలు కూడా సుముఖత వ్యక్తం చేస్తే ఈ విషయంలో కేంద్రం ముందుకు వెళుతుందని పురి చెప్పారు. దీన్ని ఎలా అమలు చేయాలన్నది మరో అంశంగా పేర్కొన్నారు. దీనిపై ఆర్థికమంత్రి స్పష్టత ఇవ్వగలరని పేర్కొన్నారు. లిక్కర్, ఇంధనాలు రాష్ట్రాలకు ఆదా య వనరులుగా ఉన్నందున, వాటిని జీఎస్టీ కిందకు తీసుకురావడానికి అంగీకరించకపోవచ్చన్న అభిప్రాయాన్ని మంత్రి వినిపించారు. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
తక్కువ ధరకు కొన్నాం.. రూ.5,000 కోట్లు పొదుపుచేశాం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏప్రిల్–మే నెలల్లో రెండు దశాబ్దాల కనిష్టానికి పడినప్పుడు, ఈ పరిస్థితిని భారత్ తనకు అనుకూలంగా మార్చుకుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. తక్కువ ధర వద్ద భారీగా ముడి చమురును కొనుగోలుచేసి, తన మూడు వ్యూహాత్మక భూగర్భ చమురు నిల్వల క్షేత్రాలనూ నింపుకుందని వెల్లడించారు. తద్వారా రూ.5,000 కోట్లను భారత్ పొదుపుచేయగలిగిందని ఆయన వివరించారు. భారత్ తన మొత్తం క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో మూడవ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదేశంగా భారత్ కొనసాగుతోంది. ఆయా అంశాలపై రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► అంతర్జాతీయంగా భారీగా పడిపోయిన క్రూడ్ ఆయిల్ ధరలను అవకాశంగా తీసుకుని ఏప్రిల్, మే నెలల్లో భారత్ 16.71 మిలియన్ బేరళ్ల (ఎంబీబీఎల్)ను కొనుగోలుచేసింది. విశాఖపట్నం, మంగళూరు, పద్దూర్‌లలో నిర్మించిన వ్యూహాత్మక చమురు నిల్వల క్షేత్రాలను నింపుకుంది. ► సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఇరాక్‌ల నుంచి ఈ కొనుగోళ్లు జరిగాయి. ► 2020 జనవరిలో బేరల్ 60 డాలర్లకు కొంటే, తదుపరి తక్కువ ధరకు కొనుగోళ్ల వల్ల సగటు వ్యయం బేరల్‌కు 19 డాలర్లకు పడిపోయింది. ► మంగళూరు నిల్వల సామర్థ్యం మొత్తం 1.5 మిలియన్ టన్నులు. మూడింటిలో పద్దూర్ నిల్వల సామర్థ్యం 2.6 మిలియన్ టన్నులు. విశాఖ విషయంలో ఈ సామర్థ్యం 1.33 మిలియన్ టన్నులు. ► 5.33 మిలియన్ టన్నుల అత్యవసర నిల్వ భారత్ 9.5 రోజుల అవసరాలకు సరిపోతుంది. భారత్ రిఫైనరీలు 65 రోజులకు సరిపడా క్రూడ్ నిల్వలను నిర్వహిస్తాయి. మూడు నిల్వ క్షేత్రాలనూ కలుపుకుంటే, 87 రోజులకు సరిపడా క్రూడ్ నిల్వలు భారత్ వద్ద ఉంటాయి. ఇంధన భద్రతకు సభ్య దేశాలకు ఐఈఏ నిర్దేశిస్తున్న చమురు నిల్వల స్థాయికి ఈ పరిమాణం దాదాపు చేరువగా ఉంది. -
పెట్రోల్ ధరలు దిగొస్తున్నాయి..
న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు అమాంతంగా పెరగడంతో ప్రజల్లో ఆందోళనలు పెరిగి నిరసనలు పెల్లుబుకుతుండగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. పెట్రోల్ ధరలు తగ్గు ముఖం పట్టడం మొదలైందని చెప్పారు. 'ధరలు తగ్గడం మొదలైంది. గత రెండు రోజుల్లోనే పెట్రోల్ తగ్గడం మొదలయ్యాయి' అని ఆయన చెప్పారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇర్మా, హార్వీ తుఫానుల కారణంగా పెట్రోలియం మార్కెట్ ధరల్లో సమతౌల్యం దెబ్బతిన్నదని, అందువల్లే ధరలు పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీ విధించే విషయాన్ని తాను కూడా సమర్థిస్తున్నానని, అయితే, ప్రజల ప్రయోజనాలను మాత్రం తప్పక దృష్టిలోమ పెట్టుకుంటామని, ప్రజల అభీష్టాలకు అనుగుణంగానే ముందుకు వెళతామని ఆయన తెలిపారు. 'ఇప్పటికే మేం జీఎస్టీ మండలికి పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీ వేయాలని ప్రతిపాదించాం. ఇది ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటుంది.బ అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలకు కూడా భద్రత ఉంది' అని ఆయన చెప్పారు. -
త్వరలోనే రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఎన్ఎఫ్ఎల్, ఈఐఎల్, ఎఫ్‌సీఐ అనే మూడు ప్రభుత్వరంగ సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ఈ కర్మాగారాన్ని పునరుద్ధరిస్తాయని లోక్‌సభలో పెట్రోలియంశాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం తెలిపారు. డిసెంబర్ 31లోగా జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటవుతుందని, వచ్చే మార్చి 31 నాటికి ఒప్పందం కుదురుతుందని వివరించారు. -
కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్‌రా కన్నుమూత
-
అదనపు బాధ్యతలు స్వీకరించిన వీరప్ప మొయిలీ
దేశంలో పచ్చదనం పరిరక్షించేందుకు రాజీ లేని పోరాటం చేస్తానని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. పర్యావరణం, అడవులు అనేవి మనిషి జీవితంలో ఓ భాగమని ఆయన పేర్కొన్నారు. అవి వాతావరణ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తాయని తెలిపారు. అడవులు, పర్యావరణ మంత్రిగా అదనపు బాధ్యతలు మంగళవారం వీరప్ప మొయిలీ స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ బాధ్యతలను చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి భవనం వెనువెంటనే విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. దాంతో వీరప్ప మొయిలీ మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు జయంతి వెల్లడించారు. అయితే పర్యావరణ ప్రాజెక్టు అనుమతుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న కారణంగా జయంతిని పదవి నుంచి తొలగించినట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. -
మెట్రో రైల్లో ఆఫీసుకు వెళ్లిన వీరప్ప మొయిలీ
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎం.వీరప్ప మొయిలీ బుధవారం మెట్రో రైల్లో ఆఫీసుకు వెళ్లారు. పెట్రోలియం పొదపు చర్యల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రేసు కోర్సు స్టేషన్ వద్ద రైలెక్కి సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద దిగారు. ఇక్కడికి సమీపంలోనే పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యాలయం ఉంది. 'ప్రతీ బుధవారం నేను రైల్లోనే ఆఫీసుకు వెళతా. నా అధికారిక వాహనాన్ని గ్యారెజిలో ఉంచాల్సిందిగా సిబ్బందికి సూచించా. వారంలో కనీసం ఒకసారి ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణం చేయాల్సిందిగా పెట్రోలియం శాఖ పరిధిలోని కంపెనీల ఉద్యోగులకు సలహా ఇచ్చా' అని మంత్రి చెప్పారు. పెట్రోల్‌ను పొదుపు చేస్తే ఆర్థికంగానూ ఆదా చేసినట్టేనని అన్నారు.