ముగిసిన పీజీ మెడికల్ నాన్ సర్వీసింగ్ కౌన్సెలింగ్
విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పీజీ మెడికల్ కౌన్సెలింగ్లో నాన్సర్వీస్ అభ్యర్థులకు గత నెల 29 నుంచి నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్ మంగళవారంతో ముగిసింది. దీనిలో భాగంగా 944 సీట్లు భర్తీ అయ్యాయి. వాటిలో క్లినికల్ డిగ్రీలో 621, నాన్ క్లినికల్ డిగ్రీలో 138, క్లినికల్ డిప్లొమాలో 172, నాన్ క్లినికల్ డిప్లొమాలో 13 సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో ఓపెన్ కేటగిరీలో 357, బీసీ కేటగిరీలో 360, ఎస్సీ కేటగిరీలో 168, ఎస్టీ కేటగిరీలో 59 మంది అభ్యర్థులు సీట్లు పొందారు. బుధవారం సర్వీస్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ మొదలవుతుంది.