PG medical fees
-
పీజీ మెడికల్ ఫీజుల ఉత్తర్వుల మార్పు
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ కోర్సుల ఫీజులపై హైకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను మంగళవారం సవరించింది. గత 20వ తేదీ నాటి ఉత్తర్వుల వల్ల విద్యార్థులపై ఫీజుల భారం 75 శాతం వరకు ఉంటుందని సుదీప్ శర్మ సహా 121 మంది పీజీ మెడికల్ విద్యార్థులు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఇరుపక్షాల వాదనల తర్వాత విద్యార్థుల వాదనను ఆమోదించింది. ఫీజుల్ని పెంచుతూ గత ఏప్రిల్ 14న జారీ చేసిన జీవో 20లో ప్రకటించిన ఫీజుల మొత్తంలో ఏ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం, బీ కేటగిరీ విద్యార్థులు 60 శాతం చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ఉత్తర్వుల్లో 2016 నాటి ఫీజుతో పాటు తాజాగా పెంచిన ఫీజులో 50/60 శాతం చొప్పున ఆ రెండు కేటగిరీల వారూ చెల్లించాలంది. ఈ విధంగా ఫీజుల వసూళ్లకు అనుమతినివ్వాలని, మధ్యంతర ఉత్తర్వులను మార్పు చేయవద్దని కాలేజీ యాజమాన్యాల న్యాయవాదులు కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సందీప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 20 నాటి మధ్యంతర ఉత్తర్వులను మార్పు చేయాలని, లేకపోతే పాత జీవోలోని మొత్తం ఫీజు, కొత్త జీవోలో 50/60 శాతం వసూలు చేయాలన్న ఉత్తర్వుల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, కాలేజీ యా జమాన్యాలకే మేలు జరుగుతుందని చెప్పారు. ఇరుపక్షాల వాదనల తర్వాత ధర్మాసనం.. కొత్త జీవో 20లో నిర్ణయించిన ఫీజులో 50/60 శాతం చొప్పున ఆ రెండు కేటగిరీలు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. -
పీజీ వైద్య ఫీజుల పెంపు సబబే..!
- స్టే ఎత్తివేతకు హైకోర్టులో పిటిషన్ వేయాలని సర్కారు నిర్ణయం - పీజీ రెండో దశ అడ్మిషన్ల గడువు 19 వరకు పెంపు సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య సీట్ల ఫీజుల పెంపు సబబేనని, పెంచిన ఫీజులపై విధించిన స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. స్టే ఎత్తివేతపై ప్రైవేటు మెడికల్ కాలేజీలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై తీర్పు గురువారం రానుంది. అదేరోజు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనుంది. ఫీజుల పెంపుపై ౖహె కోర్టు 4 వారాలపాటు స్టే విధించడంతో ఆ తర్వాత చూసుకోవాలని ప్రభుత్వ వర్గాలు భావించాయి. కానీ పీజీ అడ్మిషన్ల గడువు నెలాఖరు వరకే ఉండటం, సమయం తక్కువ ఉండటంతో విద్యార్థులకు నష్టం వాటి ల్లే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు మొండికేయడంతో రాష్ట్ర ప్రభు త్వం వెనకడుగు వేసినట్లు అర్థమవుతోంది. పైగా తామే ఫీజుల పెంపుపై జీవో జారీ చేసినందున ఎందుకు పెంచాల్సి వచ్చిందో హైకోర్టుకు వెల్లడించ నుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హైకోర్టు నిర్ణయాన్ని ప్రైవేటు కాలేజీలు అమలు చేయకపోతే అది కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని పేర్కొన్నాయి. కానీ ప్రైవేటు కాలేజీలు మాత్రం వెనకడుగు వేయ కపోవడం, అవసరమైతే పీజీ సీట్లను ఉపసంహరిం చుకుంటామని హెచ్చరించడంతో ప్రభుత్వమే దిగివ చ్చిందని అంటున్నారు. చివరకు ప్రభుత్వం, ప్రైవేటు మెడికల్ కాలేజీలు రాజీకి వచ్చి ఫీజుల పెంపుపై ఒకే వైఖరిని ప్రదర్శించాయన్న చర్చ జరుగుతోంది. గడువు 19కి పెంపు.. పీజీ మెడికల్, డెంటల్ రెండో దశ వెబ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరేం దుకు గడువును ఈ నెల 19కి పొడిగిస్తున్నట్టు కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవంగా బుధవారం నాటికి గడువు పూర్తయింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు విద్యా ర్థులను చేర్చుకోవడానికి నిరాకరించడంతో ఈ నిర్ణ యం తీసుకుంది. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చు కున్నారు. గురువారం కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంది. స్టే ఎత్తివేస్తే కాలేజీలు ముందుకెళ్తాయి. లేకుంటే సుప్రీం గడప తొక్కనున్నాయి. అక్కడా న్యాయం జరగకుంటే పీజీ సీట్లను ఉపసంహరించుకుంటామని కాలేజీలు చెబు తున్నాయి. అడ్మిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్టే ఎత్తివేయండి.. పీజీ వైద్య విద్య ఫీజుల పెంపుపై స్టే విధిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే ప్రభుత్వం ఫీజులను పెంచిం దని తెలిపింది. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించనుంది.