పీజీ వైద్య ఫీజుల పెంపు సబబే..! | Paid medical fees increase is right | Sakshi
Sakshi News home page

పీజీ వైద్య ఫీజుల పెంపు సబబే..!

Published Thu, May 18 2017 3:15 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

Paid medical fees increase is right

- స్టే ఎత్తివేతకు హైకోర్టులో పిటిషన్‌ వేయాలని సర్కారు నిర్ణయం
- పీజీ రెండో దశ అడ్మిషన్ల గడువు 19 వరకు పెంపు


సాక్షి, హైదరాబాద్‌: పీజీ వైద్య సీట్ల ఫీజుల పెంపు సబబేనని, పెంచిన ఫీజులపై విధించిన స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. స్టే ఎత్తివేతపై ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై తీర్పు గురువారం రానుంది. అదేరోజు ప్రభుత్వం  పిటిషన్‌ దాఖలు చేయనుంది. ఫీజుల పెంపుపై ౖహె కోర్టు 4 వారాలపాటు స్టే విధించడంతో ఆ తర్వాత చూసుకోవాలని ప్రభుత్వ వర్గాలు భావించాయి. కానీ పీజీ అడ్మిషన్ల గడువు నెలాఖరు వరకే ఉండటం, సమయం తక్కువ ఉండటంతో విద్యార్థులకు నష్టం వాటి ల్లే పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు మొండికేయడంతో రాష్ట్ర ప్రభు త్వం వెనకడుగు వేసినట్లు అర్థమవుతోంది. పైగా తామే ఫీజుల పెంపుపై జీవో జారీ చేసినందున ఎందుకు పెంచాల్సి వచ్చిందో హైకోర్టుకు వెల్లడించ నుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హైకోర్టు నిర్ణయాన్ని ప్రైవేటు కాలేజీలు అమలు చేయకపోతే అది కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని పేర్కొన్నాయి. కానీ ప్రైవేటు కాలేజీలు మాత్రం వెనకడుగు వేయ కపోవడం, అవసరమైతే పీజీ సీట్లను ఉపసంహరిం చుకుంటామని హెచ్చరించడంతో ప్రభుత్వమే దిగివ చ్చిందని అంటున్నారు. చివరకు ప్రభుత్వం, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు రాజీకి వచ్చి ఫీజుల పెంపుపై ఒకే వైఖరిని ప్రదర్శించాయన్న చర్చ జరుగుతోంది.

గడువు 19కి పెంపు..
పీజీ మెడికల్, డెంటల్‌ రెండో దశ వెబ్‌ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరేం దుకు గడువును ఈ నెల 19కి పొడిగిస్తున్నట్టు కాళోజీ నారాయణరావు హెల్త్‌ వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవంగా బుధవారం నాటికి గడువు పూర్తయింది.  ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు విద్యా ర్థులను చేర్చుకోవడానికి నిరాకరించడంతో ఈ నిర్ణ యం తీసుకుంది. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చు కున్నారు. గురువారం కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంది. స్టే ఎత్తివేస్తే కాలేజీలు ముందుకెళ్తాయి. లేకుంటే సుప్రీం గడప తొక్కనున్నాయి. అక్కడా న్యాయం జరగకుంటే పీజీ సీట్లను ఉపసంహరించుకుంటామని కాలేజీలు చెబు తున్నాయి. అడ్మిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది.

స్టే ఎత్తివేయండి..
పీజీ వైద్య విద్య ఫీజుల పెంపుపై స్టే విధిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం హైకోర్టును ఆశ్రయించింది.  అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే ప్రభుత్వం ఫీజులను పెంచిం దని తెలిపింది. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ ఎం.ఎస్‌.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement