సాక్షి, హైదరాబాద్: వైద్య శాఖ, ట్రాన్స్‌కోల్లో ఔట్‌సోర్సింగ్(పొరుగు సేవలు), కాంట్రాక్టు (ఒప్పంద సేవలు) పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఉద్యోగాల భర్తీకి నిర్వహించబోయే పరీక్షలను నిలుపుదల చేయడంవల్ల ప్రయోజనం ఉండబోదని, ఈ దశలో స్టే మంజూరు అవసరం లేదని సోమవారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో చేసే ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలనే నిర్ణయాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. మరో సింగిల్ జడ్జి.. పరీక్షలో సమాన మార్కులు వచ్చినప్పుడు మాత్రమే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని అందుకు విరుద్ధమైన ఆదేశాలిచ్చారు. దాంతో ఈ వివాదం ధర్మాస నం ముందుకు వచ్చింది. ఔట్‌సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతుల్లో సేవలందించే వారికి వెయి టేజీ ఇవ్వాలన్న సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం విచా రిస్తూ.. ఉద్యోగ భర్తీకి నిర్వహించే పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులందరికీ ఒకే తరహా పశ్నపత్రం ఉండాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోటీ పరీక్షల తేదీ సమీపిస్తున్నందున ఈ కేసులను వీలైనంత త్వర గా విచారణ జరుపుతామని ప్రకటించింది.
ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు చేసేవారికి వెయిటేజీ మార్కులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. పరీక్షలు నిర్వహించకుండా స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరా రు. దీనిపై అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ.. ఇప్పటికిప్పుడే పరీక్షలు జరిపేసి అర్హుల్ని వెంటనే ఉద్యోగాల్లో చేర్చేసుకోవడం లేదు కాబట్టి పరీక్షల్ని వాయి దా వేయాల్సిన అవసరం లేదన్నారు. వాదనల అనంతరం విచారణ వచ్చేవారానికి వాయిదా పడింది.
వెయిటేజీ మార్కులపై స్టేకు నో
Published Tue, Feb 6 2018 3:37 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment