నారిమన్ స్థానంలో అనిల్ దివాన్
న్యూఢిల్లీ: బీసీసీఐ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త సభ్యులను ఎంపిక చేసే కమిటీ నుంచి ఫాలి నారిమన్ తప్పుకున్నారు. ఆయన స్థానంలో సీనియర్ కౌన్సిల్ అనిల్ దివాన్‌ను సుప్రీం కోర్టు ఎంపిక చేసింది. గతంలో తాను బీసీసీఐకి న్యాయవాదిగా పనిచేశానని, దీంతో ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.
జస్టిస్ ఆర్ ఎం లోధా ప్యానెల్ సంస్కరణల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను సుప్రీం కోర్టు తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డు పరిపాలనను చూసేందుకు జనవరి 19లోగా సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేసేందుకు నారిమన్, గోపాల్ సుబ్రమణియన్లను అమికస్ క్యూరీగా సోమవారం నియమించింది.