పేరులోనే గిరాకి ఉంది!
సమ్‌థింగ్ స్పెషల్
వినియోగదారులను ఆకట్టుకోవడానికి పేరు ముఖ్యమైనదని కొందరు వ్యాపారులు బలంగా నమ్ముతున్నారు. మన దేశంలోని ప్రధాన నగరాలలో కొన్ని దుకాణల పేర్లు వింతగా ఉండి, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలో ఒక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పేరు ‘ఫేస్బుక్’. ముంబాయిలోని ఒక ఫాస్ట్‌పుడ్ సెంటర్ పేరు...‘బీటెక్ చాట్ వాలా’ ముంబాయి రైల్వేస్టేషన్ సమీపంలో చెప్పులు కుట్టే ఒక వ్యక్తి తన దుకాణానికి ‘చెప్పుల ఆస్పత్రి’ అని పేరు పెట్టుకున్నాడు. ముంబయిలో లోదుస్తులు అమ్మే ఒక చిన్న షాప్‌కు ‘అందర్ వియర్’ అని పేరు పెట్టారు. కొన్ని నగరాల్లో ‘వాట్సప్’ పేరుతో పండ్లరసాల బండ్లు వీధుల్లో తిరుగుతున్నాయి.