నేడు వికలాంగ అభ్యర్థులకు కౌన్సెలింగ్
కేయూ క్యాంపస్ : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వికలాంగ కేటగిరీ అభ్యర్థులకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కేయూలోని అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో కౌ న్సిలింగ్ జరుగుతుందని కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ మట్టా కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. స్పె షల్ కేటగిరీ కింద సీటు కోరే వికలాంగ అభ్యర్థులు ఉదయం 9గంటలకు ప్రా రంభమయ్యే కౌన్సెలింగ్‌కు విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.