స్కాలర్ పై ప్రొఫెసర్ లైంగిక దాడి
ఒడిశా: విశ్వ విద్యాలయాల్లోని ఆచార్యులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. శంబాలపూర్ విశ్వవిద్యాలయంలోని ఓ పీహెచ్డీ స్కాలర్‌పై లైంగిక దాడి చేసిన సాహు అనే ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సెమినార్ పేపర్ల ప్రిపరేషన్ కోసం కంప్యూటర్ ల్యాబ్ తాళాలివ్వాల్సిందిగా ఓ స్కాలర్, మరికొందరు తోటి స్కాలర్లు కోరగా తన దగ్గర తాళం లేదని, తన చాంబర్లో ఉన్న కంప్యూటర్ వాడుకోవచ్చని సాహు చెప్పాడు. అనంతరం మిగితా వాళ్లంతా వెళ్లిపోయి ఒక్క స్కాలర్ మాత్రం పేపర్లు ప్రిపేర్ చేసుకుంటుండగా అతడు లైంగిక దాడి చేశాడు. బాధితురాలి వివరాల ప్రకారం ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గతంలో కూడా ఇదే వర్సిటీకి చెందిన చరిత్ర విభాగం ఆచార్యుడు లైంగిక వేధింపులకు పాల్పడి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు.