Philanthropy Program
-
‘గివింగ్పీఐ’: దానకర్ణులు ఒక్కటయ్యారు..లక్ష కోట్లు విరాళం ఖాయం!
ముంబై: దాతల కుటుంబాలు చేతులు కలిపాయి. విప్రో ప్రేమ్జీ, జిరోదా నిఖిల్ కామత్, రోహిణి నీలేకని, నిసా గోద్రెజ్ సంయుక్తంగా ‘గివింగ్పీఐ’ పేరుతో నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 2030 నాటికి ఏటా బిలియన్ డాలర్లను సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన (ఎస్డీజీ) కోసం సమీకరించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ ప్లాట్ఫామ్లో భాగమయ్యే ప్రతీ సభ్యుడు/సభ్యురాలు ఏటా కనీసం రూ.50 లక్షలను విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా 2030 నాటికి 5,000 మంది సభ్యుల స్థాయికి నెట్వర్క్ను విస్తరించాలని వీరు నిర్ణయించారు. అదితి, రిషబ్ ప్రేమ్జీ, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, మనీషా, ఆశిష్ ధావన్, నిఖిల్ కామత్, నిసా గోద్రెజ్, రాజన్ నవాని, రోహిణి నీలేకని, స్కోల్ ఫౌండేషన్, టెరా సింగ్, వచాని, వాసవి భారత్ రామ్, వివేక్జైన్ ఈ నెట్వర్క్ ఏర్పాటుకు చేతులు కలిపిన వారిలో ఉన్నారు. భారత్లో 113 మంది బిలియనీర్లు, 6,884 అధిక ధనవంతులు ఉన్నారు. వీరి సంఖ్య వచ్చే ఐదేళ్లలో 12,000కు చేరుకుంటుందని బెయిన్ అండ్ కంపెనీ నివేదిక చెబుతోంది. అంతర్జాతీయంగా ఉన్న తోటివారిని వీరు స్ఫూర్తిగా తీసుకుని కుటుంబ దాతృత్వానికి ముందుకు వస్తే భారత్లో అదనంగా రూ.60,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు సమకూరతాయని అంచనా. -
ప్యూయెల్-ఏ-డ్రీమ్ తో క్రౌడ్ ఫండింగ్..
♦ విజయవంతంగా 40 ప్రాజెక్టులు ♦ మొత్తం రూ.1.6 కోట్లు సమీకరణ ♦ కంపెనీ ఫౌండర్ రంగనాథ్ తోట హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మంచి వ్యాపార ప్రణాళిక, దాతృత్వ కార్యక్రమం, సామాజిక చైతన్యం.. కార్యక్రమం ఏదైనా క్రౌడ్ ఫండింగ్ చేసిపెడతామని అంటోంది ఫ్యూయెల్ఏడ్రీమ్.కామ్. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీ ఇప్పటి వరకు 40 ప్రాజెక్టులకు క్రౌడ్ ఫండింగ్ అందించింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి 5 ప్రాజెక్టులు ఉన్నాయని ఫ్యూయెల్ఏడ్రీమ్.కామ్ ఫౌండర్ రంగనాథ్ తోట సాక్షి బిజినెస్ బ్యూరోకు మంగళవారం తెలిపారు. అన్ని ప్రాజెక్టులకు కలిపి మొత్తం రూ.1.6 కోట్లు సమీకరించామని చెప్పారు. ఏ కార్యక్రమమైనా తక్కువ వ్యయంతో విజయవంతంగా పూర్తి అయ్యేందుకు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. డిసెంబరుకల్లా మొత్తం రూ.4 కోట్లు సమీకరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్రౌడ్ ఫండింగ్ అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, కస్టమర్లు, ఇతరుల నుంచి ఉచితంగా నిధులను సమీకరించడం. డెలివరీకి ఈ-బైక్ సిద్ధం.. ఫ్యూయెల్ఏడ్రీమ్.కామ్ క్రౌడ్ ఫండింగ్ అందించిన స్పెరో ఈ-బైక్ డెలివరీకి సిద్ధమైంది. ఈ నెలాఖరు నుంచి కస్టమర్లకు అందిస్తామని స్పెరో ఈ-బైక్ ఫౌండర్ ఎస్.మణికందన్ వెల్లడించారు. ఇప్పటి వరకు 160 బుకింగ్స్ నమోదయ్యాయని చెప్పారు. నెలకు 300 ఈ-బైక్స్ను తయారు చేసే సామర్థ్యం తమ కంపెనీకి ఉందని పేర్కొన్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.55 లక్షలు సమీకరించామన్నారు. ఒకసారి చార్జ్ చేస్తే 30, 60, 100 కిలోమీటర్లు నడిచే మూడు రకాల స్పెరో ఈ-బైక్ మోడళ్లున్నాయి. ధరల శ్రేణి రూ.29,900-50,900 ఉంది. మార్కెట్ ధరలతో పోలిస్తే 40 శాతం తక్కువ అని కంపెనీ తెలిపింది. శాంసంగ్ తయారీ బ్యాటరీని వీటిలో వాడారు. మోటారు, టైర్లను కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు.