Phone data
-
Pegasus: ఏంటీ పెగాసస్.. భారీ డేటా హ్యాక్‌లో వాస్తవమెంత?
ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండే స్పైవేర్ ‘పెగాసస్’ హ్యాకింగ్‌కు గురైందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓవైపు భారత ప్రభుత్వం ఈ హ్యాకింగ్ కుంభకోణంలో తమ ప్రమేయం లేదని చెప్తుండగా.. మరోవైపు ఫోరెన్సిక్ టెస్టుల్లో పెగాసస్ ద్వారా డేటా హ్యాక్ అయ్యేందుకు వీలుందన్న కథనాలు కలకలం రేపుతున్నాయి. న్యూఢిల్లీ: దేశంలో మరో భారీ డేటా లీకేజీ కుంభకోణం ప్రకంపనలు మొదలయ్యాయా?. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, మరికొందరు ప్రముఖుల్ని లక్క్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్.. కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్పైవేర్ ద్వారా హ్యాకర్లు.. ప్రముఖుల ఫోన్ డేటాను చోరీ చేశారని ‘ది వైర్’ ఆదివారం ఓ కథనం ప్రచురించింది. తాజా కథనం ప్రకారం.. భారత్‌తో మరికొన్ని దేశాల ప్రముఖులను లక్క్ష్యంగా చేసుకుని ఈ హ్యాకింగ్ ఎటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ టెస్ట్‌లు(డేటాబేస్‌లో ఉన్న పది నెంబర్లపై పరీక్షలు) దాదాపుగా హ్యాకింగ్ జరిగిందనేందుకు ఆస్కారం ఉందని తేల్చాయని వైర్ ప్రస్తావించింది. మన దేశానికి చెందిన సుమారు 300 మంది ఫోన్ నెంబర్లు ఆ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, తాజా-మాజీ అధికారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఓ ప్రముఖుడు, ముగ్గురు కీలక ప్రతిపక్ష సభ్యులు, 40 మంది జర్నలిస్టుల నెంబర్లు, ఆరెస్సెస్ సభ్యులు, ఇతర ప్రముఖుల వివరాలు ఉన్నట్లు, రాబోయే రోజుల్లో వాళ్ల పేర్లను సైతం వెల్లడిస్తామని ది వైర్ పేర్కొంది. యాపిల్ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా మరింత తేలికగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది. Strong rumour that this evening IST, Washington Post & London Guardian are publishing a report exposing the hiring of an Israeli firm Pegasus, for tapping phones of Modi’s Cabinet Ministers, RSS leaders, SC judges, & journalists. If I get this confirmed I will publish the list. — Subramanian Swamy (@Swamy39) July 18, 2021 దావా వేస్తాం 2018-19 నడుమ ఈ హ్యాకింగ్ ప్రయత్నం జరిగిందని, అయితే అన్ని నెంబర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయా,? లేదా? అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉందని వైర్ పేర్కొంది. వైర్‌తో పాటు వాషింగ్టన్ పోస్ట్ లాంటి అంతర్జాతీయ మ్యాగజైన్లు సైతం ఈ వార్తలను ప్రచురించాయి. మరోవైపు ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్ (పెగాసస్‌ను అమ్మేది ఇదే) ఆరోపణల్ని ఖండించింది. నిఘా కార్యకలాపాల కోసమే ఈ స్పైవేర్‌ను ఎన్ఎస్వో ప్రభుత్వాలకు అమ్ముతుంటుంది. అలాంటిది హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది. అయితే లీక్ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా హ్యాక్ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే యాక్సెస్ ఉండే Pegasus డేటా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే లేదని, తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించింది. గతంలో కూడా.. పారిస్‌కు చెందిన ఓ మీడియా హౌజ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ద్వారా ఈ నిఘా కుంభకోణం వెలుగు చూసినట్లు సమాచారం. ఎన్ఎస్వో గ్రూప్ రూపొందించిన పెగాసస్.. సైబర్‌వెపన్‌గా భావిస్తుంటారు. కానీ, ఐఫోన్ యూజర్లనే ఇది టార్గెట్ చేస్తుందని, హ్యాకింగ్‌కు పాల్పడుతుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇది ఆండ్రాయిడ్ ఫోన్లను సైతం టార్గెట్ చేస్తుందని తర్వాత తేలింది. పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించి ఎన్ఎస్వో గ్రూప్ మీద ఫేస్బుక్ 2019లో ఓ దావా కూడా వేసింది. అంతేకాదు వాట్సాప్ యూజర్లను అప్రమత్తం చేసింది కూడా. ప్రస్తుతం పెగాసస్ కథనాలు పలు ఇంటర్నేషనల్ మీడియా హౌజ్‌లలో కూడా ప్రచురితం అవుతున్నాయి. -
కాల్‌డేటా పట్టించింది
► మానమ్మ హత్యకేసును ఛేదించిన పోలీసులు ► నగల కోసమే బీరు బాటిల్‌తో పొడిచి హత్య కొందుర్గు: మానమ్మను హత్యచేసిన నిందితుడిని ఫోన్ డేటా ఆధారంగా గుర్తించిన పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 21న మంగన్నగారి మానమ్మ(45) మృతిచెందగా పర్వతాపూర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు షాద్‌నగర్ రూరల్ సీఐ మధుసూదన్ కథనం ప్రకారం... పర్వతాపూర్ గ్రామానికి చెందిన మంగన్నగారి మానమ్మ, అదే గ్రామానికి చెందిన కొంగ రామ్‌రెడ్డి(25) పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిరువురి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కాగా రామ్‌రెడ్డి కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడి మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతుండేవాడు. ఈ నెల 19న సాయంత్రం మానమ్మ కొందుర్గు స్వామి వద్దకు వెళ్లొస్తానని ఇంటి నుంచి బయలుదేరింది. ఇరువురు కలిసి కొందుర్గుకు వెళ్లారు. అక్కడ మద్యం సేవించి, ఓ కల్లు ప్యాకెట్, బీరుబాటిల్ వెంటతెచ్చుకున్నారు. ఇంటికి తిరిగి వస్తూ పర్వతాపూర్ శివారులో కూర్చొని మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న మానమ్మ ఒంటిపై బంగారు పుస్తెలతాడు, కమ్మలు, వెండి పట్టీలు ఉండటంతో ఆ భరణాలపై ఆశపడ్డ రామ్‌రెడ్డి బీరు బాటిల్ పగలగొట్టి మానమ్మ కడుపులో పొడిచాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలను లాక్కున్నాడు. మాన మ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగానే ఆమెను ఎత్తుకొని గ్రామశివారులోని పాడుబడి న బావిలో పడేశాడు. కాల్ డేటాతో నిందితుడి గుర్తింపు మానమ్మ ఫోన్ కాల్స్ డాటా ఆధారంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గురుప్రసాద్, కృష్ణ నింది తుడి ఆధారాలు సేకరిస్తుండగా తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న రామ్‌రెడ్డి సోమవారం గ్రామ రెవెన్యూ అధికారిణి జయమ్మ ఎదుట లొంగిపోయాడు. దీంతో జయమ్మ నిందితుడిని పోలీసులకు అప్పగించా రు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి, ఆభరణాలు రికవరీ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ మధుసూదన్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు వెంకటేశ్వర్లు, లింగం పాల్గొన్నారు. -
ప్రతి స్మార్ట్‌ఫోన్‌పైనా నిఘా నేత్రం
అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక మనకు మరింత ప్రైవసీ ఉంటుందని అనుకుంటున్నాం. మనం ఎక్కడున్నామో, ఎవరితో ఫోన్లో ఏం మాట్లాడుతున్నామో మూడో వ్యక్తికి తెలియదని భావిస్తున్నాం. కానీ అది భ్రమ మాత్రమే. నిరంతరం మన కదలికలపై, మనం మాట్లాడే ప్రతి మాటపై, పంపే ప్రతి సందేశంపై, తీసే ప్రతి ఫొటోపై నిఘానేత్రం కొనసాగుతూనే ఉంటోంది. మూడో కన్ను చూస్తూనే ఉంటోంది. మన కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు మన వెన్నంటి గూఢచారులు ఎవరూ రాకపోవచ్చు. మనకు తెలియకుండానే మన ఫోన్లోనే ఆ నిఘా వ్యవస్థ మనల్ని వెంటాడుతోంది. దీనికి ఏ ఫోనూ అతీతం కాదు. ఐఫోన్లు, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, సింబియాన్ వ్యవస్థ ఫోన్లన్నీ నిఘా పరిధిలోనే పనిచేస్తున్నాయి! మన ఫోన్లోని ఈ మెయిళ్లు, టెక్స్ట్ సందేశాలు, కాంటాక్ట్ జాబితాలు, క్యాలెండర్ రికార్డ్స్, ఇన్స్టెంట్ మెసేజిలు, జీపీఎస్ లొకేషన్, సెర్చ్ హిస్టరీ తదితరాలన్నీ మూడో వ్యక్తికి రియల్ టైమ్‌లోనే తెలిసిపోతోంది. మనం మాట్లాడుతున్నప్పుడు పరిసరాల ప్రాంతాల నుంచి వినిపించే శబ్దాలను కూడా మన ఫోన్లోని మైక్రోఫోనే రికార్డుచేసి మూడో వ్యక్తికి పంపిస్తుంది. ఈ నిఘా వ్యవస్థను ప్రైవేటు కంపెనీలే ఎక్కువగా నిర్వహిస్తున్నాయి. అందులో ప్రముఖమైనది 'ఎన్ఎస్ఓ గ్రూప్'. ఇది ఇజ్రాయెల్‌లో 2010లో ఏర్పాటయింది. ఇందులో దాదాపు 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏడాదికి 15 కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది. వివిధ దేశాల ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలు, ప్రైవేటు సంస్థలు సూచించే ఏ ఫోన్ల మీద నిఘా కావాలంటే వాటిపై నిఘా పెట్టడమే ఈ సంస్థ వ్యాపారం. అందులో భాగంగా వివిధ టారిఫ్‌ల ప్రకారంగా ఫీజులు వసూలు చేస్తోంది. పది ఐఫోన్లపై నిఘా కొనసాగించేందుకు ఐదు లక్షల డాలర్లు, పది ఆండ్రాయిడ్ ఫోన్లపై నిఘాకు ఆరున్నర లక్షల డాలర్లు, ఐదు బ్లాక్‌బెర్రీ ఫోన్లపై నిఘాకు ఐదు లక్షల డాలర్లు, ఐదు సింబియాన్ ఫోన్లపై నిఘాకు మూడు లక్షల డాలర్లను ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ పీజు కింద వసూలు చేస్తోంది. ఆ తర్వాత ప్రతి వంద పీసులపై 8 లక్షల డాలర్లు, ప్రతి 50 పీస్‌లపై 5 లక్షల డాలర్లు, ప్రతి 20 పీసులపై రెండున్నర లక్షల డాలర్లు, ప్రతి పది పీసులపై ఒకటిన్నర లక్షల డాలర్లను వసూలు చేస్తోంది. మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడం కోసం ఈ కంపెనీ ఎప్పటికప్పుడు ట్రాకింగ్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌ను తయారుచేస్తోంది. దీన్ని వినియోగదారుల ఫోన్లలోకి ఎక్కించేందుకు అనేక మార్గాలు అనుసరిస్తోంది. పాతకాలపు డిటెక్టివ్‌ల మాదిరిగా మనుషులను మన వద్దకు పంపించి మన ఫోన్లను ట్రాక్ చేస్తారు. ఈ మెయిళ్ల ద్వారా, వెబ్ సెర్చింగ్ ద్వారా, ఫ్రీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ద్వారా మన స్మార్ట్‌ఫోన్‌లోకి నిఘా వ్యవస్థను ఎక్కిస్తారు. ఈ సంస్థ చుట్టుపక్కల నుంచి వచ్చే శబ్దాలను కూడా రికార్డు చేసేందుకు 'రూమ్ ట్యాప్' టెక్నాలజీని కూడా రూపొందించింది. అందుకోసం ప్రభుత్వాల నుంచి, ప్రభుత్వ నిఘాసంస్థల నుంచి, ప్రైవేటు కార్పొరేట్ సంస్థల నుంచి కాంట్రాక్టులు తీసుకుంటారు. మెక్సికో ప్రభుత్వం తరఫున మూడేళ్లపాటు మూడు కాంట్రాక్టులను కుదుర్చుకోవడం ద్వారా ఈ సంస్థ 1.50 కోట్ల డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇలా పౌరుల స్మార్ట్ఫోన్లపై నిఘా కొనసాగించడం ఏ మాత్రం అనైతికం కాదని కంపెనీ ప్రతినిధులు వాదిస్తున్నారు. ఇజ్రాయెల్ చట్టాల ప్రకారమే తమ కంపెనీ ఏర్పాటైందని, తమ కంపెనీలో కూడా పదిమంది ఉద్యోగులతో నైతిక విలువల కమిటీ ఒకటి ఉందని వారు తెలిపారు. ప్రపంచబ్యాంకు, ఐక్యరాజ్యసమితి సూచించిన నైతిక ప్రమాణాలను తమ నైతిక విలువల కమిటీ అనుసరిస్తున్నదని వారు చెప్పారు. ప్రపంచంలో టెర్రరిజాన్ని, డ్రగ్ మాఫియాను అరికట్టడం తమ లక్ష్యమని కూడా పేర్కొన్నారు. టెర్రరిస్టు సంస్థలపైనో, డ్రగ్ మాఫియా సంస్థలపైనో కాకుండా జర్నలిస్ట్‌లపైనా, సామాజిక కార్యకర్తలపైనా, ఎన్జీవో సంస్థలపై నిఘా కొనసాగించిన సంఘటనలు కూడా ఉన్నాయి. వివిధ దేశాల ప్రభుత్వాలతో కాంట్రాక్టులు కుదుర్చుకొని వారికి కావాల్సిన నిఘా సమాచారాన్ని అందిస్తోందని, అలాంటప్పుడు ఆ ప్రభుత్వాలే ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి.