షాకింగ్ : మీ ఫోన్లోకి ఆ నెంబర్
మీ స్మార్ట్‌ఫోన్‌లో మీరు సేవ్ చేయకుండా.. ఓ ఫోన్ నెంబర్ వచ్చి చేరితే. అది నిజంగా షాకింగే. ఈ విషయంపై తొలుత మనకు వచ్చే సందేహం. ఎవరైనా మన ఫోన్‌ను తీసుకుని ఈ పని చేశారా? లేదా మన ఫోన్ ఏమైనా హ్యాకింగ్‌కు గురైందా? అని అనుమాన పడతాం. తాజాగా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఇదే షాకింగ్, అనుమానకర సంఘటన ఎదురైంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ యూజర్లకు తెలియకుండానే వారి ఫోన్ కాంటాక్ట్ లిస్టులోకి వచ్చి చేరింది. ఈ విషయాన్ని ఫ్రెంచ్ హ్యాకర్ ఇలియట్ ఆల్డెర్సన్ కనుగొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు తెలియజేశారు. ట్విటర్లో ఫ్రెంచ్ హ్యాకర్ పోస్టు చేసిన విషయాన్ని చూసి, యూజర్లు తమ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌ను చెక్ చేయగా.. నిజంగానే యూఐడీఏఐ టోల్‌ఫ్రీ నెంబర్ తమ ఫోన్లోకి వచ్చిందని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు గుర్తించారు. ఈ విషయంపై గంటల వ్యవధిలోనే వందల కొద్దీ స్క్రీన్ షాట్లు ట్విటర్లో షేర్ అయ్యాయి. తమ సమ్మతి లేకుండా.. ఎలా తమ ఫోన్లలో ఈ నెంబర్‌ను యాడ్ చేస్తారంటూ యూజర్లు మండిపడుతున్నారు.
‘ ఆధార్ నెంబర్ అనుసంధానంతో లేదాఅనుసంధానం లేకుండా.. వివిధ సర్వీసుల ప్రొవైడర్ల సేవలందుకుంటున్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు... ఎంఆధార్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నప్పటికీ లేదా ఇన్స్టాల్ చేసుకోనప్పటికీ వారి ఫోన్ నెంబర్ లిస్ట్‌లో డిఫాల్ట్‌గా మీ యూఐడీఏఐ నెంబర్ ఉంది. అది కూడా వారి సమ్మతి లేకుండానే. అది ఎలానో వివరించాలి? అని ఇలియట్ ఆల్డెర్సన్ ట్వీట్ చేశారు. దానిని అధికారిక యూఐడీఏఐ హ్యాండిల్‌కు ట్యాగ్‌చేశారు. అంతకముందు యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నెంబర్ 1800-300-1947గా ఉండేది. ప్రస్తుతం దీని కొత్త నెంబర్ 1947. పాత స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 1800-300-1947 నెంబర్ కనిపిస్తుండగా.. కొత్త స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 1947 నెంబర్ డిస్ప్లే అవుతుంది.
మా ఫోన్లో యూఐడీఏఐ నెంబర్ సేవ్ చేయమని ఎవరు చెప్పారు? మా సమ్మతి లేకుండా మీరేం చేస్తున్నారు? అంటూ ఓ ట్విటర్ యూజర్ మండిపడ్డారు. ఇప్పుడే మేము దీన్ని నోటీస్ చేశాం. చాలా కొత్త మొబైల్స్ యూఐడీఏఐ 1947 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రీ-స్టోర్ చేసుకుని వస్తున్నాయి. శాంసంగ్, మైక్రోమ్యాక్స్ ఫోన్లలో దీన్ని గమనించాం. ప్రభుత్వ ఆదేశాలతో ఇలా చేస్తున్నారా? అని మరో యూజర్ ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా ఎలా యూఐడీఏఐ నెంబర్‌ను తమ కాంటాక్ట్ లిస్ట్‌లో స్టోర్ చేస్తారంటూ చాలా మంది యూజర్లు ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి పలు స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. దీనిపై యూఐడీఏఐ స్పందించాలని యూజర్లు సీరియస్ అవుతున్నారు. అయితే ఇప్పటికీ దీనిపై యూఐడీఏఐ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
Hi @UIDAI,
Many people, with different provider, with and without an #Aadhaar card, with and without the mAadhaar app installed, noticed that your phone number is predefined in their contact list by default and so without their knowledge. Can you explain why?
Regards,
— Elliot Alderson (@fs0c131y) August 2, 2018
@UIDAI @ceouidai who asked you to get into my phone and store your number?!? What all are u doing without my knowledge?
— Varun Kukreti (@Varunkukreti) August 3, 2018