photo voter slips
-
ఈ క్రెడిట్ అంతా సీతూ పాపదే..
సినీ ఇండస్ట్రీలో ఆదర్శదంపతుల్లో ముందు వరుసలో ఉంటారు మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్. మిస్ ఇండియా, హీరోయిన్ అయినప్పటికి కుటుంబం కోసం తన కెరీర్‌ని త్యాగం చేశారు నమ్రత. మహేష్ బాబుకు గైడ్, ఫ్రెండ్, మెంటార్ అన్ని తానే. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో స్వయంగా వెల్లడించారు మహేష్ బాబు. తన సక్సెస్‌కి నమ్రతనే కారణం అంటూ ప్రశంసలు కురిపించే విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిలో మహేష్, నమ్రతను పట్టుకుని.. కెమరా వైపు చూస్తున్నారు. ‘మన ఉనికికి మూల కారణం.. నాకు ఎక్కువ నమ్మకం కలిగించే విషయం ఏంటంటే ప్రేమతో పాలించడం. లవ్ మాత్రమే మనల్ని సంతోషంగా ఉంచగలదు.. దయ, తాదాత్మ్యం, కరుణ అన్నీ ప్రేమ భావోద్వేగం నుంచే పుట్టుకొస్తాయి. ప్రేమ అనేది నిజమైన, అత్యున్నతమైన భావోద్వేగం. ఒకరిపట్ల ఒకరు ప్రేమగా, దయగా ఉండండి. ఉన్నది ఒకటే జీవితం.. ప్రేమతో జీవించండి. ఇదే నా నిజమైన ఆనందం’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. (చదవండి: వావ్..‘మైండ్ బ్లాక్’ చేసిన సితార) View this post on Instagram The more I think the more I’m convinced the root cause of our Being, is governed by love ❤️ Love is the only emotion that makes us live happy lives .. kindness, empathy compassion all stem from this emotion of love ♥️♥️love is the truest n highest form of being evolved !! This is my perception !! So be loving and be kind and be compassionate people to each other !! We have one live to live and one life to give ♥️♥️♥️#behappy #besafe #bekind this ones with my true happiness !! Pic.Courtesy @sitaraghattamaneni 😂 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Sep 20, 2020 at 12:06pm PDT మరో విశేషం ఏంటంటే సితార ఈ ఫోటోని తీసింది. దాంతో అభిమానులు ఫోటో సూపర్.. క్రెడిట్ అంతా సీతూ పాపదే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక నమ్రత మహేష్ బాబుకి సంబంధించి ఇలాంటి థ్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు సర్కార్ వారి పాటలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రెండు పార్లమెంటు స్థానాలకు 26 మంది, 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. సోమవారం ఉదయం సమావేశ మందిరంలో ఎస్పీ రఘురామిరెడ్డితో కలసి కలెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 30,56,867 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 15,20,377 మంది పురుషులు, 15,36,091 మంది స్త్రీలు, 399 మంది ఇతరులున్నారు. వీరికోసం 3,303 పోలింగ్ కేంద్రాలు చేశారు. ఇందులో అర్బన్ ప్రాంతాల్లో 1,022, గ్రామీణ ప్రాంతాల్లో 2,281 ఉన్నాయి. ఫొటో ఓటరు స్లిప్‌లు పంపిణీ సోమవారం నాటితో పూర్తయింది. జాబితాలో పేరుండి స్లిప్ అందకపోతే పోలింగ్ స్టేషన్ దగ్గర బీఎల్ఓలను సంప్రదిస్తే అందజేస్తారు. 7వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 320 మంది సెక్టోరల్ ఆఫీసర్లు, 379 మంది రూట్ ఆఫీసర్లు ఎన్నికల విధుల్లో ఉంటారు. జిల్లావ్యాప్తంగా 553 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ క్యాస్టింగ్‌తో పాటు 250 మంది మైక్రో అబ్జర్వర్లు కూడా పని చేస్తారు. 8,990 బ్యాలెట్ యూనిట్లు, 7,200 కంట్రోల్ యూనిట్లను వినియోగిస్తున్నారు. ఈవీఎంల మొరాయించే అవకాశం లేకుండా పక్కాగా ఉంచారు. వస్తే రిజర్వులో ఉన్నవాటిని వినియోగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ రోజు ఎంపీ అభ్యర్థులు 9, ఎమ్మెల్యే అభ్యర్థులు 3 వాహనాలను మాత్రమే వినియోగించాల్సి ఉంది. ఎస్పీ రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 16 కంపెనీల బలగాలను వినియోగిస్తున్నాన్నారు. ఆరువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. 78 క్విక్ రియాక్ట్ టీమ్‌లు, 42 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు పని చేస్తాయన్నారు.