physico
-
నల్లగొండలో సూదిగాడు
తెలుగు రాష్ట్రాల్లో సూదిగాడు జనాన్ని వణికిస్తున్నాడు. ఎక్కడ.. ఏ చిన్న సంఘటన జరిగినా సూదిగాడి పనే నని జనం భయపడుతున్నారు. తాజాగా.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం చిన్నారంలో సైకో సైదిగాడు కలకలం సృష్టించాడు. జి.చెన్నారం గ్రామానికి చెందిన సంతోషిణి(20) ఆదివారం ఉదయం చేదబావివద్ద నీళ్లు తోడుతుండగా బైక్‌పై వచ్చిన ఒక యువకుడు ఆమె మూతి బిగబట్టి ఇంజక్షన్ ఇచ్చి బైక్‌లో ఉడాయించాడు. ఈ హఠాతం సంఘటనకు బెంబేలుపడిన ఆ యువతి కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో వారు వెంటనే ఆమెను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. బైక్‌పై ఉడాయించిన సూదిగాడి కోసం గ్రమమంతా గాలించినా ప్రయోజనం లేకపోయింది. బైక్‌పై యువకుడు ఒక్కడే వచ్చాడని యువతి చెబుతోంది. ఇంజక్షన్ కుచ్చి పరారయ్యాడని చెప్పింది. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. -
సగ్గూరులో సైకో సూదిగాడు కలకలం
విజయవాడ : కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం సగ్గూరులో మంగళవారం సైకో సూదిగాడు కలకలం సృష్టించాడు. స్థానికులు అతడిని అదుపులోకి తీసుకుని దేహశుద్ది చేశారు. అనంతరం అతడిని ఆగిరిపల్లి పోలీసులకు అప్పగించారు. సదరు యువకుడి బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకుని... తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి బ్యాగులో ఇంజక్షన్లు, సూదులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అదుపులోకి తీసుకున్న యువకుడు మతిస్థిమితం లేనట్లుగా మాట్లాడుతున్నాడని పోలీసులు వెల్లడించారు.