picnics
-
ప్రకృతికి ఫ్రెండ్
కాలేజీకి సెలవులు వస్తే యువత విహారయాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్తుండటం సహజమే. కానీ జ్ఞానేశ్వర్ మాత్రం తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రకృతి దగ్గరికి వెళ్లి పలకరిస్తుంటాడు! చిన్నారులతో కలిసి మొక్కలు నాటుతుంటాడు. ప్రకృతి సంరక్షణపై గ్రామస్తులకు సంగీత వాయిద్యాలతో పాటలు పాడి వినూత్నంగా అవగాహన కల్పిస్తుంటాడు. జ్ఞానేశ్వర్‌ది సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామం. ప్రకృతిని పరిరక్షిస్తానని ప్రతిన బూని పాదరక్షలు లేకుండా ఎనిమిదేళ్లుగా పాదయాత్రలు చేస్తున్నారు! జ్ఞానేశ్వర్ ఎంఎస్సీ జువాలజీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిద్దిపేటలో బీఈడీ చదువుతున్నారు. స్వగ్రామం మంజీరా నది పరివాహకంలో ఉండటంతో రోజూ నది అందాలు ప్రకృతి చూస్తూ పెరిగారాయన. 2017లో నది చుట్టుపక్కల ఉన్న చెట్లను నరకడంతో మంజీరా నది మొత్తం ఎండిపోయిన దృశ్యమూ చూశారు. నదిలోని మొసళ్లు గ్రామాల్లోకి వచ్చేవి. పక్షులు మృతి చెందేవి. దీంతో చలించిపోయి మొక్కలు నాటడం మొదలుపెట్టారు. పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టారు. అందుకు బాలల్ని తన సైన్యంగా మలుచుకున్నాడు. చిన్నారులతో కలిసి వేసవి కాలంలో సీడ్‌బాల్స్ (విత్తన బంతులు) తయారు చేసి మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో వాటిని విసిరారు. వర్షాలు కురిస్తే అందులోని విత్తనాలు మొల కెత్తేవి. మొదట్లో చిన్నారులను తీసుకొని వెళ్తే వారి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పేవారు. తర్వాత్తర్వాత వాళ్లూ ముందుకు వచ్చారు. మొక్కలు నాటేందుకు చిన్నారులతో కలిసి వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లేవారు జ్ఞానేశ్వర్. దీంతో గ్రామస్తుల్లోనూ చైతన్యం వచ్చింది. చెట్లను పూజించడం, తామూ మొక్కలు నాటడం ప్రారంభించారు. ఒక్కో దఫా మంజీరా తీరంలో వెయ్యి మొక్కలు నాటాలనే లక్ష్యంతో వెళ్తారు. అక్కడికే విద్యార్థులు భోజనం తెచ్చుకొని సాయంత్రం వరకు మొక్కలు నాటుతారు. జ్ఞానేశ్వర్ గత ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లా, హైదరాబాద్, బీదర్‌లలో సైకిల్ యాత్ర నిర్వహించారు. నిరుడు దసరా సెలవుల్లో మంజీరా నది రక్షించాలని కోరుతూ నారాయణఖేడ్‌లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నదుల ఆవశ్యకతను తెలియజేస్తూ వాటిని ఎందుకు పరిరక్షించుకోవాలో వివరించారు. అలాగే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టంపై హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ ఏడాది దసరా సెలవుల్లోనూ సిద్దిపేట జిల్లా నుంచి నారాయణఖేడ్ వరకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై పాదయాత్ర చేపట్టారు. – రవి ముదిరాజ్ తాటికొండ, సాక్షి, మెదక్ డెస్క్ -
విహారయాత్రల్లో జాగ్రత్తగా ఉంటున్నారా?
సమ్మర్ వచ్చేసింది. ఏడాదిపాటు స్కూల్లో కష్టపడి చదివిన పిల్లలకు వేసవి సెలవులు ఆనందాన్ని పంచుతాయి. టీవీలతో బిజీగా, ఆటపాటలతో విశ్రాంతి లేకుండా, కోరిన వంటలు తింటూ రోజంతా ఇంటిలో చిన్నారులు ఎంజాయ్ చేస్తారు. ఈ ఆనందానికి విహారయాత్రలు కూడ జోడిస్తే? ఎగిరి గంతేస్తారు. ప్లాన్ చేసింది మొదలు ఎప్పుడెప్పుడు వెళదామా అని పేరెంట్స్‌ని తొందర పెట్టేస్తుంటారు. విహారయాత్రల వల్ల పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మెచ్యూరిటీ సాధిస్తారు. అయితే టూర్‌కి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. మీకు ఆ జాగ్రత్తలు తెలుసో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 1. మీరనుకున్న ప్రదేశానికి వెళ్లేటప్పుడు ఎలా ప్లాన్డ్గా టికెట్స్ బుక్ చేసుకుంటారో రిటన్ జర్నీ గురించి కూడా అలానే ప్లాన్ చేసుకుంటారు. ఎ. కాదు బి. అవును 2. దర్శనీయ ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా మీ రోజువారి అలవాట్లలో (భోజ నం, నిద్రపోయే సమయాలు మొదలైనవి) మార్పులేకుండా చూసుకుంటారు. ఎ. కాదు బి. అవును 3. ట్రావెల్ చేసేముందు బాగా రెస్ట్ తీసుకుంటారు. మెడికల్ కిట్, డాక్టర్ ఫోన్ నెంబర్ దగ్గర ఉంచుకుంటారు. ప్రయాణంలో కంఫర్ట్బుల్ డ్రెస్‌లు వేసుకుంటారు. ఎ. కాదు బి. అవును 4. ఎక్కువమంది ఉన్న ప్రదేశాల్లో, బాగా రద్దీగా, గొడవగా ఉండే ప్రాంతాల్లో తక్కువ సమయం గడుపుతారు. మీ కుటుంబ సభ్యులందరూ మీతోనే ఉన్నారా లేదా అని గమనిస్తుంటారు. ఎ. కాదు బి. అవును 5. ట్రిప్‌లో మీతోపాటు వచ్చేవారి ఆరోగ్య పరిస్థితి సరిగా ఉందా లేదా అని గమనిస్తారు. డాక్టరు సలహా పొందుతారు. వారి కేర్ మీరు తీసుకోగలరా లేదా అని గమనిస్తారు. ఎ. కాదు బి. అవును 6. జర్నీ చాలాసేపు కొనసాగేలా ఉంటే టైంపాస్ కోసం ఆటవస్తువులు మీ వెంట తీసుకెళతారు. కెఫైన్ ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. ఎ. కాదు బి. అవును 7. వాహనాన్ని మీ కుటుంబసభ్యులే డ్రైవ్ చేస్తుంటే వారి పక్కనే కూర్చొని వారిని ఉత్సాహపరుస్తారు. జాగ్రత్తగా డ్రైవ్ చేసేలా సహాయపడతారు. ఎ. కాదు బి. అవును 8. విమాన ప్రయాణం చేస్తుంటే బోర్డింగ్‌పాస్‌లు, పాస్‌పోర్ట్ ఇంకా ముఖ్యమైన పేపర్లను జాగ్రత్తగా భద్రపరచుకుంటారు. మతిమరపు ఉన్నవారికి ఇలాంటి ముఖ్యమైన వస్తువులను ఇవ్వరు. ఎ. కాదు బి. అవును 9. హోటల్లో బస చేయవలసి వస్తే విశాలంగా, పిల్లలు జాగ్రత్తగా ఉండే రూమ్‌ని ఎంచుకుంటారు. ఎ. కాదు బి. అవును 10. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తీవ్రంగా స్పందించకుండా భావోద్వేగాలను కంట్రోల్ చేసుకొనే ప్రయత్నం చేస్తారు. ఎ. కాదు బి. అవును బి’ లు ఏడు దాటితే దూరప్రయాణాలప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలుసు. ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తూనే కేర్‌ఫుల్‌గా ఉంటారు. ‘ఎ’ లు ఆరు దాటితే విహారయాత్రలో ఆనందంగా ఉండాలనుకుంటారే కాని జాగ్రత్తలు తీసుకోరు. దీనివల్ల నష్టంతో పాటు ప్రమాదాలూ సంభవిస్తాయి. ‘బి’ లను సూచనలుగా తీసుకొని జర్నీలో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. వివిధరకాల మార్గాల ద్వారా ట్రావెలింగ్ జాగ్రత్తలను తెలుసుకొనే ప్రయత్నం చేయండి. -
వేసవిలో జాతీయ, అంతర్జాతీయ యాత్రలు
పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వగానే రొటీన్ లైఫ్‌కి ఫుల్స్టాప్ పెట్టేసి కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉల్లాసంగా గడపాలనుకుంటారు. ఏడాదంతా పడిన శ్రమను మర్చిపోవడానికి ప్రకృతి ఎదలో ఒదిగిపోయి సేదతీరాలనుకుంటారు. పార్కులు, పార్టీలు, సినిమాలు, రిసార్టులకు భిన్నంగా సెలవులను బట్టి జాతీయ, అంతర్జాతీయ యాత్రలు చేయాలనుకుంటారు. ఈ ఆలోచన గలవారందరినీ దృష్టిలో పెట్టుకుని RV టూర్స్ – ట్రావెల్స్ యాత్రికులకు అనువైన ప్యాకేజీలు అందిస్తూ, చక్కగా సేదతీరేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. ‘నూతన’ ఉల్లాసం రాబోయే నూతన సంవత్సరంలో ఆధ్యాత్మిక యాత్రలు చార్ధామ్, అమరనాథ్ ఇవి రెండూ ఎప్పటికన్నా ముందుగానే ప్రారంభం అవబోతున్నాయి. ఛార్‌ధామ్ యాత్ర 18 ఏప్రిల్ 2018న, అమరనాథ్ యాత్ర జూన్ చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఇవే కాకుండా వేసవితాపాన్ని తట్టుకోవడానికి లడక్, సిక్కిం, సిమ్లా, మనాలి, అండమాన్ నికోబర్, డార్జిలింగ్, ఊటి, కూర్గ్ లాంటి విహారయాత్రలు కూడా ప్లాన్‌లో భాగంగా ఉంటాయి. ఇలాంటప్పుడు వేసవిలో రద్దీ కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే ముందే ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే కావల్సిన సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేయడానికి వీలుగా ఉంటుంది. మన తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ RV టూర్స్ – ట్రావెల్స్ 16 ఏళ్లుగా హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రధాన కార్యాలయంగా యాత్రికుల క్షేమమే ప్రధాన లక్ష్యంగా యాత్రికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించింది. దేశంలో ఒకేసారి కాశీ, రామేశ్వరం, గుజరాత్, మహారాష్ట్ర, చార్ధామ్, అమరనాథ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మానససరోవరం మొదలైన యాత్రలతో పాటు అంతర్జాతీయ యాత్రల ప్యాకేజీలనూ అందిస్తోంది. అంతర్జాతీయ యాత్రలో సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, దుబాయ్, ఇండోనేషియా, వియత్నాం, శ్రీలంక టూర్లకు ఏ మాత్రం ప్రమాణాలు తగ్గకుండా యాత్రల ప్లానింగ్ అమలు చేయడం RV టూర్స్ – ట్రావెల్స్ ప్రత్యేకం. ఒకసారి యాత్ర చేస్తే మరిచిపోలేనంతగా యాత్రికుల మనసులను దోచుకుంటుంది RV టూర్స్ – ట్రావెల్స్. అందుకే ఒక్క యాత్రతో మొదలైన వారి అనుబంధం ప్రతి యేటా విహారయాత్రకో, ఆధ్యాత్మిక యాత్రకో, అంతర్జాతీయ యాత్రకో తప్పకుండా RV టూర్స్ – ట్రావెల్స్ ద్వారానే చేయాలనుకుంటారు యాత్రికులు. RV టూర్స్ – ట్రావెల్స్ ట్రావెల్ ఎక్స్పో ప్రతి యేటా ట్రావెల్ ఎక్స్పోను నిర్వహిస్తున్న RV టూర్స్ – ట్రావెల్స్ నూతన కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా యాత్రికులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. ట్రావెల్ ఎక్స్‌పోలో భాగంగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఆఫీసులను సందర్శించి జాతీయ యాత్రలైన కాశీ, రామేశ్వరం, గుజరాత్, మహారాష్ట్ర, చార్ధామ్, అమరనాథ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మానససరోవరం మొదలైన యాత్రలతో పాటు అంతర్జాతీయ యాత్రల ప్యాకేజీల వివరాలను అందిస్తోంది. అంతర్జాతీయ యాత్రలో సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, దుబాయ్, ఇండోనేషియా, వియత్నాం, శ్రీలంక టూర్లు బుక్ చేసుకున్న ప్రతీ ఒక్కరికి ఎక్స్‌పోలో భాగంగా ఎవ్వరూ ఊహించని విధంగా భారీ డిస్కౌంట్ ఇవ్వనుంది RV టూర్స్ – ట్రావెల్స్. అన్ని జాతీయ, అంతర్జాతీయ యాత్రలకు మరీ ముఖ్యంగా వేసవిలో రద్దీ వల్ల చార్ధామ్, అమరనాథ్ యాత్ర చేసే భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పుడే టికెట్స్ రిజర్వ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడైతే యాత్రా ప్యాకేజీలపై తగ్గింపును కూడా ఇవ్వనున్నారు. ఈ తగ్గింపు ఆఫర్ ద్వారా ఇప్పుడు ప్యాకేజీలను బుక్ చేసుకున్నవారు రాబోయే డిసెంబర్ 2018 వరకూ వినియోగించుకోవచ్చు. RV టూర్స్ – ట్రావెల్స్.. ట్రావెల్ ఎక్స్పో ఈ నెల 21 నుండి 26 వరకు ఉంటుందని, ఈ చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రత్యక్షంగా రాలేని వారు ఫోన్ ద్వారా గాని, ఆన్లైన్ ద్వారా గానీ బుక్ చేసుకునే సౌకర్యం కలద’ని RV టూర్స్ – ట్రావెల్స్ అధినేత RV రమణ భక్తజన కోటికి విజ్ఞప్తి చేశారు. ఎక్స్‌పోకు సంబంధించిన మరిన్ని వివరాలకు హైదరాబాద్ కూకట్పల్లి 7032666925, విజయవాడ 7032666928, విశాఖపట్నం 9100090874 ఫోన్ చేసి గాని www.rvtoursandtravels.net కు లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. నవ్యాంధ్రలో RV టూర్స్ – ట్రావెల్స్ నూతన కార్యాలయాలు: యాత్రికులు కోరుకున్న విధంగా యాత్రలను ఏర్పాటు చేసి, ఎక్కడ ఏ విధమైన ఆటంకం కలగకుండా యాత్రా వసతులు ఏర్పాటు చేసి, యాత్రలంటూ చేస్తే RV టూర్స్ – ట్రావెల్స్ ద్వారానే చేయాలనుకునేంతగా పేరు తెచ్చుకుంది RV టూర్స్ – ట్రావెల్స్. దేశంలోని అన్ని ముఖ్యప్రదేశాల్లో RV టూర్స్ – ట్రావెల్స్ ప్రతినిధులు ఉండటంతో వసతులు, దర్శన ఏర్పాట్లు, పూజాక్రతువులను శాస్త్రబద్ధంగా చేయిస్తారనేది RV టూర్స్ – ట్రావెల్స్ క్లయింట్లు నమ్మే నిజం. వాల్యూ ఫర్ మనీ, క్లయింట్ శాటిస్ఫాక్షన్ అన్న ధ్యేయంతో ముందుకు దూసుకెళ్తున్నRV టూర్స్ – ట్రావెల్స్ ఆధ్యాత్మిక, విజ్ఞాన, విహార, అంతర్జాతీయ యాత్రలు చేయాలనుకునేవారికి తెలంగాణ హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఇప్పటివరకూ ఎన్నో వేలమందికి తమ సర్వీసులందించారు RV టూర్స్ – ట్రావెల్స్. హైదరాబాద్‌తో పాటు నవ్యాంధ్రలోని తెలుగు ప్రజలకు కూడా మరింత చేరువ కావాలనే సంకల్పంతో RV టూర్స్ – ట్రావెల్స్ నూతన కార్యాలయాలను నవ్యాంధ్ర విజయవాడలోని బందర్ రోడ్డు, తాజ్ గేట్ వే హోటల్ ఎదురుగా, విశాఖపట్నంలో దాబా గార్డెన్స్ సెంటర్లో డిసెంబర్ 20న యాత్రా ప్రేమికుల సమక్షంలో RV టూర్స్ – ట్రావెల్స్ అధినేత RV రమణ ప్రారంభించారు. ‘నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, తమ బాధ్యత మరింత పెరిగిందని హైదరాబాద్‌లో ఎలాంటి సేవలు అందిస్తున్నారో నవ్యాంధ్రలోని ఆఫీసుల్లో కూడా అనుభవజ్ఞులైన టూర్ మేనేజర్లను ఏర్పాటు చేసి భారత దేశఃలోని సమస్త పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు అంతర్జాతీయ యాత్రలకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమ’ని RV రమణ తెలియజేశారు. -
వనభోజనాల సందడి
– ఉసిరి చెట్టుకు పూజలు - ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు – హాజరైన ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు కర్నూలు(అర్బన్): జిల్లాలో ఆదివారం కార్తీక వనభోజనాల సందడి కనిపించింది. వివిధ కులాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు, రాజకీయ ప్రముఖులతో ఆయా ప్రాంతాలు కళకళలాడాయి. పద్మశాలి, కురువ, యాదవ, వాల్మీకి, రజక, బ్రాహ్మణ, కుర్ణి (నేసే) తదితర కులాలకు చెందిన సంఘాలు వన భోజన కార్యక్రమాలను నిర్వహించాయి. ప్రజాప్రతినిధిలతోపాటు కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. మహిళలు రాజకీయంగా ఎదగాలి: ఎంపీ బుట్టా రేణుక మహిళలు రాజకీయంగా ఎదగాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. నగర శివారులోని వెంగన్నబావి సమీపంలో కుర్ణి (నేసె) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రిటైర్డు తహసీల్దార్ సీబీ అజయ్‌కుమార్, సంఘం జిల్లా అధ్యక్షుడు బి. వాసుదేవయ్య, దైవాచారం, వనభోజన కార్యక్రమ సభ్యులు చెన్నప్ప, మల్లికార్జున, శేఖర్, సి. నాగరాజు, కేపీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ... వాల్మీకి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాలు స్థానిక వెంగన్నబావి సమీపంలో జరిగాయి. సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రా ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బీటీ నాయుడు, వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సుభాష్ చంద్రబోస్, కానాల వెంకటేశ్వర్లు, కుభేరస్వామి, శ్రీనివాసులు, చిత్రసేనుడు, బాలసంజన్న, మాజీ జెడ్పీటీసీ వలసల రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ... జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో నందికొట్కూరు రోడ్డులోని కేవీఆర్ ఫంక్షన్హాల్లో కురువల 14వ కార్తీక వనభోజనాలు జరిగాయి. ముందుగా కనకదాసు చిత్రపటానికి, ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు, బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళా క్రిష్ణమోహన్, సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు డా.టీ పుల్లన్న, కార్యదర్శి ఎంకే రంగస్వామి, కోశాధికారి కేసీ నాగన్న, మాజీ ఎంపీపీ పెద్ద అమీన్ తదితరులు పాల్గొన్నారు. వీరశైవ లింగాయతీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ... నగర వీరశైవ లింగాయతీ సంక్షేమ సంఘం (గౌళీ) ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో కార్తీక వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా నీలకంఠేశ్వర స్వామికి, ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యాక్రమాలు, ఆటలపోటీలు నిర్వహించారు. యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ... యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని దేవీ ఫంక్షన్హాల్లో యాదవులు కార్తీక వనభోజన కార్యాక్రమాలను నిర్వహించారు. ఆదర్శ కళాశాల అధినేత తిమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజనీరు తిమ్మయ్య, సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావుయాదవ్, సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు శేషుయాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటియాదవ్, నాయకులు శేషఫణి, సింధు నాగేశ్వరరావు, డా.వెంకటరమణ, డా.జీవీ క్రిష్ణమోహన్, డా.శ్రీనివాసులు, డా.నాగేశ్వరయ్య, డా.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో ... రజకుల 5వ కార్తీక వనభోజన కార్యక్రమాలు వెంగన్నబావి సమీపంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ రజక సంఘం లీగల్ సెల్ అధ్యక్షుడు కంభంపాటి కోటేశ్వరరావు మాజరయ్యారు. ఈ సందర్భంగా 10, ఇంటర్లో మంచి మార్కులు సాధించిన రజక విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు సీపీ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ లింగమయ్య, నాయకులు శంకర్, రాజు, గణేష్, నరసింహులు, బీసన్న తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ... పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో లయన్ కొంకతి లక్ష్మినారాయణ అధ్యక్షతన ఆదర్శ కళాశాల మైదానంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ బుట్టా రేణుక, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్‌భాస్కర్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ భరత్ హాజరయ్యారు. సంఘం కార్యదర్శి విజయకాంత్, వెంకటసుబ్బయ్య, దవరథరామయ్య, ప్రముఖ నేత్ర వైద్యులు డా.చెన్నా ఆంజనేయులు, కస్తూరి ప్రసాద్, భావనారాయణ, కాంచానం బాలాజీ, మహిళా విభాగం అధ్యక్షురాలు యు భారతీ తదితరులు పాల్గొన్నారు.