వనభోజనాల సందడి
వనభోజనాల సందడి
Published Sun, Nov 20 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
– ఉసిరి చెట్టుకు పూజలు
- ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
– హాజరైన ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు
కర్నూలు(అర్బన్): జిల్లాలో ఆదివారం కార్తీక వనభోజనాల సందడి కనిపించింది. వివిధ కులాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు, రాజకీయ ప్రముఖులతో ఆయా ప్రాంతాలు కళకళలాడాయి. పద్మశాలి, కురువ, యాదవ, వాల్మీకి, రజక, బ్రాహ్మణ, కుర్ణి (నేసే) తదితర కులాలకు చెందిన సంఘాలు వన భోజన కార్యక్రమాలను నిర్వహించాయి. ప్రజాప్రతినిధిలతోపాటు కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.
మహిళలు రాజకీయంగా ఎదగాలి: ఎంపీ బుట్టా రేణుక
మహిళలు రాజకీయంగా ఎదగాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. నగర శివారులోని వెంగన్నబావి సమీపంలో కుర్ణి (నేసె) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రిటైర్డు తహసీల్దార్ సీబీ అజయ్‌కుమార్, సంఘం జిల్లా అధ్యక్షుడు బి. వాసుదేవయ్య, దైవాచారం, వనభోజన కార్యక్రమ సభ్యులు చెన్నప్ప, మల్లికార్జున, శేఖర్, సి. నాగరాజు, కేపీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ...
వాల్మీకి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాలు స్థానిక వెంగన్నబావి సమీపంలో జరిగాయి. సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రా ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బీటీ నాయుడు, వీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సుభాష్ చంద్రబోస్, కానాల వెంకటేశ్వర్లు, కుభేరస్వామి, శ్రీనివాసులు, చిత్రసేనుడు, బాలసంజన్న, మాజీ జెడ్పీటీసీ వలసల రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ...
జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో నందికొట్కూరు రోడ్డులోని కేవీఆర్ ఫంక్షన్‌హాల్‌లో కురువల 14వ కార్తీక వనభోజనాలు జరిగాయి. ముందుగా కనకదాసు చిత్రపటానికి, ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు, బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళా క్రిష్ణమోహన్, సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు డా.టీ పుల్లన్న, కార్యదర్శి ఎంకే రంగస్వామి, కోశాధికారి కేసీ నాగన్న, మాజీ ఎంపీపీ పెద్ద అమీన్ తదితరులు పాల్గొన్నారు.
వీరశైవ లింగాయతీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ...
నగర వీరశైవ లింగాయతీ సంక్షేమ సంఘం (గౌళీ) ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో కార్తీక వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా నీలకంఠేశ్వర స్వామికి, ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యాక్రమాలు, ఆటలపోటీలు నిర్వహించారు.
యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ...
యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని దేవీ ఫంక్షన్‌హాల్‌లో యాదవులు కార్తీక వనభోజన కార్యాక్రమాలను నిర్వహించారు. ఆదర్శ కళాశాల అధినేత తిమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజనీరు తిమ్మయ్య, సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావుయాదవ్, సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు శేషుయాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటియాదవ్, నాయకులు శేషఫణి, సింధు నాగేశ్వరరావు, డా.వెంకటరమణ, డా.జీవీ క్రిష్ణమోహన్, డా.శ్రీనివాసులు, డా.నాగేశ్వరయ్య, డా.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
రజక సంఘం ఆధ్వర్యంలో ...
రజకుల 5వ కార్తీక వనభోజన కార్యక్రమాలు వెంగన్నబావి సమీపంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ రజక సంఘం లీగల్ సెల్ అధ్యక్షుడు కంభంపాటి కోటేశ్వరరావు మాజరయ్యారు. ఈ సందర్భంగా 10, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిన రజక విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు సీపీ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ లింగమయ్య, నాయకులు శంకర్, రాజు, గణేష్, నరసింహులు, బీసన్న తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ...
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో లయన్ కొంకతి లక్ష్మినారాయణ అధ్యక్షతన ఆదర్శ కళాశాల మైదానంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ బుట్టా రేణుక, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్‌భాస్కర్, ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ భరత్ హాజరయ్యారు. సంఘం కార్యదర్శి విజయకాంత్, వెంకటసుబ్బయ్య, దవరథరామయ్య, ప్రముఖ నేత్ర వైద్యులు డా.చెన్నా ఆంజనేయులు, కస్తూరి ప్రసాద్, భావనారాయణ, కాంచానం బాలాజీ, మహిళా విభాగం అధ్యక్షురాలు యు భారతీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement