కెనడా నూతన ప్రధానిగా ట్రూడో
టొరంటో: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఉదారవాదానికి పట్టం కట్టారు. దేశాన్ని పదేళ్లపాటు ఏలిన ప్రస్తుత ప్రధాని స్టీఫెన్ హార్పర్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీని మట్టికరిపించి లిబరల్ పార్టీకి అనూహ్య విజయాన్ని అందించారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 338 సీట్లకుగానూ 184 సీట్లలో లిబరల్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ విజయంతో లిబరల్ పార్టీ నేత, మాజీ ప్రధాని పియరీ ట్రూడో కుమారుడు జస్టిన్ ట్రూడో నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్నారు. మాంట్రియల్లో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ట్రూడో మాట్లాడుతూ కెనడా తిరిగి ఒకప్పటి దేశంగా మారబోతోందని ప్రకటించారు.