పీఈటీ, పండిట్ అప్గ్రేడేషన్ ఉత్తర్వులు విడుదల
అనంతపురం : రాష్ట్రంలో అప్గ్రేడ్ అయిన 2,650 పీఈటీ, పండిట్ పోస్టులను జిల్లాలకు కేటాయిస్తూ విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని ఎస్టీయూ ఏపీ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ జిల్లాలైన వైఎస్సార్ కడపకు అప్గ్రేడ్ అయిన పీఈటీ పోస్టులు 60, అనంతపురం 98, కర్నూలు 110, పండిట్లు కడపకు 76, అనంతపురం 131, కర్నూలు 145 పోస్టులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. 200 మంది విద్యార్థులు మించిన ఉన్నత పాఠశాలలకు సంబంధించి పోస్టులు కేటాయించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారన్నారు. వెంటనే పదోన్నతులు కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే పురపాలక శాఖ ప్రతిపాదించిన పీఈటీ, పండిట్ పోస్టులన్నీ అప్గ్రేడ్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.