Pillalamarri Temple
-
పర్యాటక ప్రదేశాల ఖిల్లా.. సూర్యాపేట జిల్లా
దురాజ్‌పల్లి (సూర్యాపేట) : పర్యాటక ప్రదేశాలకు నిలయం సూర్యాపేట జిల్లా అలరారుతోంది. జిల్లాలో అతి పురాతన కట్టడాలు సంస్కృతికి అద్దం పడుతాయి. తెలంగాణ– ఆంద్రప్రదేష్ రాజాధానులకు 143 కిలో మీటర్ల సమాన దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో అనేక అపురూప కట్టడాలు పర్యాటక ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలు పర్యాటకులకు కను విందుగొలుపుతాయి. పురాతన కట్టడాలు, ఎతైన కొండలు, దట్టమైన అడవులు, ప్రాచీన శిలాయుగం నాటి రాక్షసగుళ్ళు, క్రీస్తు పూర్వం నాటి భౌద్దస్తూపాలు, కాకతీయుల కాలంనాటి ప్రసిద్ధి శివాలయాలు, అపురూప శిల్పలు, మండపాలు, మూసి రిజర్వయర్ ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నిలయం సూర్యాపేట జిల్లా. కాకతీయుల కళ నైపుణ్యం అద్దం పటే పిల్లలమర్రి... జిల్లా కేంద్రానికి 3 కిలో మీటర్ల దూరంలో 65 నెంబర్ జాతీయ రహదారికి 1 కిలో మీటర్ దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామం కాకతీయుల కాలంనాటి శివాలయాలు వారి కాల నైపుణ్యానిక అద్దం పడుతున్నాయి. క్రి.శ 1203లో కాకతీయ సామంతరాజు అయిన రేచర్ల వంశానికి చెందిన బేతిరెడ్డి పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించినట్లు శిలాశాసనాలు తెలుపుతున్నాయి. ఇక్కడ నిర్మించిన శివాలయాలు ఎంతో ప్రసిద్ది చెందాయి. ఎర్రకేశ్వర ఆలయం, త్రికూటేశ్వరాలయం, నామేశ్వరాలయాలు కాకతీయుల కళానైపుణ్యానికి అద్దం పడుతాయి. శిలాశాసనాలు, వైవిద్యభరితమైన శిల్పాలు ఈ ఆలయాలలో ఉంటాయి. సప్త స్వరాలను వినిపించే రాలిస్తంబం, రాతి కట్టడాలు ఇక్కడి ప్రత్యేకత. ఈ దేవాలయాలలో వార్షిక ఉత్సవాలు ఫిబ్రవరి– మార్చి మాసంలో జరుగుతాయి. ఇక పిల్లలమర్రి పినవీరభద్రుడు జన్మించిన గ్రామం పిల్లలమర్రి. ఫణిగిరిలో ప్రసిద్ధ భౌద్ధక్షేత్రం.... జిల్లా కేంద్రానికి 40 కిలో మీటర్ల దూరంలో జనగాం రహదారిపై ఉన్న ఫణిగిరి గ్రామం ప్రసిద్ద బౌద్ధక్షేత్ర పర్యాటక ప్రదేశంగా వెలుగొంతున్నది. ఫణిగిరి కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో క్రీ. పూ 1–3 ఎడి శతాబ్దం నాటి భౌద మహాస్తూపం, మందమైన ఇటుకలతో నిర్మాంచిన చైత్యగదులు, విహారాలు, పాలరాతి శిల్పాలు,భౌద జాతక కథలతో చెక్కిన తోరణాలు, బ్రహ్మలిపిలో ఉన్న శిలా శాసనాలు ఈ ప్రాంత ప్రత్యేకతను చాటుతాయి. పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలలో రోమన్ రాజుల కాలంనాటి బంగారు, వెండి, గాజు, రాగి, నాణాలు దొరికాయి. వీటియి కొండపై భద్రపరిచారు. ఇలా తొవ్వకాలలో బయటపడిన వస్తువులు ప్రాచీన కాలం నాటి ఆనవాళ్లకు ఆధారాలుగా నిలుస్తున్నాయి పురాతన గిరిదుర్గం.. ఉండ్రుగొండ ప్రసిద్ధి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పొడవైన పురాతన గిరిదుర్గంగా ప్రసిద్ధి పొందిన కట్టడాలు ఉన్న ప్రాంతం ఉండ్రుగొండ. జిల్లా కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉండ్రుగొండ చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. చుట్టు కొండలు, దట్టమైన అడవి మద్య ఆద్యత్మికత ఉట్టి పడే విధంగా లక్ష్మీ నర్సింహ్మస్వామి ఆలయం ఉంటుంది. దేశంలోనే ప్రసిద్ధి పొందిన ఉండ్రుగొండ కోట చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. 1370 ఎకరాల విస్తీర్ణంలో నిగనిగలాడే చెట్ల చెట్ల మద్య 9 కొండలను కలుపుతూ 14 కిలో మీటర్ల పొడవులన నిర్మించిన ఎత్తైన దుర్గప్రాకారాలు, కొలనులు, కొండపైన ఉన్న గొలుసుకట్టు నీటి కుంటలు, గృహాల దార్మికతను వెల్లివిరిసే పురాతన దేవాలయాలు ఉండ్రుగొండ ప్రత్యేకత. శాతవాహనులు, కళ్యాణచాళుక్యులు, కాకతీయులు, కుతుబ్షాహాన్లు, రేచర్లరెడ్డి రాజులు, పద్మనాయకులు ఈ కోటను అభివృధ్ది చేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఈ గుట్టలపై శ్రీ లకక్ష్మీ నరసింహస్వామి, గోపాలస్వామి, కాలభైరవుడు, రాజభవనాలు, నర్తకీమణుల గృమాలు, బోగందానిగద్దెమంటపం, చాకలిబావి, మంత్రిబావి, నాటి చారిత్రక వైభవానికి ప్రతీకలుగా ఉన్నాయి. కొండపై నుంచి నాగుల పాహడ్శివాలయం వరకు సొరంగమార్గం ఉండేదని ఈ ప్రాంత ప్రజలు చెపుతుంటారు. తెలంగాణ అతి పెద్ద జాతర... పెద్దగట్టు లింగన్న జాతర తెలంగాణలో సమ్మక్క– సారలమ్మ జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతర జరిగేది సూర్యాపేట జిల్లాలోనే. సూర్యాపేటకు 7 కిలో మీటర్ల దూరంలో దురాజ్‌పల్లి గ్రామంలో ఉన్న పెద్దగట్టు(గొల్లగట్టు) ఏటేటా అభివృద్ధిచెందుతూ పర్యాటక ప్రదేశంగా ఎదుగుతున్నది. ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కోరిన మొక్కులను తీర్చే స్వామిగా పేరొందిన లింగన్న దర్శనానికి ఇప్పుడు ప్రతి రోజు భక్తులు వస్తున్నారు. మత సమైక్యతకు చిహ్నం.. జానపహడ్ దర్గా.. కుల మతాలకు అతీతంగా దర్శించుకునే ప్రదేశం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని జాన్‌పహడ్ దర్గా.. 4 శతాబ్దాల చరిత్ర గల ఈ ధర్గాలో హజ్రత్ సయ్యద్ మోహినుద్ధీన్షా, జాన్సాక్షహిద్రహమత్తుల్లా సమాధులు ఉన్నాయి. ఈ దర్గాను మానవత్వనికి, త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. ఇక్కడ ఉర్సు సందర్భంగా పంచే గందానికి ప్రత్యేకత ఉంది. ఈ దర్గా పర్యాటక ప్రదేశంగా కొనసాగుతున్నది. ఇవే కాకుండా ప్రత్యేక గల అనేక దేవాలయాలు, కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. నాగులపహడ్ శివాలయం, మట్టంపల్లి లక్ష్మినర సింహస్వామి ఆలయం, సూర్యాపేట వెంకటేశ్వరస్వామి దేవాలయ, మిర్యాలలో సీతరామచంద్రస్వామి దేవస్థానం, అర్వపల్లిలో లక్ష్మినరసింహస్వామి ఆలయం, దర్గా తదితర ప్రదేశాలు పర్యాటక శోభను సంతరించుకున్నాయి. -
పురాతన దేవాలయాలు.. పిల్లలమర్రి శివాలయాలు
దురాజ్‌పల్లి (సూర్యాపేట): ఆ ఊరు పేరు వినగానే పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. అక్కడ కొలువైన శివుడు చెన్నకేశ్వరుడు భక్త జనానికి ఆరాద్య దైవంగా వెలుగొందుతున్నారు. అంతేకాకుండా పురాతన దేవలయాలతో అలరారుతున్న ఆ గ్రామం అత్యంత ప్రఖ్యాతిగాంచింది. సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలోని కాకతీయ కళామతల్లికి నిలయమై, ఎన్నో శివాలయాలకు వేదికైంది. "వాణి నా రాణి" అని చెప్పి మెప్పించిన పిల్లలమర్రి పిన వీరభద్రుడిని తన బిడ్డగా నిలుపుకున్న కమనీయ సీమ పిల్లలమర్రి. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కి వెళ్లే 65వ నెంబర్ జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ముఖధ్వారం ఉంది. అంతేకాదు మూసీ కాలువ పక్క నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లంగానే పిల్లలమర్రి గ్రామం వచ్చేస్తుంది. (చదవండి: ఆలుమగల బంధానికి అర్థం చెప్పారు.. ‘ఇదీ బంధమంటే..!’) శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు... పిల్లలమర్రి శివాలయాలు శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు. కాకతీయులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాలం ఈ గ్రామానికి నిజంగా స్వర్ణయుగం. రేచర్లరెడ్డి వంశీయులు కాకతీయులు సేనానులుగా, మహా సామంతులుగా ఆమనగల్లు, ఎలకతుర్తి, పిల్లలమర్రి ప్రాంతాలను పరిపాలించారు. మహాసామంతుడైన రేచర్ల బేతిరెడ్డి ఆమనగల్లును రాజధానిగా చేసుకుని పాలించే రోజుల్లో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించారు. అనంతరం తన రాజధానిని పిల్లలమర్రికి మార్చి పిల్లలమర్రి బేతిరెడ్డిగా ప్రఖ్యాతి గాంచాడు. ఇప్పుడున్న గ్రామ ప్రాంతంలో పూర్వం ఒక గొప్ప వటవృక్షం (మర్రిచెట్టు) ఉండేది. అక్కడికి వేటకు వచ్చిన బేతిరెడ్డికి ఆ చెట్టు క్రింద ధనం లభించిందని, ఆ ధనంతో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించాడని ఒక కథ ప్రచారంలో ఉంది. రాతి దూలాలపై పురాణ గాథాలు..... క్రీ.శ 1195 నాటికి పిల్లలమర్రి బాగా ప్రసిద్ధి పొందింది. కాకతీయ రుద్రదేవుని మరణానంతరం తన తమ్ముడైన నామిరెడ్డికి మహాసామంత ఆధిపత్యం అప్పగించి బేతిరెడ్డి విశ్రాంతి తీసుకున్నాడు. రేచర్ల నామిరెడ్డి నిర్మించిన త్రికూటాలయంలో మూడు శివాలయాలున్నాయి. నామిరెడ్డి తన తండ్రిపేరు మీద కామేశ్వర, తన తల్లి పేరు మీద కాచేశ్వర, తన పేరు మీద నామేశ్వర లింగాలను ప్రతిష్టించాడు. ఈ దేవాలయ ప్రాంగణంలో మరో నామేశ్వరాలయం కూడా ఉంది. అది 1202లో నిర్మించబడింది. తెలుగు భాష మాట్లాడేవారందర్నీ మొదటిసారిగా ఏకం చేసిన వారు కాకతీయులు. రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరుకసాని పిల్లలమర్రిలో తన పేరుమీద ఎరుకేశ్వరాలయాన్ని నిర్మించి శాసనం వేయించింది. ఆలయం సమీపంలో సుబ్బ సముద్రాన్ని తవ్వించింది. దేవాలయంలో పూజల నిమిత్తం భూధానం చేసింది. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతి దూలాలపై భారత రామాయణ గాథలు, సముద్ర మధనం, వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. సప్తస్వరాలు పలికే రాతి స్తంభాలు... నామేశ్వరాలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్త స్వరాలు వినిపించడం ప్రత్యేకత. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తున్నాయి. నిర్మాణంలో ఇసుక పోసి ఏనుగులతో పెద్ద పెద్ద బండలను ఎక్కించినట్లు తెలిసింది. దేవాలయాల్లో నల్లని శిలలపై నగిషీలు, పద్మాలు, హంసలు, నృత్య భంగిమలు,వాయిద్యకారుల ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శివరాత్రికి ఐదు రోజుల పాటు జాతర... మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది దేవాలయాలు శివరాత్రి శోభకు ముస్తాబు చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. (చదవండి: దేశానికే ఆదర్శం.. హైదరాబాద్) -
‘పిల్లలమర్రి’కి పూర్వ వైభవం తీసుకొస్తాం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లాకే తలమానికంగా నిలుస్తున్న పిల్లలమర్రికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే శ్రీని వాస్‌గౌడ్ తెలిపారు. పట్టణంలోని పిల్లలమర్రిని సోమవారం ఆయన సందర్శించారు. మర్రి చెట్టు పరిరక్షణకు చేపడుతున్న చర్యలు తెలుసుకున్న ఆయన మాట్లాడుతూ త్వరలోనే ప్రజల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంత రం దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశా రు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్యతో పాటు తిరుమల వెంకటేశ్, రియాసత్‌ఖాన్, నవీన్‌రాజ్, ఖాద్రీ, చంద్రకాంత్ పాల్గొన్నారు. -
చిత్రాలు అరుదు.. రక్షణ కరువు!
- పిల్లలమర్రి ఆలయంలో కాకతీయుల కాలం నాటి అద్భుత కళ - అవగాహన లేక పాడుచేస్తున్న దేవాలయ సిబ్బంది సాక్షి, హైదరాబాద్: సాగర మథనం.. అమృతం కోసం దేవతలు, రాక్షసులు వాసుకిని తాడుగా చేసుకుని పర్వతంతో చిలు కుతున్నారు.. ఇంతలో గరళం వచ్చింది.. భయంకరమై న ఆ విషం వాసనకు కొందరు రాక్షసులు కిందపడిపోయారు.. ఇలా విషపు ఘాటుకు రాక్షసులు పట్టుతప్పిన తీరు పెద్దగా ప్రచారంలో లేదు.. కానీ... ఏడొందల ఏళ్ల కిందట చిత్రించిన ఓ దృశ్యం దీన్ని ప్రత్యే కంగా తెలుపుతోంది. ఇదొక్కటే కాదు.. రామరావణ యుద్ధంలో కూడా కొన్ని అరుదైన ప్రత్యేకతలు ఆ చిత్రాల సొంతం! ఆ చిత్రాలెక్కడున్నాయో తెలుసా.. సూర్యాపేటకు సమీపంలో ఉన్న పిల్లలమర్రి నామేశ్వరాలయం ఈ అద్భుత, పురాతన కుడ్య చిత్రాలకు వేదికగా ఉంది. ఇలా దేవాలయాల్లో కుడ్య చిత్రాలు అరుదు. పురాతన ఆల యాల్లో ఎక్కడోగాని ఇవి కనిపించవు. నాటి సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక పరిస్థితులకు ఇవి ప్రతిబింబంగా ఉంటాయి. నాటి పరిస్థితులను అంచనా వేసేందుకు ఉపయోగపడతాయి. తెలంగాణలో ఇలా కుడ్య చిత్రాలున్న దేవాలయాలు రెండు చోట్ల మాత్రమే ఉన్నాయని పురావస్తు శాఖ పేర్కొంటోంది. అంత అరుదైన ఈ చిత్రాలు ఇప్పుడు దేవాదాయ శాఖ నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే మూడొంతుల చిత్రాలు ధ్వంస మయ్యాయి. పురావస్తుశాఖృదేవాదాయ శాఖ మధ్య సమన్వయం లేకపోవటంతో ఈ చిత్రాలు అదృశ్యమయ్యే దుస్థితికి చేరుకున్నాయి. కాకతీయుల కాలంలో... పిల్లలమర్రిలో కాకతీయులు త్రికూటాలయాన్ని నిర్మించారు. ఈ శివాలయం కొద్దికాలానికే మహ్మదీయ రాజుల దండ యాత్రలో కొంత ధ్వంసం కాగా.. 14వ శతాబ్ద కాలంలో పున ర్నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ సమ యంలో ఆలయం ముఖ మంటపం రాతి దూలాలపై ఇతిహాసగా«థలను చిత్రాల రూపంలో సంక్షిప్తం చేశారు. ఈ కుడ్య చిత్రాలను సహజ రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. 10 నుంచి 12 అడుగుల పొడవున్న ఈ దూలాలపై అంతే పొడవుతో వీటిని చిత్రించారు. కాలక్రమంలో ఇవి పూర్తిగా మసకబారిపోవటంతో పదేళ్ల క్రితం పురావస్తు శాఖ కెమికల్ ట్రీట్మెంట్ నిర్వహించి మళ్లీ వెలుగులోకి తెచ్చింది. కానీ పరిరక్షణను మాత్రం గాలికొది లేశారు. ఆలయాన్ని నిర్వహించే దేవాదాయశాఖ సిబ్బందికి వీటిపై అవగాహన కూడా లేకపోవటంతో అవి ధ్వంసమ య్యాయి. ఆలయ గోడలకు ఇష్టారీతిలో లైట్లు, స్విచ్ బోర్డులు, వైర్లు ఏర్పాటు చేశారు. అందుకు ఎడాపెడా మేకు లు, కొయ్యలు ఏర్పాటు చేశారు. వైర్లు రాసుకుపోవటంతో చిత్రాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటికైనా పరిరక్షించాలి.. పిల్లలమర్రి ఆలయంలో ఇటీవల ఈ చిత్రాలపై అధ్యయనానికి వచ్చిన ఆంధ్రా యూనివర్సిటీ విశ్రాంత అధ్యాపకు రాలు మైనేని కృష్ణకుమారి.. వాటిని చూసి అబ్బురపడ్డారు. అవి చాలా అరుదని గుర్తించి తాజాగా తాను రాసిన పుస్తకంలో వివరాలు నిక్షిప్తం చేశారు. భావి తరాలకు అందే వీలు లేకుండా ఈ చిత్రాలను నాశనం చేస్తున్నారని ఆమె ‘సాక్షి’ వద్ద వాపోయారు. ఆ చిత్రాలను వెంటనే పరిరక్షించాలని కోరారు. తెలంగాణ జాగృతికి చెందిన శ్రీరామోజు హర గోపాల్ కూడా ఇటీవల వాటిని పరిశీలించి చిత్రాలను ఫొటోల రూపంలో పదిలపరిచే పని ప్రారంభించారు.